Take a fresh look at your lifestyle.

వడగళ్ల వానతో అపార నష్టం

పాలకుర్తి: వడగళ్ల వర్షం కురిసి రైతన్నకు మిగిలింది కన్నీటి ధార…ఆరుగాళం కష్టపడి పండించిన పంట చేతికందే సమయానికి వడగళ్ల వర్షం కురవడంతో నేలపాలైంది. వడగళ్ల వర్షం రైతన్నను కష్టాల కడలిలోకి నెట్టింది. గురువారం బలమైన ఈదురుగాలులతో వడగళ్ల వర్ఘం పాలకుర్తి మండలంలో కురిసింది. దీంతో పలు చోట్ల చెట్లు కూలి ఇండ్లపై పడి ఇండ్లు కూలిపోయాయి. రహదారిపై పడడంతో రవాణాకు అంతరాయం కలిగింది.

వడగళ్ల వర్షంతో పంట చేళ్లు నేలకొరిగాయి. వరి, మక్క, మామిడి తీవ్రంగా ధ్వంసమైంది. మండలంలోని అన్ని గ్రామాలలో వడగళ్ల వర్షం తీవ్రంగా ఉండడంతో అపారనష్టం జరిగింది. చేతికందొచ్చిన పంట నేలపాలై చేజారిపోవడంతో రైతాంగం లబోదిబోమంటున్నారు. ధ్వంసమైన పంట చేనులను ప్రభుత్వం పరిశీలించి రైతాంగాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని పలువురు రైతులు, నేతలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!