అయోధ్య నగరంలోని రామాలయం ట్రస్టు ఏర్పాటుకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ కసరత్తు చేస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రామాలయం నిర్మాణానికి ట్రస్టును వారం రోజుల్లో ఏర్పాటు చేయనుందని కేంద్ర హోంమంత్రిత్వశాఖ అధికారులు చెప్పారు.అయోధ్యలోని వివాదాస్పద భూమిని రామాలయం నిర్మాణానికి కేటాయిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయోధ్యలో మసీదు నిర్మాణానికి ఐదు ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్ బోర్డుకు అప్పగించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
మసీదు నిర్మాణానికి మూడు ప్లాట్ల ప్రతిపాదనలను యూపీ సున్నీ వక్ఫ్ బోర్డుకు చూపించామని కేంద్ర హోంమంత్రిత్వశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. అయోధ్యలో రాముడి ఆలయం నిర్మాణం కోసం కేంద్ర హోంమంత్రిత్వశాఖ ట్రస్టు బోర్డును ఏర్పాటు చేసి కేంద్ర మంవత్రివర్గ ఆమోదానికి పంపించాలని నిర్ణయించింది. దీంతోపాటు అయోధ్యలో మసీదు నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది.
Tags: Establishment, Ayodhya Ramalaya Trust,Home Ministry of Exercise