Take a fresh look at your lifestyle.

దశాబ్ద కాలంలో కనిష్ట స్థాయికి ఇంజనీరింగ్‌ అడ్మిషన్లు ..!

కొరోనా కాలంలో స్తంభించిన 400 కళాశాలలు
ఇంజనీరింగ్‌ ‌సీట్లు దశాబ్ద కాలంలో కనిష్ట స్థాయికి పడిపోయాయి. 2021లో 63 ఇంజనీరింగ్‌ ఇనిస్టిట్యూట్‌లు మూసివేయబడ్డాయి. ఇంజనీరింగ్‌ ‌సీట్లలో గణనీయమైన తగ్గుదల ఉన్నప్పటికీ, దేశంలో సాంకేతిక విద్యా రంగంలో (ఆర్కిటెక్చర్‌, ‌మేనేజ్‌మెంట్‌, ‌హోటల్‌ ‌మేనేజ్‌మెంట్‌ ‌మరియు ఫార్మసీతో సహా) మొత్తం సీట్లలో 80 శాతం ఇంజనీరింగ్‌ ‌విద్యారంగం తీసుకుంటూ ఇప్పటికీ ఇంజనీరింగ్‌ ‌విద్య ప్రముఖ విద్యగా కొనసాగుతుంది. 2015-16 నుండి ఇంజనీరింగ్‌ ‌కళాశాలలు మూసివేత కోసం దరఖాస్తు చేస్తున్నాయి. ఇవన్నీ బాగా స్థిరపడిన ఇంజనీరింగ్‌ ‌కళాశాలలు. భారతదేశంలోని ఇంజనీరింగ్‌ ‌సంస్థలలో మొత్తం సీట్ల సంఖ్య ఒక దశాబ్దంలో అత్యల్ప స్థాయికి చేరుకున్నాయి. ఆల్‌ ఇం‌డియా కౌన్సిల్‌ ‌ఫర్‌ ‌టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఎఐసిటిఇ) నుండి ఇస్తున్న తాజా సమాచారం ప్రకారం, అండర్‌ ‌గ్రాడ్యుయేట్‌, ‌పోస్ట్ ‌గ్రాడ్యుయేట్‌ ‌మరియు డిప్లొమా స్థాయిలలో ఇంజనీరింగ్‌ ‌సీట్లు 23.28 లక్షలకు తగ్గాయి. ఇది గత 10 సంవత్సరాలలో కనిష్ట స్థాయిగా నమోదయింది. ఇనిస్టిట్యూట్‌ ‌మూసివేత మరియు ప్రవేశ సామర్థ్యం తగ్గిన కారణంగా ఈ సంవత్సరం 1.46 లక్షలు ఇంజనీరింగ్‌ ‌సీట్లు తగ్గిపోయాయి. ఇంత గణనీయమైన తగ్గుదల ఉన్నప్పటికీ, దేశంలో ఇప్పటికీ సాంకేతిక విద్యా రంగంలో (ఆర్కిటెక్చర్‌, ‌మేనేజ్‌మెంట్‌, ‌హోటల్‌ ‌మేనేజ్‌మెంట్‌ ‌మరియు ఫార్మసీతో సహా) మొత్తం సీట్లలో 80 శాతం ఇంజనీరింగ్‌కు ఉంది.

2014-15లో గరిష్టంగా ఎఐసిటిఇ ఆమోదించిన సంస్థలలో దాదాపు 32 లక్షల సీట్లు ఇంజనీరింగ్‌ ‌విద్య రంగం కలిగి ఉంది. ఏడు సంవత్సరాల క్రితం డిమాండ్‌ ‌తగ్గడం ప్రారంభమైనా కన్సాలిడేషన్‌ ‌తర్వాత ఇంజినీరింగ్‌ ‌కాలేజీలు మూసివేయాలనే చర్చ జరిగి ఇంజినీరింగ్‌ ‌కళాశాలలు తగ్గుదల కారణమైంది. గత సంవత్సరం కోవిడ్‌ ‌ప్రేరిత అంతరాయం మొదటిసారి వొచ్చినప్పటి నుండి నేటివరకు సుమారు 400 ఇంజనీరింగ్‌ ‌కళాశాలలు తమ కార్యకలాపాలను నిలిపివేసుకున్నాయి. 2015-16 నుండి ప్రతి సంవత్సరం కనీసంగా 50 ఇంజనీరింగ్‌ ‌సంస్థలు మూసివేయబడ్డాయి. ఈ సంవత్సరం 63 ఇంజినీరింగ్‌ ‌కళాశాల మూసివేత కోసం ఎఐసిటిఇ అనుమతి లభించింది. కొత్త ఇంజనీరింగ్‌ ‌సంస్థలను స్థాపించడానికి సాంకేతిక విద్య రెగ్యులేటరీ జారీ చేసే అనుమతి ఐదేళ్లలో అతి తక్కువ స్థాయిలో ఉంది. 2019లో, 2020-21 సంవత్సరాలలో ఎఐసిటిఇ కొత్త ఇంజనీరింగ్‌ ‌సంస్థలపై రెండేళ్ల తాత్కాలిక నిషేధాన్ని ప్రకటించింది. ఐఐటి-హైదరాబాద్‌ ‌చైర్మన్‌ ‌బివిఆర్‌ ‌మోహన్‌ ‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వ కమిటీ సిఫారసు మేరకు ఇది జరిగింది.

Leave a Reply