Take a fresh look at your lifestyle.

ఈటల ఎపిసోడ్‌!!

‘ఈటల’ ఎపిసోడ్‌ ‌మౌన ముద్ర
కనిపిస్తున్నది రాజకీయ నిద్ర
పైకైతే గిట్లనే కనిపిస్తున్నది
లోపల్లోపల ‘మసులు’ తున్నది

ఎమ్మేల్యేను ‘ఏకాకి’ ని చేసే వ్వుహం
ఎటూ’కదల’ లేని గులాబి వ్యూహం
కంట్లోపెట్టుకొని పంట్లో తీసేందుకు
చుట్టూరా గోతులు తవ్వేందుకు

అమలవుతున్నది రహస్య అజెండా!!
ఎగురనిచ్చేనా ఆత్మ గౌరవ జెండా!!!
కత్తెరశాల కుమార స్వామి
సీనియర్‌ ‌జర్నలిస్టు, ప్రజాతంత్ర

Leave a Reply