Take a fresh look at your lifestyle.

అంతులేని పోరాటం ..!

“గత రెండు దశాబ్దాలుగా ఆందోళనకారులు కోరుతున్నది కేవలం ఆర్థిక భద్రత మాత్రమే కాదు, కోల్పోయిన తమ యవ్వనం, సమయం, కలలకు పరిహారం ఇవ్వాలని. భూమి కోసం డిమాండ్లతో పాటు కూడా గనులు, భూములు, కార్మికులపై పెట్టుబడిదారీ దోపిడీని అంతం చేయాలనే పిలుపులు కూడా ఉన్నాయి. జార్ఖండీలందరికీ సార్వత్రిక ఆరోగ్య పథకంతో పాటు వైద్య సదుపాయాలు కోరుతున్నారు. డొమిసైల్‌ ‌పాలసీ కోసం డిమాండ్‌తో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు కోరుతున్నారు. ఈ డిమాండ్లన్నింటి కింద ఉన్నవి ‘‘జార్ఖండ్‌ ‌నిర్మితమైన విలువలు’’ అని పుష్కర్‌ ‌మహతో అంటారు.”

జార్ఖండ్‌ ‌రాష్ట్ర ఆవిర్భావానికి 21 ఏళ్లు నిండాయి, కానీ దానికి రూపాన్ని అందించిన చాలా మంది ఇప్పటికీ గుర్తింపు కోసం పోరాడుతున్నారు. దానికి పునాది పడిన రోజు నుంచి ‘ఆందోళనకారులు’ తమ సొంత రాజకీయ, సామాజిక భాగస్వామ్యాన్ని నిశ్చయించుకోడానికి పోరాడుతున్నారు. కానీ ఈ ప్రక్రియ అంతు లేనిదిగా అనిపిస్తుంది. పోయిన బడ్జెట్‌ ‌సెషన్‌ ‌లో రాష్ట్రపతి ప్రసంగానికి మోషన్‌ అఫ్‌ ‌థాంక్స్ అం‌దజేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ‘ఆందోళన జీవి’ అనే పదాన్ని ప్రయోగించారు. కొనసాగుతున్న రైతుల నిరసనల గురించి ప్రత్యక్షంగా ప్రస్తావిస్తూ మోడీ ..’’భారతదేశంలో ఇప్పుడు ‘ఆందోళనజీవి’ అనే కొత్త సంఘం ఉంది. ఈ సమూహం ఏ ఆందోళనలోనైనా కనబడుతుంది. దేశాన్ని వాళ్ళ నుంచి రక్షించుకొనేట్టు మనం చూడాలి. . ఈ ఆందోళనజీవులు పరాన్నజీవుల లాంటి వాళ్ళు..’’ అని తన అభిప్రాయాన్ని తెలియజేసారు. ఈ ప్రకటన తీవ్ర విమర్శలకు గురైనప్పటికీ తొందరగానే దీని గురించి మర్చిపోయారు. ఈ పదం జార్ఖండ్‌• ‌రాజకీయాల్లో ఒక కొత్త ప్రత్యామ్నాయం ‘ఆందోళనకారి’గా కనిపించింది. రాష్ట్రానికి 21 ఏళ్లు నిండుతున్న సందర్భంగా జార్ఖండ్‌ ఆం‌దోళనకారులు వీధులను ఆక్రమించారు,కానీ ఈసారి ప్రత్యేక రాష్ట్రం కోసం కాకుండా వారు పోరాడిన ‘‘మాన్‌, ‌సమ్మాన్‌, ‌నియోజన్‌, ‌పెన్షన్‌, ‌పెహచాన్‌..’’ (‌విలువ, గౌరవం,, నియామకం, పెన్షన్‌, ‌గుర్తింపు) అనే విలువలు వారికి దక్కడం కోసం.

