Take a fresh look at your lifestyle.

బోరబండలో 50 పడకల ఐసోలేషన్‌ ‌కేంద్రం ఏర్పాటు

జిహెచ్‌ఎం‌సిలో అంతిమయాత్ర వాహనాలు ప్రారంభం
జీహెచ్‌ఎం‌సీలో నేటి నుంచి ఉచిత అంతిమయాత్ర వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. ఆరు జోన్లలో మొత్తం 14 అంతిమయాత్ర వాహనాలను బుధవారం బల్దియా అధికారులు ప్రారంభించారు. స్మశాన వాటికలో అధిక చార్జీలు వసూలును కట్టడి చేసేందుకు జీహెచ్‌ఎం‌సీ చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్‌తో మరణిస్తే ఉచితంగా అంత్యక్రియలు నిర్వహించాలని మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. దీంతో జీహెచ్‌ఎం‌సీ ఉచిత అంతిమయాత్ర వాహనలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇకపోతే కొరోనా పేషెంట్లకోసం ఉచిత ఐసోలేషన్‌ ‌సెంటర్లను బల్దియా అందుబాటులోకి తీసుకువచ్చింది. బోరబండలో 50 పడకలతో జీహెచ్‌ఎం‌సీ, నాట్కో సంయుక్త ఆధ్వర్యంలో కేర్‌ ‌సెంటర్‌ను అందుబాటులోకి తెచ్చారు.కొరోనా సోకి ఇంట్లో ఉండడానికి ఇబ్బందిపడుతున్న వారికోసం బల్దియా అధికారులు, జీహెచ్‌ఎం‌సీ హైదరాబాద్‌ ‌నగర వ్యాప్తంగా 30 సర్కిళ్లలో ఐసోలేషన్‌ ‌సెంటర్లను ఏర్పాటు చేశారు. బోరబండ స్లమ్‌ ఏరియా, ఎక్కువ బస్తీలు ఉండే ప్రాంతం కావడంతో అధికారులు ఐసోలేషన్‌ ‌కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏర్పాట్లను స్థానిక కార్పొరేటర్‌, ‌మాజీ డిప్యూటీ మేయర్‌ ‌బాబా ఫసీయుద్దీన్‌ ‌చూస్తున్నారు. ఐసోలేషన్‌లో 14 రోజులు ఉండే పేషెంట్‌కు చికిత్సతోపాటు భోజన సదుపాయాలు కూడా కల్పిస్తున్నట్లు బాబా ఫసీయుద్దీన్‌ ‌తెలిపారు.

Leave a Reply