Take a fresh look at your lifestyle.

భార్గవా కమిషన్‌ తర్వాత ఎన్‌కౌంటర్లు

“మధుసూదన్‌ రాజ్‌ అంతకు ముందు పిడిఎస్‌యులో చురుకైన కార్యకర్తగా ఉండేవాడు. మేం 1978లో కాళోజీని వెంగళరావు మీద ప్రత్యర్థిగా నిలబెట్టి పోటీ చేసినప్పుడు ఆ ఎన్నికల ప్రచారంలో మధుసూదన్‌ రాజ్‌ కీలకపాత్ర పోషించాడు.ఆ మధుసూదన్‌ రాజ్‌ను 1995 జూలై 26న హైదరాబాద్‌లో గాంధీనగర్‌లో ఒక ఇంట్లో పట్టుకుని కాల్చి చంపేశారు. అది ఒక ఎన్‌కౌంటర్‌ అని ఆ ఎన్‌కౌంటర్‌లో ఒక గుర్తు తెలియని పీపుల్స్‌ వార్‌ నక్సలైటు మరణించాడని మర్నాడు పత్రికల్లో పోలీసు ప్రకటనలు వచ్చాయి. అటువంటి పోలీసుల కట్టుకథలు మామూలయి పోయాయి గదా.”

మొదటిది, మధుసూదన్‌ రాజ్‌ యాదప్‌ కేసులో హైకోర్టు తీర్పు.
మధుసూదన్‌ రాజ్‌ యాదప్‌ చాల చురుకైన, నెమ్మ దస్తుడయిన యువకుడు. ఆయన పెళ్ళి నేనే చేశాను. చనిపోయే నాటికి నలభై రెండేళ్ళో ఏమో, ఆయన కుటుంబం నేపథ్యం కూడ చాల మంచిది. వాళ్ళ నాన్న ప్రభుత్వోద్యోగిగా పనిచేశాడు. ఆయనతో నాకు ఎన్నో సన్నిహిత అనుభవాలున్నాయి. ఒకరోజు నేను ఒంటరిగా గోల్కొండ చౌరస్తా నుంచి గాంధీనగర్‌ వెళ్ళే దారిలో నడిచి వెళ్తున్నాను. మధుసూదన్‌ రాజ్‌ స్కూటర్‌లో నా పక్కకు వచ్చి, ‘సార్‌, ఎందుకు సార్‌, ఒంటరిగా నడిచిపోతున్నారు? ఎవరయినా ఏమయినా చేయొచ్చు. ఒంటరిగా ఎప్పుడూ వెళ్ళకండి’ అని హెచ్చరించి, స్కూటర్‌ మీద ఎక్కించుకుని మా స్నేహతుడి ఇంట్లో వదిలిపెట్టాడు. మధుసూదన్‌ రాజ్‌ అంతకు ముందు పిడిఎస్‌యులో చురుకైన కార్యకర్తగా ఉండేవాడు. మేం 1978లో కాళోజీని వెంగళరావు మీద ప్రత్యర్థిగా నిలబెట్టి పోటీ చేసినప్పుడు ఆ ఎన్నికల ప్రచారంలో మధుసూదన్‌ రాజ్‌ కీలకపాత్ర పోషించాడు.ఆ మధుసూదన్‌ రాజ్‌ను 1995 జూలై 26న హైదరాబాద్‌లో గాంధీనగర్‌లో ఒక ఇంట్లో పట్టుకుని కాల్చి చంపేశారు. అది ఒక ఎన్‌కౌంటర్‌ అని ఆ ఎన్‌కౌంటర్‌లో ఒక గుర్తు తెలియని పీపుల్స్‌ వార్‌ నక్సలైటు మరణించాడని మర్నాడు పత్రికల్లో పోలీసు ప్రకటనలు వచ్చాయి. అటువంటి పోలీసుల కట్టుకథలు మామూలయి పోయాయి గదా. కాని ఆ రోజు నేను ఏదో కేసు పనిమీద హైకోర్టులో ఉన్నాను. నా జూనియర్‌ న్యాయవాది ఎస్‌.భరత్‌ కుమార్‌ వచ్చి ‘సార్‌ ఇది మధుసూదన్‌ రాజ్‌ యాదప్‌ కావచ్చు ననుకుంటున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌ జరిగిన సమయం నుంచి ఆయన ఆచూకీ తెలియడం లేదంటున్నారు’ అని చెప్పాడు.

