Take a fresh look at your lifestyle.

12మంది ప్రముఖులతో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు

  • ఆక్సిన్‌, ‌మందుల సరఫరా పంపిణీపై కమిటీ పర్యవేక్షణ
  • జస్టిస్‌ ‌డీవై చంద్రచూడ్‌ ‌నేతృత్వంలోని ధర్మాసనం నిర్ణయం
  •   దేశంలో ఆక్సిజన్‌ ‌సరఫరాపై రంగంలోకి దిగిన సుప్రీం
దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌ ‌సరఫరాను పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది. మెడికల్‌ ఆక్సిజన్‌ ‌సరఫరా సక్రమంగా జరిగేలా చూడటం కోసం 12 మంది సభ్యులతో నేషనల్‌ ‌టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా మెడికల్‌ ఆక్సిజన్‌ అవసరాన్ని మదింపు చేసి, సిఫారసు చేయడంతోపాటు పంపిణీ బాధ్యతలను నిర్వహించడం కోసం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. గ్రావి•ణ ప్రాంతాలకు అత్యవసర మందులు, మానవ వనరులు, వైద్య సంరక్షణ వంటి అంశాలపై శాస్త్రీయ దృక్పథంతో ప్రజారోగ్య సేవలను కూడా ఈ కమిటీ అందజేస్తుంది. జస్టిస్‌ ‌డీవై చంద్రచూడ్‌ ‌నేతృత్వంలోని ధర్మాసనం శనివారం ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా మెడికల్‌ ఆక్సిజన్‌ ‌లభ్యత, పంపిణీని పర్యవేక్షించడానికి 12 మంది సభ్యులతో నేషనల్‌ ‌టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి, అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు శాస్త్రీయంగా, హేతుబద్ధంగా, సమానంగా ఆక్సిజన్‌ అం‌దేలా చూడటం ఈ టాస్క్‌ఫోర్స్ ‌బాధత్యని తేల్చింది.  కొవిడ్‌ ‌చికిత్సకు అవసరమైన మందుల విషయంలోనూ ఈ టాస్క్‌ఫోర్స్ అదే పని చేయనుంది. వివిధ రాష్ట్రాలకు కేంద్రం చేస్తున్న ఆక్సిజన్‌ ‌కేటాయింపులను పునఃసవి•క్షించాలని చెబుతూ అత్యున్నత న్యాయస్థానం ఈ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. అంబులెన్సులు, కొవిడ్‌ ‌కేర్‌ ‌సదుపాయాలు తగినన్ని లేకపోవడం, హోమ్‌ ‌క్వారంటైన్‌లో ఉన్న పేషెంట్లను పరిగణనలోకి తీసుకోవడంలో కేంద్రం విఫలమైందని కోర్టు అభిప్రాయపడింది. ఈ టాస్క్‌ఫోర్స్‌కు వెస్ట్ ‌బెంగాల్‌ ‌యూనివర్సిటీ ఆఫ్‌ ‌హెల్త్ ‌సైన్సెస్‌ ‌మాజీ వీసీ డాక్టర్‌ ‌భబతోష్‌ ‌బిశ్వాస్‌ ‌నేతృత్వం వహించనున్నారు. సుప్రీంకోర్టు నియమించిన నేషనల్‌ ‌టాస్క్‌ఫోర్స్‌లో 12 మంది సభ్యులు ఉంటారు. వీరిలో 10 మంది వైద్యులు. కేంద్ర కేబినెట్‌ ‌సెక్రటరీ ఈ కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి కూడా దీనిలో ఓ సభ్యునిగా వ్యవహరిస్తారు. నేషనల్‌ ‌టాస్క్‌ఫోర్స్ ‌కన్వీనర్‌గా కేంద్ర ప్రభుత్వ కేబినెట్‌ ‌సెక్రటరీ వ్యవహరిస్తారు. ఈయన ఈ కమిటీలో సభ్యుడు కూడా. ఈయన అవసరమైతే తనకు బదులుగా అడిషినల్‌ ‌సెక్రటరీ హోదాకు తక్కువ కానటువంటి అధికారిని నియమించవచ్చని సూచించింది.

Leave a Reply