ఈ ఆందోళనకారులు ఎవరు? కేవలం ఉద్యమంలో ముందంజలో ఉండి జైలుకెళ్లిన వారికే ఆ అర్హత ఉందా? ఒక ఆశయం కోసమే బతకడానికి అన్ని అవకాశాలను విడిచిపెట్టిన వారి సంగతి ఏంటి ? ‘‘ఒక ర్యాలీకి వెళ్లి, తన పిల్లలు చదువుకోవడానికి కూర్చున్నారో లేదో చూడ్డానికి సమయానికి తిరిగి రాలేకపోయిన వ్యక్తి ఆందోళనకారి. దగ్గరలోని ఊర్లో మీటింగ్‌ ‌కి వెళ్లి ఒక రోజంతా తన పొలాన్ని సాగు చేయకుండా వదిలిపెట్టిన వ్యక్తి ఆందోళనకారి, ’’అని జానపద గాయకుడు, కవి, పద్మశ్రీ గ్రహీత మధు మన్సూరి హస్ముఖ్‌ అన్నారు. ఈ భావన బాధ, ధైర్యం, కష్టాలతో నిండినది. రాష్ట్రం కోసం త్యాగాలు, నిస్వార్థ సేవల నుండి ‘రాష్ట్రానికి తండ్రి లేదా తల్లిగా ఉండే అధికారం’ వస్తుందని జార్ఖండ్‌• ఆం‌దోళన్‌ ‌సంఘర్ష్ ‌మోర్చా సమన్వయకర్త పుష్కర్‌ ‌మహతో పేర్కొన్నారు. ఆందోళనకారుల పరిస్థితి స్వయంగా జార్ఖండ్‌• ‌పరిస్థితికి కూడా అద్దం పడుతుంది. స్థాపించబడిన రోజు నుండి, ఆందోళనకారులు తమ సొంత రాజకీయ, సామాజిక భాగస్వామ్యాన్ని నిశ్చయించుకోడానికి పోరాడుతున్నారు. కానీ వాళ్ళు అధికారిక నోటిఫికేషన్‌ ‌ద్వారా కూడా గుర్తించబడలేదు, వాళ్లకి అర్హత ఉన్నప్పటికీ ఇవ్వాల్సిన ప్రజా గుర్తింపు కూడా ఇవ్వలేదు.

జార్ఖండ్‌ అభివృద్ధి ప్రొఫైల్‌ను ఒకసారి పరిశీలిస్తే, ప్రజల అభివృద్ధి కోసం పని చేయడంలో రాష్ట్ర వైఫల్యం బయటపడుతుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం, జార్ఖండ్‌• ‌మొత్తం అక్షరాస్యత రేటు 66%, ఇది జాతీయ సగటు కంటే తక్కువ. జార్ఖండ్‌•లోని షెడ్యూల్డ్ ‌తెగలలో అక్షరాస్యత రేటు కేవలం 57%, భారతదేశంలోనే అత్యల్పంగా ఉంది. నీతి ఆయోగ్‌ ‌సస్టైనబుల్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌గోల్‌ ఇం‌డియా ఇండెక్స్ 2020 -2021 ‌ప్రకారం, పనితీరు అధ్వాన్నంగా రాష్ట్రాల్లో జార?ండ్‌ ‌రెండో స్థానంలో ఉంది, ఇంకా జీరో హంగర్‌ ‌పారామీటర్‌లో అన్నిటికన్నా తక్కువగా ఉంది. దానికి తోడు, 2001-2011 మధ్య వలసల కారణంగా పని చేసే వయస్సులో ఉన్న జనాభాలో 5% కంటే ఎక్కువ జార్ఖండ్‌• ‌కోల్పోయిందని ఎకనామిక్‌ ‌సర్వే ఆఫ్‌ ఇం‌డియా, 2017 వెల్లడించింది. మెరుగైన ఉపాధి అవకాశాలు, విద్య, సాంప్రదాయ జీవనోపాధి కోల్పోవడం వల్ల ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తారు. ఏ పునర్విభజన మరియు గుర్తింపు రాజకీయాల వల్ల ప్రేరణ పొంది ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం డిమాండ్‌ ‌చేసారో, అవి రాష్ట్ర విధానం, పాలనలోకి అనువదించబడలేదు. నవంబర్‌ 15, 2000 ‌నుండి, తన కోసం పోరాడిన చాలా మంది ప్రజల ఆశలను జార్ఖండ్‌ ‌నిరంతరం నిర్లక్ష్యం చేస్తూనే ఉంది.

పోరాటం

ఆందోళనకారుల గుర్తింపు కోసం రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే పోరాటం మొదలైంది. ఆందోళనకారుల ప్రతినిధి బృందం 2002లో అప్పటి ముఖ్యమంత్రి బాబూలాల్‌ ‌మరాండీ ని కలిశారు. వాళ్ళు రెండు అంశాలను స్పష్టంగా డిమాండ్‌ ‌చేశారు.. ప్రభుత్వంలో భాగస్వామ్యం, ఆందోళనకారులను ‘జార్ఖండ్‌• ‌సేనాని’గా గుర్తించడం. మొదటి డిమాండ్‌కు ఒక కారణం ఉందని జార?ండ్‌ ఆం‌దోళన్‌ ‌మోర్చా సమన్వయకర్త ముంతాజ్‌ ‌ఖాన్‌ ‌చెప్పారు. ఆందోళనకారీలు జార్ఖండ్‌ ‌కోసం పోరాటం చేసారు కాబట్టి మిగతా అందరికంటే వాళ్లకి జార్ఖండ్‌• ‌బాగా అర్థమవుతుంది. వాళ్ళకి దాని ప్రజల గురించి, స్వభావం గురించి బాగా తెలుసు. వాళ్ళు ప్రభుత్వంలో పాలుపంచుకుంటే, జార్ఖండ్‌ ‌కల నెరవేరుతుంది, ’’అని ఖాన్‌ అన్నారు. రెండవ డిమాండ్‌ ‌గౌరవానికి సంబంధించినది, ఇంకా శతాబ్దమంతా రాజ్యాధికార ఉద్యమంలో వ్యాపించిన ఉప జాతీయవాదాన్ని సూచిస్తుంది.

మరాండీ ప్రభుత్వం డిమాండ్లపై చర్య తీసుకోనప్పటికీ, తరువాత వచ్చిన అర్జున్‌ ‌ముండా ప్రభుత్వం వాటిని పట్టించుకున్నట్లు కనిపించింది. జార్ఖండ్‌ ‌ప్రభుత్వం జార్ఖండ్‌ ‌సేనాని’ అనే బుక్‌లెట్‌ ‌ని తీసుకువచ్చింది, అందులో 300 మంది స్వాతంత్య్ర సమరయోధులను గుర్తించి, ప్రజా గుర్తింపుని ఇచ్చారు. ఐతే ఈ 300 మంది ఎంపిక ప్రక్రియ రాజకీయంగా ప్రేరేపితమైనదని ఖాన్‌ అన్నారు. రాబోయే పోరాటాన్ని ముందే ఊహించి, 2004లో ఆందోళనకారులు జార్ఖండ్‌• ఆం‌దోళన్‌ ‌మోర్చా (జె ఏ ఎమ్‌ )‌ని ఏర్పాటు చేశారు, దానికి వినోద్‌ ‌భగత్‌ ‌చీఫ్‌ ‌కోఆర్డినేటర్‌ అయ్యారు. ముంతాజ్‌ ‌ఖాన్‌, ‌సంజయ్‌ ‌కిర్కి, నిరల్‌ ‌హోరో, విమల్‌ ‌కచ్చప్‌, ‌బిర్సా ముండా సమన్వయకర్తలుగా ఎన్నికయ్యారు. జె ఏ ఎమ్‌ ‌మొదటి విజయం ఆందోళనకారులపై రాజకీయ కేసులను ఉపసంహరించుకునేట్టు ప్రభుత్వం పై ఒత్తిడి తేవడం. 2,720 కేసుల్లో, అర్జున్‌ ‌ముండా ప్రభుత్వం 291 కేసులను ఉపసంహరించుకుని మిగిలిన వాటిని సమీక్షకు పంపింది. 2004 నుండి 2011 వరకు, జె ఏ ఎమ్‌ ‌తమ డిమాండ్లను సమర్పించడానికి ముఖ్యమంత్రులను గవర్నర్‌లను కలిసింది, కానీ చాలా ప్రయత్నాలు ఫలించలేదు. డాక్టర్‌ ‌రామ్‌దయాళ్‌ ‌ముండా, సుదేష్‌ ‌మహతో, సూరజ్‌ ‌సింగ్‌ ‌బెస్రా అధ్యక్షతన వరుసగా మూడు కమిటీలు వేసినా, ఆందోళనకారులను గుర్తించడం, పింఛను ఇవ్వడం, వాళ్లపై ఉన్న కేసులను ఉపసంహరించుకోవడం వంటి చర్యలు తీసుకోలేక పోయారు..

