Take a fresh look at your lifestyle.

ఈఎస్‌ఐకి బెస్ట్ ‌మెడికల్‌ ‌కాలేజ్‌ అవార్డు

  • అభినందించిన గవర్నర్‌ ‌తమిళిసై సౌందర రాజన్‌
  • ‌కొరోనా సేవలకు వైద్య సిబ్బందికి సన్మానం

ఈఎస్‌ఐ ‌మెడికల్‌ ‌కాలేజ్‌కు బెస్ట్ ‌మెడికల్‌ ‌కాలేజ్‌గా అవార్డు రావడం చాలా సంతోషకరమని గవర్నర్‌ ‌తమిళసై సౌందర రాజన్‌ అన్నారు. ఈఎస్‌ఐ ‌మెడికల్‌ ‌కాలేజ్‌, ‌హాస్పిటల్‌ ‌సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. మెడికల్‌ ‌సిస్టంతో పాటు, మెడికల్‌ ‌కాలేజ్‌లో వసతులు ఏర్పాటు చేసిన డీఆర్‌డీవోకు అభినందనలు తెలిపారు. కోవిడ్‌ 19 ఇప్పు‌డు మన ముందు ఉన్న సవాల్‌ అని… ఈ క్లిష్ట పరిస్థితుల్లో అందరం కలిసి పోరాటం చేయాలని గవర్నర్‌ ‌పిలుపునిచ్చారు. సెక్యూరిటీ దగ్గర నుండి డాక్టర్స్, ‌మెడికల్‌ ‌స్టాప్‌, ‌టెక్నీషియన్స్ ‌వరకు ఈ పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంటున్నారన్నారు. కోవిడ్‌ 19 ‌పై ప్రపంచంలోని దేశాల కంటే భారతదేశము చాలా ధైర్యంగా ఎదుర్కొంటుందని తెలిపారు. మెడికల్‌ ‌స్టాప్‌, ‌మెడికల్‌ ‌వారియర్స్‌కు ఆర్మీ సెల్యూట్‌ ‌చేయడం గర్వించదగ్గ విషయమని గవర్నర్‌ ‌తమిళసై సౌందర రాజన్‌ ‌పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ ఇబ్బంది పెడుతోందని గవర్నర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌ ‌పేర్కొన్నారు.

ఈఎస్‌ఐసీ సనత్‌ ‌నగర్‌లో కరోనా సమయంలో, పేషేంట్లకు సేవ చేస్తున్న వైద్యులను, ఆసుపత్రి సిబ్బందిని ఆమె సన్మానించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ ‌మాట్లాడుతూ.. మనం ముందుగానే అప్రమత్తం కావడం లాక్‌డౌన్‌ ‌విధించుకోవడంతో ఈ వైరస్‌ ‌ప్రభావం మన దగ్గర తక్కువగా ఉందన్నారు.ఈ సమయంలో కరోనా లేని, సాధారణ రోగులను కాపాడుకోవాలని గవర్నర్‌ ‌పిలుపునిచ్చారు.ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. మనం ఎలాంటి సమస్య వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో మెడికల్‌ ‌సిబ్బంది ఈ వైరస్‌ ‌ద చాలా బాగా పని చేస్తున్నారన్నారు.కరోనా చాలా పద్ధతులు నేర్పిందని… వ్యక్తిగత శుభ్రతకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. వైరస్‌ ‌బారిన పడకుండా మన సాంప్రదాయాలు మనల్ని కాపాడుతున్నాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి కలిసి కట్టుగా పని చేస్తున్నాయని తమిళిసై పేర్కొన్నారు.

Leave a Reply