Take a fresh look at your lifestyle.

డిజిటల్ విశ్వవిద్యాలయ ఏర్పాటు.. నిర్మలా సీతారామన్

ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, న్యూ దిల్లీ: డిజిటల్ విశ్వవిద్యాలయం స్కిల్ కోర్సులపై దృష్టి పెట్టండి అని యూనియన్ బడ్జెట్ 2022 ప్రకటించింది. యూనియన్ బడ్జెట్ 2022-23 ప్రకారం ఎడ్యుకేషన్ సెక్టార్ లో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ విద్యపై దృష్టి పెట్టింది. సహజ, జీరో-బడ్జెట్, సేంద్రీయ వ్యవసాయం, ఆధునిక వ్యవసాయం అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాల సిలబస్‌లను రూపొందించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నొక్కి చెప్పారు.

కేంద్ర బడ్జెట్ 2022ను సమర్పిస్తూ, భారతీయ విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను అందించడానికి డిజిటల్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. మహమ్మారి కరోనా వలన సుదీర్ఘకాలంగా స్కూల్స్ మూసివేయడం విద్యార్థుల విద్యాపై ప్రభావం అధికంగా వుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది బడ్జెట్‌లో డిజిటల్ లెర్నింగ్‌పై కేంద్రం దృష్టి సారించింది.

‘హబ్ అండ్ స్పోక్’ నెట్‌వర్క్‌ను రూపొందించి డిజిటల్ విశ్వవిద్యాలయం ద్వారా అన్ని ప్రాంతీయ భాషలలో విద్యార్థులకు పాఠాలను నేర్పుతుందని మంత్రి ప్రకటించారు. ఈ విశ్వవిద్యాలయం దేశంలోని ఇతర కేంద్రీయ విశ్వవిద్యాలయాలతో కలిసి అవసరమైన డిజిటల్ మౌలిక సదుపాయాలు, శిక్షణను అందించడానికి పని చేస్తుంది అని మంత్రి నిర్మలా సీతా రామన్ తెలిపారు.

Leave a Reply