అధికారిక వర్గీకరణ ప్రారంభం

జార్ఖండ్‌ ‌రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ప్రతి సంవత్సరం జనవరి 1 న, ప్రభుత్వం, ఇతర సంస్థలు ఖర్సావాన్‌ ‌మారణకాండను గుర్తుచేసుకుంటాయి. 1948లో అదే రోజున ఖర్సవాన్‌ ‌హాట్‌ ‌బజార్తాండ్‌లో జార్ఖండ్‌• ‌ప్రత్యేక రాష్ట్రం కోసం ఆందోళన చేసినందుకు వందలాది మంది ఆదివాసీలు చంపబడ్డారు. ప్రజలు ప్రాణ త్యాగం చేసిన జార్ఖండ్‌ ‌గుర్తింపుకి ఒక గంభీరమైన ప్రతీకగా ఖర్సావాన్‌ ‌ప్రాతినిధ్యం వహిస్తుంది. జనవరి 1, 2021న అక్కడి అధికారిక వేడుక కోసం అప్పటి సీఎం అర్జున్‌ ‌ముండాను సైట్‌లోకి రానివ్వబోమని డిసెంబరు 2011లో జార్ఖండ్‌ ఆం‌దోళన్‌ ‌మోర్చా ప్రతిజ్ఞ చేసింది.

జార్ఖండ్‌• అసెంబ్లీ అదే శీతాకాల సమావేశాలలో, జెఎంఎం ఎమ్మెల్యేలు నలిన్‌ ‌సోరెన్‌, ‌సీతా సోరెన్‌, ‌హాజీ హుస్సేన్‌ అన్సారీ, ఇతరులు జార్ఖండ్‌ ఆం‌దోళనకారులకు గుర్తింపు మరియు పెన్షన్‌ ‌కోసం పిలుపునిచ్చారు. నిరంతర రాజకీయ ఒత్తిళ్లతో ముండా ఆ డిమాండ్లను అంగీకరించి మార్చి 31, 2012న జార్ఖండ్‌•/‌వనంచల్‌ ఆం‌దోళన్‌ ‌చిన్హిత్కరణ్‌ అయోగ్‌ ఏర్పాటును ప్రకటించారు.

జస్టిస్‌ ‌విక్రమాదిత్య ప్రసాద్‌ ‌కమిషన్‌కు ఛైర్మన్‌గా ఉన్నారు. కమిషన్‌ ‌ద్వారా ఈ క్రింది సూచనలు ఫ్రేమ్‌ ‌చేయబడ్డాయి:

1. ఉద్యమ సమయంలో పోలీసుల కాల్పుల్లో మరణించిన ఆందోళనకారులకు ‘అమరవీరుడు’గా గుర్తింపు ఇస్తారు.
2. ఆమె లేదా అతనిపై ఆధారపడిన వ్యక్తికి వారి విద్యార్హతల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగంతోపాటు రూ.2 లక్షల పరిహారం లభిస్తుంది.
3. ఆరు నెలలకు పైగా జైలు జీవితం గడిపిన వాళ్ళకి నెలకు రూ.5 వేలు, ఆరు నెలల కంటే తక్కువ కాలం గడిపిన వాళ్ళకి నెలకు రూ.3 వేలు పెన్షన్‌గా అందజేస్తారు.
4. ఇతర ఆందోళనకారులకు రూ. 35,000 వరకు వైద్య సహాయం లభిస్తుంది.
5. వాళ్ళకి ధృవీకరణ, గుర్తింపు ఇవ్వబడుతుంది.

