Take a fresh look at your lifestyle.

నిత్యావసర వస్తువుల హోల్‌సేల్‌ ‌దుకాణాల ఏర్పాటు

నేటి నుండి విక్రయాలు – ఆన్‌లైన్‌ ‌ద్వారా సేవలు
సూర్యాపేట, ఏప్రిల్‌ 28, ‌ప్రజాతంత్ర ప్రతినిధి): జిల్లా కేంద్రానికి శివారులో ఉన్న ఎస్వి డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్‌ ‌కళాశాలల ప్రాంగణంలో నిత్యావసర సరుకులను హ•ల్‌సేల్‌ ‌దుకాణాలను ఏర్పాటుచేస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్‌ ‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ ‌కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతు రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా సూర్యాపేటలో ప్రారంభించిన ఆన్‌లైన్‌ ‌యాప్‌కు అమాంతంగా డిమాండ్‌ ‌పెరుగుతుందని, దీంతో ప్రభుత్వం చికెన్‌, ‌మటన్‌లను కూడా ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు శ్రీకారం చుట్టిందని అన్నారు. కంటైన్మెంట్‌ ‌ప్రాంతాల్లో నిఘా కట్టుదిట్టం చేయాలని తెలిపారు.

ఉదయం 6గంటల నుండి పాలు, కూరగాయలు అన్ని వార్డుల వారీగా అందించే చర్యలు చేశామని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా వ్యవహరించాలని అధికారులకు తెలియజేశారు. ఆన్‌లైన్‌లో మెడిసిన్‌కు ఎక్కువ డిమాండ్‌ ఉన్నందున ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న ఫార్మాసిస్టుల నుల వినియోగించుకోవాలని సూచించారు. రంజాన్‌ ‌మాసం కావడంతో ముస్లిం సోదరులు ఉపవాస దీక్ష వీడిచే సమయానికి పండ్లు అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు. హ•ల్‌సేల్‌ ‌దుకాణాల్లో ప్యాకింగ్‌ ‌సెక్షన్‌లో పనిచేసేందుకు కావాల్సిన సిబ్బందిని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళా సంఘాల ద్వారా సమకూర్చుకోవాలని అన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!