Take a fresh look at your lifestyle.

ఎ‌ర్రబెల్లి వర్సెస్‌ ‌కోమటిరెడ్డి

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉన్నదా? నేను చెప్పే మాటలు వినే ధైర్యం ఉందా? అసలు మీమీద మీకు నమ్మకం ఉన్నదా? ఊరికూ డబ్బాలు కొట్టుకోవడం కాదు,.. నా వెంటరండి, గ్రామాలకు రండి గ్రామల అధ్వాన్న పరిస్థితులు చూపిస్తా అంటూ మునుగోడు శాసనసభ్యులు కొమటిరెడ్డి రాజగోపాలరెడ్డి శనివారం శాసనసభలో టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. గవర్నర్‌ ‌ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంలో మాట్లాడుతై గవర్నర్‌ ‌ప్రసంగంలో అసత్యాలే ఎక్కువగా ఉన్నాయని,, తెలంగాణను భ్రస్టుపట్టించారని ధ్వజమెత్తారు.మిషన్‌భగీరథ, మిషన్‌కాకతీయ వంటి ప్రతీపథకాన్ని ఉదహరించి తూర్పారపట్టారు. గవర్నర్‌‌ప్రసంగం పూర్తిగా కేసీఆర్‌ ‌పొగడటంతోనే సరిపోయిందని, ఏది ఏ రకమైనా ప్రజాస్వామ్యమని ప్రశ్నల వర్షం కురిపించారు.

భిన్నాభిప్రాయాన్ని గౌరవించడంలేదని, ప్రశ్నించే గొంతులపై ఉక్కుపాదం మోపుతున్నారని విమర్శలపై విమర్శలు చేశారు. ఇంతలో రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుజోక్యం చేసుకొని కోమటిరెడ్డి మాటలను అడ్గుకున్నారు.ఈ సందర్భంలో దయాకర్‌రావును సీఎంను మడతపెట్టి విమర్శించారు. దయాకరరావుది తప్పులేదని, తెలంగాణ రాష్ట్ర ఉద్యమద్రోహులను మంత్రివర్గంలోకి తీసుకున్న సీఎం కేసీఆర్‌దే తప్పని విరుచుకుపడ్డారు.ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి తో పాటు కొన్ని కుటుంబాలు మాత్రమే బాగుపడ్డాయని రాష్ట్రంలోని కోట్లాది కుటుంబాలకు ఒరిగింది ఏమీలేదని కోమటిరెడ్గి టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంపై దాడి చేశారు. తెలంగాణలో ఏ దవాఖానాలో కూడా మందులు దొరకడంలేదని, నిరుపేదలు కూడా నిస్షహాయ స్థితిలో కార్పొరేట్‌ ‌బాట పడుతున్నారని, ప్రభుత్వ దవాఖానాల్లో కేసీఆర్‌ ‌కిట్‌లు తప్ప మరే ఇతర మందులు లభించడంలేదని తూర్పారపట్టారు.

నిన్ను ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతరు …..ఎర్రబెల్లి దయాకరరావు:

errabelli
ప్రజలు నిన్ను ఉరికిచ్చి కొడుతరు

కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి మాట్లాడుతుండగా మధ్యలో జోక్యం చేసుకొని ఎర్రబెల్లి దయాకరర్‌రావు రెడ్డి మాటలకు అడ్డుతగిలారు ఆయనను మాట్లాడనివ్వలేదు. గ్రామాల్లో పట్టణాల్లో అభివృద్ది లేదంటే ప్రజలు కోమటిరెడ్డిని ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతరని హెచ్చరించారు. తెలంగాణలోని ఏ గ్రామపంచాయతీకైనా పొదాం పద అంటూ కోమటిరెడ్డికి సవాల్‌ ‌విసిరారు. ఈ వాదనకు కోమటిరెడ్డి బదులిస్తూ ఇందులో దయాకరరావు తప్పులేదని, ఉద్యమద్రోహులను మంత్రివర్గంలోకి తీసుకున్న కేసీఆర్‌దే తప్పని ఆయన అంతేఘాటుగా స్పందించారు.శాసనసభ్యులు మంత్రులు కేసీఆర్‌ ‌భజనయ పరులు కావద్దని వాస్తవాలు మాట్లాడేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపు నిచ్చారు.శివ్వన్నగూడెంలో ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసి ఎన్ని సంవత్సరాలు అయ్యిందో చెప్పాలని సవాల్‌ ‌విసిరారు.

ati reddy
నువ్వు తెలంగాణ ద్రోహివి

మునుగోడు నియోజకవర్గంలో చాలా గ్రామపంచాయతీలకు మిషన్‌భగీరథ మంచినీళ్లు రాలదేని పేర్కొన్నారు.తన నియోజకవర్గ అభివృద్ధి భవనం నిర్మాణం 14 మాసాలుగా నిలిచిపోయిందని,కాంట్రాక్టర్లకు బిల్లులు సకాలంలో ఇవ్వలేకపోవడంవల్ల భవనాలను నిర్మించడంలేదని విమర్శించారు. ఎర్రబెల్లి వంటివారు ఈ విషయాలను తెలుసుకోవాలని ఎద్దేవా కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌సభ్యులు మంత్రులు మాట్లాడినప్పుడు తాము నిశ్శబ్దంగా ఉన్నామని, అందుకని తాను మాట్లాడేటప్పుడు సహనంతో ఉండాలని విజ్ఞప్తి చేశారు.అయితే తన మాటలను వినేందుకు చాలా ధైర్యం ఉండాలని కోమటిరెడ్డి సవాల్‌ ‌విసిరారు.

Leave a Reply