జె ఏ ఎమ్‌ ‌వెంటనే ఫ్రేమ్‌ ఆఫ్‌ ‌రిఫరెన్స్‌ను వ్యతిరేకించి పోరాటం జార్ఖండ్‌• ‌కోసం కానీ వనాంచల్‌ ‌కోసం కాదని పేర్కొంది. ఆయోగ్‌ ‌పేరులో వనాంచల్‌ అనేది స్వయంసేవక్‌ ‌సంఘ్‌, ‌భారతీయ జనతా పార్టీ ఉద్యమాన్ని కబ్జా చేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నమని పేర్కొంటూ ఆ పదం ఉండద్దని జె ఏఎమ్‌ ‌తెలిపింది. ఆందోళనకారుల వర్గీకరణను తొలగించాలని, అందరిని సమానంగా చూడాలని జె ఏ ఎమ్‌ ‌కోరింది. వర్గీకరణ ఆర్వెల్లియన్‌ ‌సోపానక్రమాన్ని విధించింది. కొంతమంది ఆందోళనకారులు ఇతరుల కన్నా ఎక్కువ సమానులయ్యారు.

జె ఏ ఎమ్‌ ‌కోఆర్డినేటర్‌ ‌ముంతాజ్‌ ‌ఖాన్‌ ‌మాట్లాడుతూ, ‘‘ మొరాబాది లేదా దుమ్కాలో మా కార్యక్రమం ఏదైనా జరిగినప్పుడు, సుమారు 5-7 లక్షల మంది ప్రజలు వచ్చేవారు. ఈ చోట్లలో మహిళలు తమ పిల్లలను వీపుపై మోసుకుని వచ్చేవారు. కొన్నిసార్లు వాళ్ళు నిరసన స్థలానికి చేరుకోవడానికి 50 కిలోమీటర్లకు పైగా నడిచి వెళ్లాల్సి వచ్చేది. వాళ్ళందరూ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా జార్ఖండ్‌• ఆం‌దోళనలో నిమగ్నమై ఉన్నారు. జార్ఖండ్‌• ‌రాష్ట్ర ఏర్పాటులో చిన్న పాత్ర పోషించిన వాళ్ళెవరైనా ఆందోళనకారులే అని జార్ఖండ్‌• ఆం‌దోళన్‌ ‌సంఘర్ష్ ‌మోర్చా, సమన్వయకర్త పుష్కర్‌ ‌మహతో అన్నారు. 2013లో, జె ఏ ఎమ్‌ ‌జస్టిస్‌ ‌ప్రసాద్‌ను రెండుసార్లు కలుసుకుని, ఉద్యమంలో భాగమైనా ఎప్పుడూ జైలుకు వెళ్లని ఆందోళనకారులందరినీ చేర్చుకోవాలని అభ్యర్థించింది. 2017లో రఘుబర్‌ ‌దాస్‌ ‌ప్రభుత్వానికి ఇచ్చిన పిటిషన్‌లో జె ఏ ఎమ్‌ ‌కొన్ని డిమాండ్లు చేసింది. ఆందోళనకారులకు కూడా జార?ండ్‌లోని పట్టణ ప్రాంతాలలో 10 డెసిమిల్‌ ‌భూమిని అందజేయాలని, అదే విధంగా ఎమ్మెల్యేలకు మంత్రులకు ఇచ్చినట్లుగా, వైద్య సదుపాయాలు, వీధులు, విశ్వవిద్యాలయాలు, హాస్పిటల్స్ ‌కు స్మారక నామకరణం, జార్ఖండ్‌• ‌ప్రభుత్వ అభివృద్ధి సంస్థల్లో, బోర్డులలో భాగం చేయడం, ఆందోళనకారుల వర్గీకరణ తీసేయాలని డిమాండ్‌ ‌చేసింది.

గౌరవం

2016లో గవర్నర్‌ ‌ద్రౌపది ముర్ముకి జె ఏ ఎమ్‌ ఇచ్చిన పిటిషన్‌లో, ఈ పోరాటం ఎప్పుడూ కేవలం పెన్షన్‌ ‌కోసం మాత్రమే కాదు, గౌరవం కోసం అనే విషయాన్నీ హైలైట్‌ ‌చేయాలని కోరింది. తూర్పు సింగ్‌భూమ్‌ ‌లో 297, దుమ్కాలో 282 మంది ఆందోళనకారులకు సంబంధిత జిల్లా కలెక్టర్లు సంతకం చేసిన గుర్తింపు పత్రాన్ని ఇచ్చారు. ఇది ఆందోళనకారులను అవమానించడమేనని, దీనిపై ముఖ్యమంత్రి సంతకం చేసి ఉండాల్సిందని జె ఏ ఎమ్‌ ‌పేర్కొంది. ఈ నిరంతర నిరసనలు చేసి పిటిషన్‌లు ఇచ్చినప్పటికీ, 63,000 మంది దరఖాస్తుదారులలో కేవలం 5,000 మందిని గుర్తించి నోటిఫై చేశారు. వీళ్ళ లో 1500 మందికి 2015 నవంబర్‌ ‌నుంచి పింఛన్‌ అం‌దుతున్నా సక్రమంగా అందడం లేదు. గత ఏడు నెలలుగా వీళ్ళకి ఈ కొద్దిపాటి పింఛను కూడా అందడం లేదు. అనిశ్చితి చాలా స్పష్టంగా ఉంది, ప్రత్యేకించి ఈ పెన్షన్‌పై ఆధారపడ్డ వాళ్ళకి. ఈ అనిశ్చితి వల్ల ఆందోళనకారుడు, జార్ఖండ్‌ ‌ముక్తి మోర్చా మాజీ సభ్యుడు మహ్మద్‌ ‌ఫైజీ వేసిన ఒక ప్రశ్న దృక్కోణంలోకి వస్తుంది: ‘‘ఈ జార్ఖండ్‌ ‌కోసమా మేము పోరాడింది?’’

జస్టిస్‌ ‌విక్రమాదిత్య ప్రసాద్‌ ఆధ్వర్యంలోని కమిషన్‌ ‌మూడేళ్లపాటు పనిచేసి,2018 లో పునర్వ్యవస్థీకరించబడిన తర్వాత వార్షిక పొడిగింపులను పొందింది. మునుపటి సభ్యుల స్థానంలో జె ఎం ఎం మాజీ సభ్యుడు సునీల్‌ ‌ఫకీరా, ఎజెఎస్యు మాజీ అధ్యక్షుడు దేబ్‌శరణ్‌ ‌భగత్‌ ‌వచ్చారు. ఈ కొత్త కమిషన్‌ ‌కూడా ఫిబ్రవరి 2020లో రద్దు అయ్యేంత వరకు రెండుసార్లు పొడిగింపులను పొందింది. మే నెలలో సోరెన్‌ ‌ప్రభుత్వం కొత్త గెజిట్‌ ‌నోటిఫికేషన్‌ను జారీ చేసింది, దీని ద్వారా మాజీ ఐపీఎస్‌ అధికారి దుర్గా ఓరాన్‌ ‌నేతృత్వంలో ఉన్న కమిషన్‌ను సంస్కరించారు. దీని ఇతర సభ్యులు నర్సింగ్‌ ‌ముర్ము, భువనేశ్వర్‌ ‌మహతో. ఆయోగ్‌ ‌నుండి ‘వనాంచల్‌’ అనే పదాన్ని తొలగించడంతో పాటు, ముఖ్యమంత్రి హేమంత్‌ ‌సోరెన్‌ ‌మూడు నెలల కంటే తక్కువ జైలు శిక్ష అనుభవించిన ఆందోళనకారుల కొత్త వర్గాన్ని కూడా సృష్టించారు. తద్వారా కేవలం ఒక్క రోజు కటకటాల వెనుక గడిపిన ఎవరైనా పెన్షన్‌కు అర్హులు. సోరెన్‌ ‌ప్రభుత్వం పెన్షన్‌ ‌మొత్తాలను కూడా సవరించింది, అంతేగాక వారి విద్యార్హతల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలలో ఆందోళనకారులకు 5% రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది.

