Take a fresh look at your lifestyle.

తొలిగిపోయిన కరువు పీడ..!

Eradicated Drought
గోదావరి తీరం ఇక నిండుగా కళకళ
కాళేశ్వరంతో కరువును పారదోలుతున్నాం
మిడ్‌ ‌మానేరు లింక్‌ ‌విజయవంతంగా పూర్తి
నిండుగా మిడ్‌మానేరు, లోయర్‌ ‌మానేరు డ్యాంలు

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగమైన..మిడ్‌ ‌మానేరు లింక్‌ ‌విజయవంతంగా పూర్తి అయిందని, దీంతో ఈ ప్రాంతంపూర్తిగా కరవుకు దూరమైనేట్లనని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌పేర్కొన్నారు. మిడ్‌ ‌మానేరు నుంచి 50 టీఎంసీలు కాళేశ్వరం కంట్రిబ్యూటి కింద ఎస్సారెస్సీతో సంబంధంలేకుండా ఎత్తిపోసుకోవడం జరిగిందన్నారు. ఇప్పుడు మనకు రెండు రిజర్వాయర్లు నిండుగా ఉన్నాయన్నారు. రెండు బ్యారేజీల దగ్గర 100 టీఎంసీలు ఉంటాయన్నారు. ఎస్సారెస్పీతో సంబంధం లేకుండా…దిగువ ఆయకట్టులో అద్భుతంగా రెండు పంటలు పండుతాయని సీఎం అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీఎం కేసీఆర్‌ ‌పర్యటించారు. కాళేశ్వరం జలాలతో నిండిన మిడ్‌ ‌మానేరు ప్రాజెక్టును సందర్శించారు. జీరో పాయింట్‌ ‌నుంచి గేట్ల వరకు ప్రాజెక్టును పరిశీలించారు. అనంతరం గోదారమ్మకు సీఎం కేసీఆర్‌ ‌ప్రత్యేక పూజలు నిర్వహించారు. మిడ్‌ ‌మానేరుకు పుష్పాభిషేకం చేసి జలహారతి ఇచ్చారు. అంతకుముందు, రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కేసీఆర్‌ ‌దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేసీఆర్‌ ‌వెంట మంత్రులు కేటీఆర్‌, ‌కొప్పుల ఈశ్వర్‌, ఈటల రాజేందర్‌, ‌పలువురు నేతలు, అధికారులు ఉన్నారు. మిడ్‌మానేరుకు జలహారతి ఇచ్చిన సందర్భంగా ఆయన డియా సమావేశంలో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్‌ ‌భాగంగా ఉన్నటువంటి అప్‌టూ మిడ్‌మానేరు లింక్‌ ‌విజయవంతంగా పూర్తయిన సందర్భంగా సుమారు 50 నుంచి 60 టీఎంసీలు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా శ్రీరాంసాగర్‌ ‌ప్రాజెక్టుతో సంబంధం లేకుండా నీటిని ఎత్తిపోసుకోవడం జరిగింది. దానితో మిడ్‌మానేరు, లోయర్‌ ‌మానేరు డ్యాంలు నిండుగా ఉన్నాయి. దీనిలో కనిపించే తక్షణ లబ్ది శ్రీరాంసాగర్‌ ‌ప్రాజెక్టుతో ఏ మాత్రం సంబంధం లేకుండా దిగువన ఉండే ఆయకట్టు మొత్తం, కొత్త ఆయకట్టు కలుపుకుని అద్భుతంగా రెండు పంటలు పండే ఆస్కారం ఏర్పడింది. రైతులు మొగులుకు మొఖం చూడకుండగా నిశ్చింతగా రెండు పంటలు పండించుకునే అవకాశం లభించింది.

