Take a fresh look at your lifestyle.

అపారమైన జలనిధులను పరిరక్షించాలి

అత్యంత ఆవశ్యకమైన, మానవాళి అవసరాలకు ఉపయోగ పడే జలం భూగ్రహంపై కనుమరుగయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి తీవ్రమైన సమస్యకు పరిష్కారం కనుగొనడానికి పలు అంతర్జాతీయ సంస్థలు కృషి చేస్తు న్నాయి. వాటిలో’’ స్టాక్‌ ‌హోం ఇంటర్నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌’’ ఒకటి. 1991 లో ఈ సంస్థ స్థాపించబడినా 2001 నుండి దీని కార్యకాలాపాల వేగం పెరిగింది. అప్పటినుండి క్రమం తప్ప కుండా ప్రతీ ఏటా ప్రపంచ జల వారోత్సవాలు జరుగు తున్నాయి.2021 వ సంవత్సరం ప్రపంచ జలవారోత్సవాలు 5 రోజులకే పరిమితం చేసారు. ఆగష్టు 23 నుండి 27 వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాలు వర్తమాన జల సంక్షోభం దృష్ట్యా విశేష ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

నీటికి సంబంధించిన పర్యవేక్షణ,నీటి సంరక్షణ,నీటి సమస్యలు,జల విధాన నిర్ణయాలు, నీరు,ఆహారం తదితర విషయాలపై అవగాహన కల్పించడానికి స్వీడన్‌ ‌రాజధాని స్టాక్‌ ‌హోం కేంద్రంగా ‘‘సివి’’ అనే సంస్థ పని చేస్తున్నది.ఇది అంతర్జాతీయ జల సంబంధిత విషయాల గురించి చర్చించి, రాబోయే కాలంలో ఎదురయ్యే నీటి సమస్యలను గురించి ప్రజల్లో చైతన్యం తేవడానికి గత మూడు దశాబ్దాలుగా కృషి చేస్తున్నది.ఈ సంవత్సరం బిల్డింగ్‌ ‌రెసిలియన్స్ ‌ఫాస్టర్‌ అనే థీమ్‌ ‌తో నిర్వహిస్తున్న జలవారోత్సవాల్లో వందలాది సంస్థలు, వేలాది ప్రతినిధులు పాల్గొంటున్నారు.కోవిడ్‌ ‌నేపథ్యంలో వర్చువల్‌ ‌గా ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రపంచ జల వారోత్సవాలు నిర్వహిం• •బడుతున్నాయి. జల ఉద్యమంలో అందరినీ భాగస్వాములుగా చేయడానికి ఈ సమావేశాలు ఉద్దేశించబడ్డాయి.

మొత్తం జలసంపదలో ఒక వంతు మాత్రమే నేలపైన, మూడొంతులు సముద్రాల్లో నిండి ఉండడం వలన, సముద్ర జలం ఉప్పుతో కూడుకుని వ్యర్ధంగా మారిన దశలో మనకు లభ్యమయ్యే 2.5 శాతం నీటివనరులతోనే అవసరాలు తీర్చుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. నీటికొరత,నీటి కాలుష్యం, పారిశుద్ధ్య లోపాల వలన అనేక అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. ప్రపంచంలోని జనాభాలో17 శాతం భారత్‌ ఆ‌క్రమించింది. 2050 నాటికి భారత్‌ ‌తో పాటు పలు దేశాలు తీవ్రమైన నేటి ఎద్దడిని ఎదుర్కోబోతున్నాయి.ఇప్పటికీ మన దేశంలో 60 మిలియన్ల మందికి పైగా ప్రజలు సరైన నీరు లేక బాధప డుతున్నారు. అందుబాటులో ఉన్న నీరు కలుషితాలతో నిండి వ్యాధులను వ్యాపింపచేయడం పుండుపై కారం చల్లడమే. ఇప్పటికీ భారతదేశంలో 50 శాతానికి పైగా ప్రజలు వ్యవసాయం మీదనే ఆధారపడి బ్రతుకుతున్నారు.వ్యవసాయానికి సరిపడా నీరు అందిం చలేక పంటల విస్తీర్ణం తగ్గి దేశ ఆర్ధికపరిస్థితి మందగించడం కూడా సహజమే. ఢిల్లీ,బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్‌ ‌వంటి నగరాలు రాబోయే రోజుల్లో తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కోవలసివస్తుంది.నాణ్యతా పరమైన త్రాగు నీటి వినియోగంలో కూడా భారత్‌ ‌వెనుకబడే ఉంది.అంతర్జాతీయ సంస్థలు జరిపిన సర్వే గణాంకాలను బట్టి నీటి నాణ్యతా ప్రమాణాల్లో భారత్‌ అట్టడుగు స్థాయిలో, ఆందోళన కరమైన స్థితిలో ఉందని తెలుస్తున్నది.

