లాక్ డౌన్ నేపథ్యంలో పశ్చిమ నియోజకవర్గం 48వ డివిజన్ చంద్రవదన అపార్ట్మెంట్ (మోర్ సూపర్ మార్కెట్) వద్ద పిసిసి సభ్యులు బత్తిని శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో ఇబ్బందులు పడుతున్న సుమారు 200ల మంది కాంగ్రెస్ కార్యకర్తలకు వరంగల్ అర్బన్, రూరల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొని నిత్యావసర వస్తువులతో పాటు మాస్క్లు, శానిటైజర్స్ పంపిణీ చేశారు. ఈ సందర్బంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ పాటించాలని, అనవసరంగా బయట తిరగవద్దని, ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ వాడాలని, చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ కాంగ్రెస్ అద్యక్షుడు కట్ల శ్రీనివాస్ రావు, పిసిసి సభ్యుడు ఈవి శ్రీనివాస్ రావు, టిపిసిసి ఓబిసి డిపార్ట్మెంట్ కన్వీనర్ మోడెమ్ శ్రీధర్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి ధనుంజయ్, వరంగల్ వెస్ట్ బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు నాయిని లక్ష్మారెడ్డి, గ్రేటర్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఎస్.ధనరాజ్, పల్లె రాహుల్ రెడ్డి, గ్రేటర్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బొంత సారంగం, గ్రేటర్ కాంగ్రెస్ కార్యదర్శి చిన్న, ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలువాల కార్తిక్, డివిజన్ అధ్యక్షురాలు గాండ్ల స్రవంతి, వరంగల్ వెస్ట్ యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ తోట పవన్, శ్రవణ్ కుమార్ రెడ్డి, రాంరెడ్డి, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
27వ డివిజన్ లో నిత్యావసర సరుకుల పంపిణీ
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 27వ డివిజన్ మట్టేవాడ లోని కార్పొరేటర్ నివాసంలో సుమారు 400 కుటుంబాలకు బియ్యం, నిత్యావసర వస్తువులు బుధవారం వద్దిరాజు గణేష్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈసందర్భంగా గణేష్ మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో ఏ వ్యక్తి కూడా ఆకలితో ఉండకుండదని చీఫ్ విప్ వినయ్ భాస్కర్ సహకారంతో డివిజన్ లోని వెయ్యి పేద కుటుంబాలకు సరుకులు పంపిణి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ సురేందర్, వద్దిరాజు విక్రమ్, గట్టు చందూ, గొడిశాల సూరజ్, ఎం.డి.షఫీ, రాము, జగన్, శివ, పరశురాములు, రఘురాజ్, సుకుమార్ తదితరులు పాల్గొన్నారు.