కానీ కొత్త వర్గానికి కొన్ని సమస్యలు ఉన్నాయి.‘‘వేలాది మంది ప్రజలు పాల్గొన్న ర్యాలీ నుండి 4-5 మందిని పోలీసులు అరెస్టు చేసేవారు. కటకటాల వెనక్కి వెళ్లినంత మాత్రాన ఎక్కువ విలువ పొందలేరు,’’ అని పుష్కర్‌ ‌మహతో అన్నారు. జె ఎం ఎం మాజీ సభ్యుడు, ఆందోళనకారుడు జుబేర్‌ అహ్మద్‌ ‘‌గెరిల్లా-దస్తా’ గురించి చెప్పిన దాన్ని ఇది ప్రతిధ్వనిస్తుంది, ఇది పోలీసు స్టేషన్‌ ‌నుండి పారిపోయి జైళ్ల బయట ఒక ఉద్యమాన్ని సజీవంగా ఉంచేలా చేసే టెక్నిక్‌.

‌గత రెండు దశాబ్దాలుగా ఆందోళనకారులు కోరుతున్నది కేవలం ఆర్థిక భద్రత మాత్రమే కాదు, కోల్పోయిన తమ యవ్వనం, సమయం, కలలకు పరిహారం ఇవ్వాలని. భూమి కోసం డిమాండ్లతో పాటు కూడా గనులు, భూములు, కార్మికులపై పెట్టుబడిదారీ దోపిడీని అంతం చేయాలనే పిలుపులు కూడా ఉన్నాయి. జార?ండీలందరికీ సార్వత్రిక ఆరోగ్య పథకంతో పాటు వైద్య సదుపాయాలు కోరుతున్నారు. డొమిసైల్‌ ‌పాలసీ కోసం డిమాండ్‌తో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు కోరుతున్నారు. ఈ డిమాండ్లన్నింటి కింద ఉన్నవి ‘‘జార్ఖండ్‌ ‌నిర్మితమైన విలువలు’’ అని పుష్కర్‌ ‌మహతో అంటారు. అయోగ్‌కు అవసరమైన ప్రభుత్వ సహకారం అందిస్తే స్వల్పకాలంలోనే ఆందోళనకారులను గుర్తించగలమని మహతో అన్నారు. ప్రభుత్వం ఇప్పటికే గుర్తించిన ఆందోళనకారులు, అడ్మినిస్ట్రేటివ్‌ అధికారులతో కూడిన ఒక పర్మినెంట్‌ ‌స్పెషల్‌ ‌సెల్‌ను ఏర్పాటు చేయచ్చు. ఆందోళనకారులైతే తమ కామ్రేడ్లను సులభంగా గుర్తిస్తారు, ప్రభుత్వానికి స్వాతంత్య్ర సమరయోధులకి మధ్య వారధిగా వ్యవహరిస్తారు. ఆ తర్వాత ఈ సెల్‌ ‌పెన్షన్లు, ఇతర పథకాలను సమన్వయం చేయగలదు, ’’అని ఆయన అన్నారు. మహతో, అతని సంస్థ అనేక జార్ఖండి ఆందోళనకారులకు గుర్తింపు కార్డులను తయారు చేసింది. రాష్ట్రానికి తామే తండ్రులమని స్వయంగా ప్రజలు అర్థం చేసుకున్నప్పుడే వాళ్ళ విలువ ఇతరులకు అర్థమవుతుందని అన్నారు.

ఈ వారం ప్రారంభంలో ఉద్యమం భవిష్యత్తును నిర్ణయించడానికి జార్ఖండి ఆందోళన్‌ ‌సంఘర్ష్ ‌మోర్చా పిలుపు మేరకు వేలాది మంది జార్ఖండీలు మొరాబాడి మైదాన్‌లో సమావేశమయ్యారు. అనుభవజ్ఞులైన యోధులు సుదీర్ఘ పోరాటానికి సిద్ధం అవుతున్న తరుణంలో, గుర్తింపు కోసం జరిగే ఈ పోరాటంలో ఏ ఆయోగ్‌ ‌వాళ్ళ పేర్లను గుర్తించే అవకాశం లేదని వాళ్ళకి తెలుసు.

‘ది వైర్‌, ‌సౌజన్యంతో ..స్వేచ్చానువాదం దీప్తి సిర్లా

Leave a Reply