కలుషితమైన నీటి వినియోగం మానవ ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఆహారం విషతుల్యంగా మారుతున్నది. కలరా,టైఫాయిడ్‌,‌డయేరియా లాంటి రోగాలకు అపరిశుభ్రమైన నీటి వినియోగమే కారణం. భారతదేశంలో ప్రజలకు సరఫరా కాబడే నీటిలో 70శాతం ప్రమాదకరమైన కలుషితాలతో నిండి ఉన్నట్టు ఒక అంచనా. ప్రపంచ ఆరోగ్యసంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలో 3.1శాతం మరణాలకు నీటినాణ్యతా లోపమే కారణమని పేర్కొనడం గమనార్హం. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ‌లోని ఏలూరులో జరిగిన నీటి కాలుష్య సంఘటన ప్రపంచానికే గుణపాఠం నేర్పింది. పురుగు మందుల అవశేషాలతో,భార లోహాలతో త్రాగునీరు ప్రమాదకరమైన స్థాయికి చేరింది.పరిమితమైన జల వనరుల వలన ప్రపంచంలోని పేద దేశాలు భవిష్యత్తులో నీటి సమస్యతో సతమతమయ్యే సూచనలు కానవస్తున్నాయి. భవిష్యత్తులో నీటి అవసరాలు మరింత పెరగనున్న దృష్ట్యా, నీటి వనరులను పొదుపుగా వాడుకోవాలని ఐక్యరాజ్యసమితి సూచించింది.1992 వ సంవత్సరంలో ఐ.రా.స బ్రెజిల్‌ ‌లోని ‘‘రియో డి జెనీరో’’ లో నిర్వహించిన ఒక సదస్సులో నీటి ఆవశ్యకత గుర్తించి ఒక తీర్మానం ఆమోదించింది.

అందరికీ పరిశుభ్రమైన నీరు అందించడమే ధ్యేయంగా ప్రారంభమైన ఐ.రా.స కార్యాచరణకు తోడుగా ‘‘సివి’’ వంటి పలు సంస్థలు జల విలువను గుర్తిస్తూ ప్రజలకు స్వచ్ఛమైన జలాన్ని అందించడం,నీటి వినియోగాన్ని తగ్గించుకోవడం, వృథాగా కడలిలో కలుస్తున్న నీటిని ప్రాజెక్టులను నిర్మించడం ద్వారా వినియోగం లోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. వ్యవసాయంలో శాస్త్రీయ దృక్పథం పెంచుకుని, బిందుసేద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలి. ఆధునిక వ్యవసాయ పద్ధతులతో నీటి వినియోగాన్ని తగ్గించుకోవాలి. ప్రజలు తలచుకుంటే సాధించలేనిదంటూ ఏమీ లేదు. భూగోళంపై అపరిమితంగా నీటి వనరులున్నప్పటికీ,అవి జీవరాశుల అవసరాలకు పనికిరావు కాబట్టి త్రాగునీటికి,సాగు నీటికి,ఇతర రంగాల అవసరాలకు ఉపయోగ పడే నీటి కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి.
– సుంకవల్లి సత్తిరాజు
మొ:9704903463.

Leave a Reply