ఇది వాస్తవానికి 2001 ఏప్రిల్‌లో కరీంనగర్‌ ఎస్సార్‌ ‌కాలేజీలో తొలి సిహగర్జన సభలో నేను ఆరోజు చెప్పాను. దానిని వాస్వతరూపంలోకి తీసుకుని వచ్చామన్నారు. డిసెంబర్‌లో కూడా 17 టీఎంసీల నీరు ప్రాణహిత నుంచి వస్తుందని చెప్పారు. దీంతో ఈ ప్రాంతానికి శాశ్వతంగా కరవు తీరిపోయిందని, ఇక్కడ వర్షం పడకపోయినా రైతులు రెండు పంటలు పండించుకునే అవకాశం ఉందని కేసీఆర్‌ అన్నారు. ప్రాణహిత నుంచి ఏడాదంతా నీరు వస్తుందని, ఈ ప్రాంతానికి కరువు పీడపోయిందని సీఎం కేసీఆర్‌ ‌చెప్పారు. జీవనది ఉన్నా కరీంనగర్‌, ‌నిజామాబాద్‌, ‌ఖమ్మంలో కరువు ఉండేదని, తెలంగాణ పోరాట ఫలితాలు సఫలమవుతున్నాయన్నారు. రాష్ట్రంలో 1230 చెక్‌ ‌డ్యామ్‌లు ఉన్నాయని, అందులో ఎక్కువ భాగం కరీంనగర్‌ ‌జిల్లాలోనే ఉన్నాయని తెలిపారు. మానేరు వాగుపై 29, మూలవాగుపై 10 చెక్‌ ‌డ్యామ్‌లకు త్వరలో టెండర్లు పిలవనున్నట్లు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో జూన్‌లోపు చెక్‌డ్యామ్‌లు నిండాలని సీఎం కేసీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. కరీంనగర్‌ను పాలుకారే జిల్లాగా తయారు చేస్తామని సీఎం కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ రైతులు రూ.40 వేల కోట్లు పెట్టి బోర్లు వేయించుకున్నారని, దేశంలో ఎక్కడా లేనన్ని బోర్లు తెలంగాణలో ఉన్నాయన్నారు. భూగర్భ జలాలు పెరగాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. మిడ్‌మానేరు సజీవంగా ఉంటుందని చెబితే… కొందరు సన్నాసులు వెకిలిగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాంపల్లి గుట్టను టూరిజంశాఖకు అప్పగిస్తామన్నారు. సిరిసిల్ల కొండలు పాపికొండల్ని తలదన్నేలా తయారవుతాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వివక్షకు గురయ్యామని, తెలంగాణ ఫోరాట ఫలితాలు సఫలమవుతున్నాయని సీఎం కేసీఆర్‌ అన్నారు. 140 కి. మేర గోదావరి సజీవంగా ఉంటుందని, ప్రాజెక్టులు నిండడంతో గ్రౌండ్‌వాటర్‌ ‌భారీగా పెరిగిందన్నారు. రాష్ట్రంపై తమ పార్టీకున్నంత కమిట్‌మెంట్‌ ఏ ‌పార్టీకి ఉండదని కేసీఆర్‌ అన్నారు. ఉమ్మడి కరీంనగర్‌ ‌జిల్లాలో 46 వాగులు ఉన్నాయని, ప్రాజెక్టుల్ని పూర్తి చేయడంలో రాజకీయ వివక్ష చూపలేదని సీఎం కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు. కాంగ్రెస్‌, ‌బీజేపీ నేతలకు కనీస పరిజ్ఞానం లేదని విమర్శించారు. ఎవరూ ఎన్ని అడ్డంకులు సృష్టించినా ముందుకెళ్తామన్నారు. ఇక్కడి నుంచి సూర్యాపేట జిల్లాకు నీళ్లు వెళ్తున్నాయని, 30 ఏళ్లుగా నిండని చెరువులను కూడా నింపుకున్నామని సీఎం కేసీఆర్‌ ‌వ్యాఖ్యానించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు గోదావరి ఒడ్డున ఉన్న జిల్లాలు సంపూర్ణమైన వివక్షకు గురయ్యాయి. వరంగల్‌, ‌ఖమ్మం, నిజామాబాద్‌, ‌కరీంనగర్‌, ‌నిర్మల్‌ ఏరియాల్లో కరువు ఉండకూడదు. కాని తీవ్ర వివక్ష కారణంగా ఈ జిల్లాలు కరువుతో అల్లాడిపోయాయి. తెలంగాణ రాష్ట్రం సాకారమైతే గోదావరి డేల్టాకంటే అద్భుతంగా ఉంటాయని ఆ రోజు నేను చెప్పడం జరిగింది. ఈ రోజు ఆ కల నిజమైనందుకు చాలా సంతోషంగా ఉంది. మిడ్‌ ‌మానేరు ప్రాజెక్టు ద నిలుచొని పూజ చేస్తున్నప్పుడు చాలా ఆనందం కలిగిందన్నారు. ఇదే జిల్లా నుంచి దుబాయి, గల్ఫ్ ‌దేశాలకు వలసలు వెళ్లారు. సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాలు పూర్తిగా కరువు బారిన పడ్డాయి. ఏడు వందల నుంచి 9 వందల ఫీట్ల వరకు బోర్లు వేసినా నీళ్లు పడలేదు. కరెంటు బాధలు తాళలేక జమ్మికుంటలో బిక్షపతి అనే యువకుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. సిరిసిల్లలో చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. చావులు పరిష్కారం కాదు.. చావకండి అని అప్పటి కలెక్టర్‌ ‌గోడలపై నినాదాలు రాయించారు. 60 ఏండ్ల స్వతంత్రం తరువాత ఈ నినాదాల మనం చూసేది అని కండ్ల నీళ్లు వచ్చినై. కాని ఇప్పుడు లక్ష్మీ, సరస్వతి, పార్వతీ బ్యారేజీలు అన్ని కలిపి 145 కిలోటర్ల గోదావరి 365 రోజులు సజీవంగా ఉంటుంది. ఇది కరీంనగర్‌ ‌జిల్లాకు జీవధార. అటు పక్క, ఇటు పక్కన ఉన్న బోర్ల నుంచి నీరు మోటర్ల లేకుండానే నీళ్లు పోస్తున్నాయి. మిడ్‌ ‌మానేరు పుణ్యమా అని భూగర్భ జలాలు అద్భుతంగా పైకి ఎగిసిపడుతున్నాయి. కాకతీయ కాలువ పాత కరీంనగర్‌ ‌జిల్లాలో 200 కిలోటర్లు పారుతుంది. కాకతీయ కాలువ రెండు పంటలకు తొమ్మిది నెలలు పారుతుంది. వరుద కాలువ కూడా 160 కిలోటర్లు జిల్లాలో ఉంటుంది. ఈ కాలువ మొత్తం 365 రోజులు నిండే ఉంటుంది. జిల్లాలో అన్నింటికన్న పొడవైన నది మానేరు. 181 కిలోటర్ల మానేరు నది సజీవంగా ఉంటుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1230 చెక్‌డ్యాంలకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. అందులో సింహభాగం కరీంనగర్‌ ‌జిల్లాలోనే ఉన్నాయి. రూ.1250 కోట్లతో కరీంనగర్‌ ‌జిల్లాలో రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాలని, మానేరు రివర్‌పై 29 చెక్‌డ్యాంలు, మూలవాగుపై 10 చెక్‌డ్యాంలు నిర్మించేందుకు టెండర్లు పిలవాలని ఆదేశాలు జారీ చేశాం. నీళ్లు వృధా పోకుండా జూన్‌లోగా ఈ చెక్‌డ్యాంలు నిండాలని ఆదేశించామని కూడా వెల్లడించారు.

Tags: mid maneru, cm kcr, opening, kaleswaram water, karimnagar

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy