Take a fresh look at your lifestyle.

పెనుసవాళ్లతో పర్యావరణ సమస్య, మేలుకొంటేనే భవిష్యత్‌!

మనం తినే ఆహారం,పీల్చే గాలి ,త్రాగే నీరు ,నివసించే ఇల్లు అన్ని ప్రకృతి నుండే లభిస్తాయి.ప్రకృతి పచ్చదనం గా ,ఆహ్లాద కరంగా ఉంటే ఆనందమయ మైన జీవితాన్ని అనుభవిస్తారు.ప్రకృతిని ప్రేమిస్తే పర్యావరణాన్ని ఆస్వాదించవచ్చు.ప్రతి జీవికి జీవనాధారం ఆక్సీజన్‌ ,‌పచ్చదనం గా ఉండే చెట్టు గాలిని శుభ్రం చేస్తూ స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి. సుమారు 22 కిలోల కార్బన్‌ ‌డయాక్సైడ్‌ ‌ను గ్రహించి ఆక్సిజన్‌ ‌విడుదల చేస్తుంది. అందుకే పర్యావరణ చర్యలకు సూచకంగా 1974 సంవత్సరం నుండి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపు కుంటున్నాం. పర్యావరణ పరిరక్షణ కై, పర్యావరణంపై అవగాహన కొరకు , పర్యావరణ సమస్యల పరిష్కారానికి ఐక్యరాజ్యసమితి మొట్టమొదటిసారిగా ప్రతి సంవత్సరం జూన్‌ 5‌వ తేదీన పర్యావరణ దినం జరపాలని తీర్మానించింది. పర్యావరణ సమస్యలు ఐ న మానవ జనాభా, గ్లోబల్‌ ‌వార్మింగ్‌, ‌వన్యప్రాణుల నేరాలు, అడవుల నరికివేత, జీవ వైవిధ్యం, గాలి కాలుష్యం, ప్లాస్టిక్‌ ‌వాడకం, జంతువుల రక్షణ, ఎడారులు, వంటి ప్రధాన అంశాలుగా ప్రపంచ వేదికకు నాంది పలికింది.

ఐక్యరాజ్యసమితి ప్రతియేటా సుమారు 143 దేశాలు పర్యావరణ దినోత్సవం అ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేవిధంగా చర్యలు తీసుకున్నది. వాస్తవంగా 1972 లోనే ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ లో మానవ చర్యలు, పర్యావరణం పరిరక్షణ అంశాలపై అమెరికాలోని స్టాక్‌ ‌హోమ్‌ ‌లో మొట్టమొదటిసారిగా చర్చలు చేసిన తర్వాత రెండు సంవత్సరాలకు 1974లో ‘‘ఓన్లీ వన్‌ ఎర్త్’’అనే ఇతివృత్తంతో పర్యావరణ వేడుకలు జరిపాయి. దాదాపు ఐదు దశాబ్దాల కు పైగా పర్యావరణంపై అవగాహన పెంచడం కోసం అం ఒక్క సంవత్సరం ఒక్కొక్క థీమ్‌ ‌తో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల పారిశ్రామికీకరణ నేపథ్యంలో, రసాయనాల వినియోగం, ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు, సునామీలు, అగ్ని పర్వతాలు బ్రద్దలవ్వడం, ధ్వని కాలుష్యం , వివిధ రకాల వైరస్‌ ‌లతో రకరకాల వ్యాధులు సంభవిస్తున్నాయని చెప్పవచ్చును. ఇలాంటి పరిస్థితుల్లో సానుకూల మార్పు కు రైతులు, విద్యార్థులు, ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రతి ఒక్కరూ హరిత భవిష్యత్‌ ‌పై తీవ్రమైన కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.భూగోళం పై సకల జీవ రాశుల, మానవ మనుగడ సాధించుటకై పర్యావరణ పరిరక్షణ చాలా ముఖ్యమైనది. పర్యావరణం నాశనం కావడానికి మూలం గ్లోబల్‌ ‌వార్మింగ్‌. ‌పర్యావరణ పరిరక్షణపై విద్యార్థి దశ నుండి అవగాహన కల్పించాలి .ప్రతి గ్రామంలో చెట్లను నాటాలి. అడవులు అంతరించి పోకుండా చూడాలి.

వాతావరణ కాలుష్యానికి కారణం గ్లోబల్‌ ‌వార్మింగ్‌ అనే విషయం ప్రజలకు తెలియజేయాలి. పర్యావరణ క్షీణత వల్ల సకల జీవరాసులకు స్వచ్ఛమైన గాలి అందక ఊపిరితిత్తులు, క్యాన్సర్‌ ‌వంటి వ్యాధులు, ఆస్తమా,మానసిక రుగ్మతలు, మలేరియా, ఫ్లోరోసిస్‌ ‌వంటి సమస్యలు వస్తాయి. వాడి పడేసిన ప్లాస్టిక్‌ ‌కొన్నేళ్లుగా భూమిలో కరగడం వల్ల భూగర్భజలం తగ్గి తాగునీరు, సాగునీరు ఇబ్బంది అవుతుంది. పర్యావరణ హిత కార్యక్రమాలు చేపట్టడం వల్ల స్వచ్ఛమైన గాలి , నీరు పొందుతాము. సహజ వనరుల ద్వారా మొక్కలు,జంతువులు ఆహారాన్ని పొందుతాయి. భూగోళం లో మానవులు,జంతువులు, మొ క్కలు,పక్షులు,సకల జీవులు పర్యావరణంలో బాగం కాబట్టి ప్రపంచ ఎదుర్కొంటున్న సవాళ్ల ను అధిగ మించుటకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. వాతా వరణం లో సంభవించే మార్పుల కు అనుగుణంగా చెట్లను నాటడం,చెక్‌ ‌డ్యాంల నిర్మాణం ,స్వచ్ఛ భారత్‌ ‌వంటి కార్యక్రమాల అమలు చేయాలి.సభలు ,సమావేశాలు,చర్చలు ,మీడియా ద్వారా బహుళ ప్రచారం చేయాలి.

ఐక్యరాజ్యసమితి ఈ సంవత్సరం జర్మనీ దేశ భాగస్వామ్యంతో కొలంబియా నగరంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జీవవైవిధ్య దినోత్సవం గా జరుపుటకు నిర్ణయం తీసుకుంది. అంతరించిపోతున్న జీవ వైవిధ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భూ గ్రహం యొక్క జీవవైవిధ్యంలో పది శాతం కలిగిన కొలంబియా ప్రపంచంలోనే మెగా డివోర్స్ ‌దేశాల్లో ఒకటి. పక్షుల్లో ఆర్చిడ్‌ ‌జాతుల వైవిధ్యంలో మొదటి స్థానంలో ఉంది. మొక్కలు, సీతాకోక చిలుకలు, చేపలు, ఉభయచరాలు వంటి వైవిధ్యంలో రెండవ స్థానంలో ఉంది . ఒక మిలియన్‌ ‌జాతి జ మొక్కలు, జంతువులు అంతరించిపోతున్న జీవవైవిధ్య సమస్యపై ప్రపంచ దేశాలు దృష్టిపెట్టడానికి ,జీవవైవిధ్యాన్ని పరిష్కరించుటకు 2020 సంవత్సరాన్ని జీవ వైవిధ్య సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. అందుకై భూమి, నీరు, సముద్ర జాతులు, వాటి ఆవాసాలు, భూమిపై జీవిస్తున్న అన్ని జీవుల మనుగడకు జీవ వైవిధ్యం ముఖ్యమని తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ప్రస్తుతం కోవిద్‌19 ‌తో అతలాకుతలమౌతున్న ప్రపంచ దేశాలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. సమాజము, ఆర్థిక వ్యవస్థ పై తీవ్ర ప్రభావం ఎదుర్కొంటున్న భారత్‌ ‌కూడా క్లిష్టమైన సమస్యల్లో పర్యావరణ కాలుష్యం ఒకటి . కోవిద్‌ 19 ‌కు ప్రభావితమైన దేశాలలో వాయు కాలుష్యం నీటి కాలుష్యం, శబ్ద కాలుష్యం తగ్గిందని పర్యావరణ వేత్తలు చెప్తున్నారు. ప్రతి సంవత్సరం కాలుష్యం కారణంగా 1.2 మిలియన్ల మంది మరణిస్తారు . ఉదాహరణకు ప్రపంచంలోనే అత్యధిక కలుషిత నగరాల్లో,సుమారు 15 నగరాలు భారతదేశంలో ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన నివేదికలో తెలిపింది. అంటే వాయు నాణ్యత మనదేశంలో ఇంత తీవ్ర ప్రభావాన్ని చూపుతుందో అర్థమవుతున్నది. భూ ఉపరితలంపై నిశ్శబ్ద కిల్లర్‌ ‌గా వాయు కాలుష్యం విస్తరిస్తున్నది. అలాగే బొగ్గు ఆధారిత రంగంలో కూడా పర్యావరణ నిబంధన అమలు అసాధ్యమని తెలుస్తున్నది. లాక్‌ ‌డౌన్‌ ‌వల్ల 2019 తో పోలిస్తే కార్బన్‌ ‌డై ఆక్సైడ్‌ 5.5 ‌శాతం తగ్గిందని, అలాగే ప్రపంచ ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల సెంటిగ్రేడ్‌ ‌పరిమితం చేస్తే ప్రపంచంలో కార్బన్‌ ‌డయాక్సైడ్‌ ఉద్గారాలు ప్రతి సంవత్సరం 7.6 శాతానికి తగ్గుతాయని విశ్లేషకులు, భౌగోళిక శాస్త్రజ్ఞులు అంటున్నారు. అందుకేఆయా రాష్ట్రాల కాలుష్య నియంత్రణ బోర్డులు లేదా పర్యావరణ మంత్రిత్వ శాఖ పరిశోధనలు , నివేదికలు సమర్పించడంలో విపులమై నందున ఈ సమస్య తీవ్రం అవుతోందని పలువురు పర్యావరణ వేత్తలు, తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందుకై ప్రతి దేశం, ఆ దేశ భౌగోళిక పరిస్థితులు బట్టి ఒక ప్రణాళిక రూపొందించుకొని పర్యావరణ హితమైన కార్యక్రమాలు రూపొందించుకొని అమలు చేస్తేనే తప్ప మానవ మనుగడకు ప్రమాదం సంభవించే ప్రమాదం ఉందని చెప్పవచ్చును.
– సామంతుల .సదానందం, పరకాల ,వరంగల్‌ ‌రూరల్‌ ‌జిల్లా, 98661 36491.

Leave a Reply