Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో 100 డయాలసిస్‌ ‌సెంటర్ల ఏర్పాటు

  • నాణ్యమైన వైద్యం అందించడంలో దేశంలోనే మూడవ స్థానంలో రాష్ట్రం
  • సైన్యాన్ని ప్రైవేట్‌ ‌పరం చేసేందుకు కేంద్రంలోని బిజెపి కుట్ర
  • సైనికులతో రాజకీయం చేస్తున్నది
  • మంథనిలో మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్‌ ‌‌రావు

మంథని, ప్రజాతంత్ర, జూన్‌ 21 : ‌రాష్ట్రంలో 100 డయాలసిస్‌ ‌సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు తెలిపారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉచిత డయాలసిస్‌ ‌సెంటర్లను ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నట్లు మంత్రి వెల్లండించారు. ప్రభుత్వం ఎంసిహెచ్‌ ‌హాస్పిటల్‌ ‌తీసుకురావడం ద్వారా 60 శాతం డెలివరీలు ప్రభుత్వ హాస్పిటల్‌లో అవుతున్నాయన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వ హాస్పిటల్‌లో నాణ్యమైన వైద్యం అందించడమే సీఎం కేసీఆర్‌ ఆశయమన్నారు. పేదలకు వైద్యం అందించే విషయంలో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించినట్లు తెలిపారు. కేరళ, తమిళనాడు తర్వాత పేదల ఆరోగ్య విషయంలో నాణ్యమైన వైద్యం అందిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో ఉందన్నారు.మంగళవారం మంథని పట్టణంలో 50 పడకల మాత శిశు హాస్పిటల్‌(ఎం‌సిహెచ్‌)‌ని మంత్రి హరీష్‌ ‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి హరీష్‌ ‌రావు మాట్లాడుతూ…ఏడు కోట్ల రూపాయలతో మంథని ప్రభుత్వ ఎంసిహెచ్‌ ‌హాస్పిటల్‌ని నిర్మించుకున్నట్లు చెప్పారు.

డబుల్‌ ఇం‌జన్‌ ‌ప్రభుత్వం అని చెప్పుకుంటున్న బీజేపీ అధికారంలో ఉన్న యూపీ ఆరోగ్య సంచికలో చిట్టచివరి స్థానంలో ఉందన్నారు. బిజెపికి మతం పేరుతో రాజకీయాలు చేయడం తప్ప అభివృద్ధి చేయడం చేతకాదని మండిపడ్డారు.

 

- Advertisement -

కాళేశ్వరం లాంటి మెగా ప్రాజెక్టు కేవలం తెలంగాణ రావడం వల్లనే పూర్తి అయిందని..ఈ కాంగ్రెస్‌, ‌బీజేపీ పార్టీల వల్ల కానే కాకపోవునన్నారు. నిరుద్యోగ యువతను కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ ‌మోసం చేస్తుందన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించే సైనికులతో రాజకీయం చేస్తుందని విమర్శించారు. పెన్షన్‌ ఉం‌డదు..ఉద్యోగ భద్రత ఉండదు..బీజేపీ సైన్యాన్ని ప్రైవేటుపరం చేసే కుట్ర చేస్తుందన్ని ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్నిపత్‌ ‌రద్దు చేయమని పోరాటం చేసే యువతను బ్లాక్‌ ‌మెయిల్‌ ‌చేస్తూ..కేసులు పెట్టి అన్యాయం చేస్తున్నారన్నారు. బీజేపీ మహిళలను మోసం చేసి 400 రూపాయలు సిలిండరు వెయ్యి రూపాయలు చేసిందన్నారు.రై•తు నల్ల చట్టాలు తెచ్చే ప్రయత్నం చేసి రైతులను కూడా మోసం చేశారన్నారు. కేంద్రంలోని బీజేపీ నిర్ణయాలతో 750 మంది రైతుల ఉసురు పోసుకున్నదని మండిపడ్డారు. ఎల్‌ఐసీ, బిఎస్‌ఎన్‌ఎల్‌, ‌రైల్వేలు..ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడమే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పనిగా పెట్టుకుంద•న్నారు.

 

కేసీఆర్‌ ‌వల్లే రామగుండం మెడికల్‌ ‌కాలేజ్‌ ‌మంజూరయిందన్నారు. రామగుండం జగిత్యాల మెడికల్‌ ‌కాలేజీ ఈ సంవత్సరం ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. పుట్ట మధు గారు ఓడిపోవడం దురదృష్టకరం అయినా పార్టీ కడుపులో పెట్టుకుని జడ్పీ చైర్మన్‌ ‌చేసి కాపాడుకుందని, మంథని అభివృద్ధిని ముందుకు తీసుకెళుతుందన్నారు. లధనాపూర్‌ ఆర్‌అం‌డ్‌ఆర్‌ ‌నిర్వాసితుల సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. మళ్లీ మంథని గడ్డమీద గులాబీ జెండానే ఎగురుతుందన్నారు. టీఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలను కడుపులో పెట్టుకుని కపాడుకుంటమని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ‌పెద్దపల్లి ఎంపీ వెంకటేష్‌ ‌నేత, జడ్పీ చైర్మన్‌ ‌పుట్ట మధు, పెద్దపెల్లి ఎమ్మెల్యే మనోహర్‌ ‌రెడ్డి, ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ ,‌స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply