Take a fresh look at your lifestyle.

బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌నోడల్‌ ‌కేంద్రంగా ఈఎన్‌టీ

తెలంగాణ ప్రభుత్వం ప్రకటన
హైదరాబాద్‌,‌మే15: బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌కేసుల చికిత్సకు తెలంగాణ ప్రభుత్వం నోడల్‌ ‌కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు కోఠిలోని ఈఎన్‌టీ హాస్పిటల్‌ ‌ని నోడల్‌ ‌కేంద్రంగా అధికారులు ప్రకటించారు. కొవిడ్‌ ‌నుంచి కోలుకున్న వారిలో కొందరికే బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌సమస్య ఉందని డీఎంఈ తెలిపారు. బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌బారిన పడుతున్న వారిలో ఈఎన్‌టీ సమస్యలు వస్తున్నాయి. బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌నిర్ధరణ అయిన బాధితులకు గాంధీ హాస్పిటల్‌ ‌లో చికిత్స అందిస్తామన్నారు.

ఆప్తమాలజీ వైద్యుడి అవసరం ఉంటే సరోజిని దేవీ హాస్పిటల్‌ ‌లో చికిత్స అందించనున్నారు. బ్లాక్‌ ‌ఫంగస్‌కు వాడే ఔషధాలను సమకూర్చాలని టీఎస్‌ఎంఐడీసీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. క్యూకోర్మికోసిస్‌నే సాధారణ పరిభాషలో బ్లాక్‌ ‌ఫంగస్‌ అం‌టారు. ఇదొక ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌. ఇది చాలా ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్‌. ఇప్పు‌డు ఆందోళన కలిగిస్తున్న విషయం ఏమిటంటే కొవిడ్‌ ‌కారణంగా ఈ బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌బారిన పడుతున్న వాళ్ల సంఖ్య ఎక్కువవుతోంది.

గత రెండు రోజుల్లోనే ఈ బ్లాక్‌ ‌ఫంగస్‌తో బాధపడుతున్న వాళ్లు ఆరుగురిని అడ్మిట్‌ ‌చేసుకున్నట్లు గంగారామ్‌ ‌హాస్పిటల్‌ ‌సీనియర్‌ ఈఎన్టీ సర్జన్‌ ‌మనీష్‌ ‌ముంజాల్‌ ‌వెల్లడించారు. గతేడాది కొరోనా తొలిసారి వచ్చినప్పుడు ఈ బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌కారణంగా చనిపోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని ఆయన చెప్పారు. అందులో చాలా మంది కంటిచూపు కోల్పోయిన వాళ్లు, ముక్కు, దవడ ఎముక తీసేయాల్సి వచ్చిన వాళ్లు ఉన్నట్లు డాక్టర్‌ ‌మనీష్‌ ‌తెలిపారు.

Leave a Reply