Take a fresh look at your lifestyle.

రామాలయంలోకి ప్రవేశాలు పూర్తిగా రద్దు

కరోనా ప్రభావంపై భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి దేవాలయంలోకి భక్తుల ప్రవేశం పూర్తిగా రద్దు చేస్తున్నట్లు దేవస్థానం ఇఓ నరసింహులు తెలిపారు. దేవదాయ ధర్మాదయ శాఖ కమీషనర్‌ ఆదేశాల మేరకు శుక్రవారం మధ్యాహ్నం 1 గంట నుండిశ్రీస్వామివారి ఆలయం ఉపాలయములు, అనుబంధ ఆలయం అయిన పర్ణశాల దేవస్థానములలో దర్శనములను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే వసతి గదుల కేటాయింపులను తదుపరి ఉత్తర్వులు వెలువడినంత వరకు రద్దు చేస్తున్నట్లు తెలిపారు.

అర్చకుల ద్వారా ఆలయ సాంప్రదాయం ప్రకారం శ్రీస్వామి సేవలు ఏకాంతముగా మాత్రమే నిర్వహించటం జరుగుతందని భక్తులకు ఆలయ ప్రవేశం లేదని తెలిపారు. అలాగే ఆలయ ప్రాంగణం ఆలయమునకు సంబంధించిన ప్రాంతాలందు ఎటువంటి కార్యక్రమాలు , వివాహాలు, వాహనపూజలు అనుమతించటం లేదని తెలిపారు. మరలా ప్రభుత్వ ఆదేశాలకు తేదీలను ఖరారు చేసేంతవరకు ఈ నిబంధనలు అమతులో ఉంటాయని తెలిపారు.

Leave a Reply

error: Content is protected !!