Take a fresh look at your lifestyle.

మరో 10 పిహెచ్‌సిలకు ఎన్‌క్వాస్‌ ‌గుర్తింపు

ఈ ఘనతతో దేశంలో మూడో స్థానంలో తెలంగాణ
అభినందించిన మంత్రి హరీష్‌ ‌రావు
ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌రాష్ట్రంలోని మరో 10 పిహెచ్‌సిలకు నేషనల్‌ ‌క్వాలిటీ అష్యూరెన్స్ ‌స్టాండర్డ్(ఎన్‌క్వాస్‌) ‌గుర్తింపు లభించింది. దీంతో మొత్తం 125 పిహెచ్‌సిలకు ఈ గుర్తింపు లభించినట్లయింది. ఈ గుర్తింపు కలిగిన దవాఖానాలు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ మూదో స్థానంలో నిలచింది. కాగా, కొత్తగా 10 పిహెచ్‌సిలకు ఎన్‌క్వాస్‌ ‌గుర్తింపు లభించడం పట్ల రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీష్‌ ‌రావు వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని పిహెచ్‌సిలకు ఎన్‌క్వాస్‌ ‌గుర్తింపు లబించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తున్నాయనీ, ఈ ఘనత సాధించడానికి కృషి చేసిన వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బందిని మంత్రి అభినందించారు.

రాష్ట్రంలో పిహెచ్‌సి స్థాయి నుంచి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని చెప్పడానికి ఎన్‌క్వాస్‌ ‌గుర్తింపు నిదర్శనమన్నారు. సీఎం కేసీఆర్‌ ‌నేతృత్వంలో రాష్ట్ర వైద్యరంగం దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని పేర్కొన్నారు. స్వరాష్ట్రంలో ప్రభుత్వం వైద్యారోగ్య రంగాన్ని పటిష్టం చేస్తున్నదనీ, దీంతో ప్రభుత్వ దవాఖానాలలో మౌలిక సౌకర్యాలు బాగా పెరిగాయన్నారు. విలువైన వైద్య పరికరాలు అందుబాటులోకి వొచ్చాయనీ, ఓపి, ఐపి, సర్జికల్‌ ఇలా అన్ని విభాగాల్లో నాణ్యత పెరిగిందన్నారు. దీంతో రాష్ట్ర ప్రజలకు అన్ని రకాల మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయనీ, రాబోయే రోజుల్లో ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేస్తామని ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు.

Leave a Reply