Take a fresh look at your lifestyle.

ఎపిలో ఐఐఎంసి ప్రాంతీయ క్యాంపస్‌ ఏర్పాటు చేయండి

  • కేంద్ర మంత్రి ప్రకాశ్‌ ‌జావడేకర్‌కు ఏపీ ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ ‌దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి విజ్ఞప్తి
  • సానుల నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ‌మాస్‌ ‌కమ్యూనికేషన్‌(ఐఐఎం‌సీ) ప్రాంతీయ క్యాంపస్‌ ఆం‌ధప్రదేశ్‌లో ఏర్పాటు చేయమని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్‌ ‌జావడేకర్‌కు ఏపీ ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ ‌దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్రమంత్రి ప్రకాశ్‌ ‌జావడేకర్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం గురువారం ఏపీ భవన్‌లో శ్రీనాథ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘జర్నలిజంలో ఉన్నత ప్రమాణాలతో కూడిన సంస్థ ఆంధప్రదేశ్‌లో ఏర్పాటయితే వర్కింగ్‌ ‌జర్నలిస్టులతోపాటు విద్యార్థులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది.  సాధ్యాసాధ్యాలు పరిశీలించిన తర్వాత సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని కేంద్రమంత్రి చెప్పారు. క్యాంపస్‌కు సంబంధించి మౌలిక సదుపాయాలు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంటుందని మంత్రి చెప్పారు. ఐఐఎంసీ, రాష్టప్రభుత్వం మధ్య లైజనింగ్‌ ‌చేయడానికి ప్రెస్‌ అకాడమీ సిద్ధంగా ఉందని కేంద్రమంత్రికి వివరించాను. ఐఐఎంసీ ప్రాంతీయ క్యాంపస్‌ ‌వొస్తే జర్నలిజం కమ్యూనిటీకి గర్వకారణం అవుతుంది. ఈ సందర్భంగానే ఐఐఎంసీతో కలిసి సంయుక్తంగా కొన్ని కార్యక్రమాలు రాష్ట్రంలో నిర్వహించాలని భావిస్తున్నామని, అందుకు సహకరించాలని కేంద్రమంత్రిని కోరాను. ఐఐఎంసీ అధికారులతో మాట్లాడతానని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. ఇది వాస్తవ రూపం దాల్చితే ఏపీలో పనిచేస్తున్న జర్నలిస్టులు, జర్నలిజం చదువుతున్న విద్యార్థులకు కార్యక్రమాలు నిర్వహించొచ్చు. రాష్ట్ర విభజన తర్వాత అకాడమీ స్తబ్దుగా ఉంది. ఛైర్మన్‌ ‌బాధ్యతలు స్వీకరించే సమయంలో కరోనా సంక్షోభం ఉన్నప్పటికీ కార్యక్రమాలు కొనసాగించాం. వర్కింగ్‌ ‌జర్నలిస్టులు, యూనివర్సిటీల్లోని జర్నలిజం విద్యార్థులకు 13 జిల్లాల్లోనూ వర్చువల్‌ ‌కార్యక్రమాలు నిర్వహించాం.  ఎనిమిది వేల మంది వర్కింగ్‌ ‌జర్నలిస్టులు వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. వారందరికీ అకాడమీ ప్రచురించిన 12 పుస్తకాలు అందించాం. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వర్కింగ్‌ ‌జర్నలిస్టులు డిగ్రీ, డిప్లొమా చదవాలనుకుంటే వారిని స్పాన్సర్‌ ‌చేయడానికి అకాడమీ ముందుకొచ్చింది. జర్నలిస్టులు చాలా మంది ఆసక్తి కనబర్చారు. దీంతోపాటు వర్కింగ్‌ ‌జర్నలిస్టులకు మూడునెలల సర్టిఫికేట్‌ ‌కోర్సు ప్రారంభిస్తున్నాం. అనుభవజ్ఞులైన ప్రొఫెసర్లు పాఠ్యాంశాలు సిద్ధం చేస్తున్నారు. కోర్సు పూర్తిచేసిన వారికి ఇంటెర్న్‌షిప్‌, ‌ప్లేస్‌మెంట్‌ ‌కూడా ఇప్పించాలని యోచిస్తున్నాం. పిల్లల్ని ఉన్నత చదువులు చదివించడానికి జర్నలిస్టుల ఇబ్బందులు గుర్తించాం. ముఖ్యంగా విదేశాల్లో చదువుకొనే అవకాశం వచ్చే వారి కోసం విదేశీ యూనివర్సిటీలతో చర్చిస్తున్నాం. ప్రవేశాలు, రాయితీల నిమిత్తం ఆయా దేశాల్లో రాష్టప్రభుత్వం తరఫు పనిచేసే వారితో సమన్వయం చేస్తున్నాం.

రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో జర్నలిజం చేస్తున్న వారిని ప్రోత్సహించేలా వర్సిటీ ప్రాంగణాల్లో సెమినార్లు, వర్క్‌షాపులు నిర్వహించి జాతీయ, రాష్ట్రస్థాయి జర్నలిస్టులతో పాఠాలు చెప్పించాలని నిర్ణయించాం. అకాడమీకి రాష్టప్రభుత్వం అందిస్తున్న సహకారానికి  ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు అకాడమీని మరింత పటిష్ఠం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి భావిస్తున్నారు.  ప్రెస్‌ అకాడమీ శిక్షణకే పరిమితంకాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని జర్నలిస్టులు జీవనప్రమాణాలు మెరుగుపడేలా చూడాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో సహకరిస్తోంది. అక్రిడిటేషన్‌ ‌కార్డులు దుర్వినియోగం అవుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అలా జరగకుండా చూసే క్రమంలోనే జాప్యం అవుతోంది. అక్రిడిటేషన్‌ ఇస్తే సరిపోదు..జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, బీమా వంటి మిగతా సదుపాయాలు కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌ ‌మోహన్‌రెడ్డి మొదటినుంచి చెబుతున్నారు. జర్నలిస్టుల ముసుగులో చేరి అసాంఘిక కార్యక్రమాలు చేపడుతున్న విషయాలు కూడా ప్రభుత్వం గుర్తించింది. ఒకట్రెండు పోలీసు కేసులు కూడా నమోదయ్యాయి. బోగస్‌ ‌జర్నలిస్టులను తొలగించి వర్కింగ్‌ ‌జర్నలిస్టులకు ప్రయోజనం కల్పించడానికి సీఎం వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధంగా ఉన్నారు. బోగస్‌ ‌జర్నలిస్టులను ఏరివేసే కార్యక్రమం ప్రారంభమైంది. గతంలో ఎలా ఉన్నా ఇకపై పద్ధతిగా ఉండాలని రాష్టప్రభుత్వం భావిస్తోంది. ఐఐఎంసీ ప్రాంతీయ కార్యాలయం మంజూరు అయితే ఎక్కడ ఏర్పాటు చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం’’ శ్రీనాథ్‌ ‌రెడ్డి వెల్లడించారు.

Leave a Reply