వరంగల్: కోటికి పైగా ప్రజలు తరలివచ్చే మేడారం జాతరను పర్యావరణహితంగా జరుపుకోవాలని కోరుతూ ప్రజలను చైతన్యం చేయడం కోసం గురువారం హన్మకొండ కాళోజిసెంటర్ నుండి మేడారం వరకు పాదయాత్రలో వెళ్లారు. మూడు రోజుల పాటు జరిగే ఈ పాదయాత్ర లో దారిన ఉన్న గ్రామాల్లోని ప్రజలను మేడారంలో ప్లాస్టిక్ వాడకుండా పర్యావరణాన్ని కాపాడాలని భోధిస్తూ ఈ పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు. మేడారం చేరిన తర్వాత కూడా ఫిబ్రవరి 8 న మేడారం ముగిసేంతవరకు మేడారం జాతర మొత్తంలో ప్లాస్టిక్ వినియోగించారాదని పర్యావరణాన్ని కాపాడుకోవాలని ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. ఈ పాదయాత్ర ను పారెస్టు చీఫ్ కన్జర్వేటర్ ఎం.జె. అక్తర్ జెండా ఊపి ప్రారంభించగా ప్రముఖ కవి అంపశయ్య నవీన్, బి.సి.స్టడీ ఫోరం కన్వీనర్ సాయిని నరేందర్, రాచకొండ ప్రవీణ్, పీపుల్స్ డెమోక్రాటిక్ ఫ్రంట్ కన్వీనర్ సోమ రామ మూర్తి, డి.ఎఫ్.ఒ. పురుషోత్తం, సైకిల్ వాకర్ అసోసియేషన్ నాయకులు గోపాల్ రెడ్డి, కాళోజి ఫౌండేషన్ నాయకులు నాగిళ్ళ రామశాస్త్రి, పీస్ కమిటీ నాయకులు సిరాజోద్ధీన్, వన సేవా సభ్యులు సందీప్ తదితరులు పాల్గొని ప్రకాష్ కు అభినందనలు తెలిపారు.
Tags: Environmental lover, footsteps, ban plastic, jathara, kalogi centre, medaram, forect chief conservator, mj akbar