Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో మరితం పటిష్టంగా లాక్‌డౌన్‌ అమలు

  • అత్యవసరమైతే పోలీస్‌ ‌పర్మిషన్‌ ‌తీసుకోవాలి
  • అనవసరంగా రోడ్లపైకి రావద్దన్న డిజిపి

రాచకొండ పరిధిలో క్షేత్రస్తాయిలో పర్యటించిన మహేందర్‌ ‌రెడ్డి
రాష్ట్రంలో కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను మరింత పటిష్టంగా అమలు చేయాలని డీజీపీ మహేందర్‌ ‌రెడ్డి పోలీసులను ఆదేశించారు. రాచకొండ కమిషనరేట్‌ ‌పరిధిలో లాక్‌డౌన్‌ అమలు తీరును శుక్రవారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎల్బీనగర్‌, ‌వనస్థలిపురం, హయత్‌నగర్‌లో రాచకొండ సీపీ మహేశ్‌ ‌భగవత్‌తో కలిసి డీజీపీ పర్యటించారు. చెక్‌పోస్టులను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చే ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని చెప్పారు.

అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అన్నారు. నగరంలోకి వచ్చే వాహనాలపై దృష్టిపెట్టాలని పోలీసులను ఆదేశించారు. లాక్‌డౌన్‌ ‌నిబంధనలు పాటిస్తూ ప్రజలు.. పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్‌ ‌కాలంలో వి•డియా ప్రతినిధులకు పాస్‌ అవసరంలేదని రాష్ట్ర డీజీపీ మహేందర్‌ ‌రెడ్డి అన్నారు. పోలీసుల మాదిరిగానే వి•డియా కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేసే క్రమంలో పోలీసులతో కలిసి పనిచేస్తున్నారని డీజీపీ అన్నారు. అయితే వి•డియా ప్రతినిధులు అక్రిడేషన్‌ ‌కార్డు లేదా సంస్థ జారీ చేసిన గుర్తింపు కార్డు కలిగి ఉండాలన్నారు.

నగరంలో చాలా వరకు లాక్‌ ‌డౌన్‌ ‌విజయవంతంగా అమలు అవుతుందని, అదేవిధంగా రూరల్‌ ‌ప్రాంతాల్లో కూడా అమలుకు అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రజల సహకారంతో ప్రభుత్వం లాక్‌ ‌డౌన్‌ ‌విధించినంత కాలం పకడ్బందీగా అమలు చేస్తామన్నారు. కొవిడ్‌తో పాటు అత్యవసర ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రికి వెళ్ళేవారికి పాస్‌ అవసరం లేదన్నారు. వి•డియా కు కూడా పాస్‌ అవసరం లేదని డీజీపీ స్పష్టం చేశారు. ప్రజలు లాక్‌డౌన్‌ ‌సహకరించాలని, ఇళ్ల వద్దనే కొవిడ్‌ ‌కట్టడికి చర్యలు తీసుకోవాలని సూచించారు.

Leave a Reply