వనపర్తి,మే,12(ప్రజాతంత్ర విలేకరి) : భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షులు బిజెపి నడ్డా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎంపి బండి సంజయ్ పిలుపు మేరకు ఫీడ్ ద నీడ్ సేవా కార్యక్రమం ద్వారా ఖిల్లా ఘణపూర్ మండల అధ్యక్షులు నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం నాడు అప్పారెడ్డి పల్లి మామిడి మాడ గ్రామాల్లో అనూష్ అకాడమి అధినేత బిజెపి నాయకులు అనుజ్ఞారెడ్డి స్వంత నిధులతో ఫేస్ కవర్ మాస్క్‌లు నిత్యవసర వస్తువుల మోది కిట్లను బిజెపి జిల్లా అధ్యక్షులు అయ్యంగారిప్రభాకర్రెడ్డి బివిఆర్ ట్రస్ట్ చైర్మెన్ బూజల వెంకటేశ్వర్‌రెడ్డి సహాయార్థం వంద కుటుంబాలకు వితరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్లో ఉపాధికి దూరమైన గ్రామీణ పేద కుటుంబాలను గుర్తించి పార్టీ తరపున సహాయం చేయాలనే పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రోజు 2లక్షల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నమని అదే విధంగా వనపర్తి జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలలో విస్త•తంగా సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 210 దేశాల్లో విలయతాండవం తేస్తుందని అభివృద్ది చెందింన దేశాలు ఆర్థికంగా వున్న దేశాలు కూడాకరోనాను కట్టడి చేయడంలో విఫలం చెందా యని మన దేశంలో ప్రధాని కట్టడి చేయడంతో పాటు దాదాపు 50 దేశాలకు కరోనా నివారణ మందులు సరఫరా చేశామని చెప్పారు.
జిల్లా ఉపాధ్యక్షులు రామన్న గారి వెంకటేశ్వర్‌రెడ్డి, బుచ్చిబాబు గౌడ్, పెద్ది రాజు, గోపినాయక్ విష్ణువర్దన్ రెడ్డి, ఆంజనేయులు వినయ్, సత్యనారాయణ పాల్గొన్నారు.