Take a fresh look at your lifestyle.

రుయాలో అదనపు ఆక్సిజన్‌ ‌ప్లాంట్‌ ఏర్పాటు

పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌కు సిఎం ఆదేశం
తిరుపతి : తిరుపతి రుయా ఆస్పత్రిలో అదనపు ఆక్సిజన్‌ ‌ప్లాంట్‌ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఆక్సిజన్‌ ‌ప్లాంట్‌ ఏర్పాటు చేసే ప్రదేశాన్ని నేవీ అధికారులు పరిశీలించారు. ఆస్పత్రిలో సోమవారం రాత్రి ఆక్సిజన్‌ ‌సరఫరాలో ప్రెజర్‌ ‌తగ్గి 5 నిమిషాల పాటు అంతరాయం ఏర్పడటంతో 11 మంది కరోనా బాధితులు ఊపిరాడక మృతి చెందిన నేపథ్యంలో మరో ఆక్సిజన్‌ ‌ప్లాంట్‌ ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ ఘటనపై వెంటనే పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కలెక్టర్‌ ‌హరినారాయణన్‌ ‌విచారణ చేపట్టారు. చెన్నై నుంచి ఆక్సిజన్‌ ‌ట్యాంకర్‌ ఆలస్యంతో ఇబ్బంది తలెత్తిందని కలెక్టర్‌ ‌వెల్లడించారు. వెంటనే ఆక్సిజన్‌ ‌పునరుద్ధరించడం వల్ల చాలా మందిని రక్షించామని తెలిపారు.

Leave a Reply