Take a fresh look at your lifestyle.

ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలతో ఈటల భేటీ

‌కొవిడ్‌ 19 ‌వ్యాప్తి పట్ల అప్రమత్తంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు చికిత్స అందించేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఇప్పటికే గాంధీ, ఫీవర్‌, ‌హాస్పి•ల్‌, ‌చెస్ట్ ‌హాస్పిటల్‌, ‌వికారాబాద్‌ ‌హాస్పిటల్‌, ‌మిలటరీ హాస్పిటల్‌ను సిద్ధం చేసిన వైద్య, ఆరోగ్య శాఖ ప్రైవేటు మెడికల్‌ ‌కళాశాలల్లో కూడా 50 పడకలను రోగుల కోసం సిద్ధం చేసింది.

ఈ ఆసుపత్రులలో చికిత్స అందించేందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ప్రత్యేక గైడ్‌లైన్స్ ఇస్తామని చెప్పింది. ఈమేరకు వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ‌గురువారం ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలతో భేటీ అయ్యారు. కరోనా పాజిటివ్‌ ‌వచ్చిన వ్యక్తులకు చికిత్స అందించడానికి అవసరమైన చార్జీలను కూడా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. దీనికి ప్రైవేటు ఆసుపత్రులు అంగీకరించాయి. ఈ గంభీరమైన పరిస్థితిలో ముందుకు వచ్చిన ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలను మంత్రి ఈటల అభినందించారు.

Tags: The Department of Medicine and Health, which has prepared Gandhi, Fever, Hospice, Chest Hospital, Vikarabad Hospital, Military Hospital, in private medical departments

Leave a Reply