‘ఒకవేళ ఈ ఎన్‌కౌంటర్‌లో చనిపోయినది మధుసూదన్‌ రాజ్‌ యాదవే అయితే మనం ఏమయినా చేయాల్సి ఉంటుంది’ అని నేననుకున్నాను. ‘ మధుసూదన్‌ రాజ్‌ లాంటి వాడికి ఇది జరగకూడదు’ అనుకున్నాను. ఏ ఎన్‌కౌంటర్‌ హత్య విషయంలో నయినా నేను అట్లాగే స్పందిస్తాను. కాని మధుసూదన్‌ రాజ్‌ అనే సరికి నాకు అప్పటికి పదిహేనేళ్ళకు పైగా పరిచయం గనుక వెంటనే ఏమయినా చేయాల్సిందే అనుకున్నాను. నేను కోర్టు హాల్లోకి వెళ్లి ఇట్లా ఒక ఎన్‌కౌంటర్‌ జరిగింది. అది అనుమానస్పదంగా ఉంది. ఎవరూ గుర్తించకపుందే పోలీసులు ఆ మృతదేహాన్ని మాయం చేయడానికి కూడ ప్రయత్నిస్తున్నారు. ఆ చంపివేయబడిన వ్యక్తి మధుసూదన్‌ రాజ్‌ యాదప్‌ అనే యువకుడు కావచ్చునని అనుపూనం ఉంది. ఒకవేళ అతనే ఆయితే, అతను నాకు చాలా పరిచయస్తుడు. అతని పెళ్లి నేనే చేశాను. అందువల్ల ఆ మృతదేహం ఎవరిదో గుర్తించేదాకా మాయం చేయకుండా చూడాలి. ఒకవేళ అతనే అయితే కుటుంబానికి మృతదేహం అందజేయాలి అని ఒక మౌఖిక అభ్యర్థన చేశాను.

- Advertisement -

అసలు ఈ ఎన్‌కౌంటర్‌ బూటకమైనదని ఒక రిట్‌ దాఖలు చేస్తానని కూడా చెప్పాను. ఈ మౌఖిక ఫిర్యాదును అంగీకరించిన హైకోర్టు ధర్మాసనం మృతదేహాన్ని మధుసూదన్‌ రాజ్‌ యదప్‌ భార్య స్వర్ణ, తండ్రి నీలకంఠ యాదప్‌ నా సమక్షంలో గుర్తుపట్టాలని, అప్పటిదాకా ఆ మృతదేహాన్ని ఎవరూ కదిలించకుండా చూడాలని మధ్యంతర ఉత్తర్వు ఇచ్చింది. ఆ తర్వాత రెండు వారాలు విచారణ, వాద ప్రతివాదాలు జరిగిన మీదట అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రభాశంకర్‌ మిశ్రా, న్యాయపుూర్తి సి.వి.ఎన్‌. శాస్త్రి చాల ముఖ్యమైన తీర్పు ప్రకటించారు. 1995 ఆగస్ట్‌ 14న వెలువరించిన ఆ తీర్పులో వారు ప్రధానంగా చెప్పినదేమంటే, మధుసూదన్‌ రాజ్‌ మరణం పోలీసులు చెప్పినట్టు ఎదురుకాల్పులలో జరిగినా అది ఉద్దేశ్యపూర్వకమైన, శిక్షార్హమైన నేరం కిందికే వస్తుంది. ఆ మరణానికి ఎవరు బాధ్యులు, అది హత్య అవునా కాదా అనే విషయం సాక్ష్యాధారాల వల్ల తేలవలసిందే గాని ఏ పక్షం చెప్పినదాన్నయినా యధాతథంగా నమ్మ నక్కరలేదు. అంటే ఆ హత్య లేదా మరణం జరిగిన తీరు గురించి సరైన పరిశోధన జరగాలి. ఆ పరిశోధనా ఫలితాలను ఒక న్యాయస్థానం సాక్ష్యాధారాల ద్వారా విచారించాలి.

ఆ తీర్పులో న్యాయమూర్తులు రాసిన కొన్ని మాటలు ముఖ్యమైనవి. ‘‘అతని మృతి గురించి నివేదిక ముషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో క్రైం నంబర్‌ 150/95 గా నమోదయింది. ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం, సమాచారం అందించిన అధికారి, ఇతర అధికారులు విధి నిర్వహణలో ఉండగా అడ్డుకుని ఆ వ్యక్తి నేరం చేశాడు. అతను వాళ్ళను ఎదిరించాడు. తప్పించుకు పోయాడు. తన రివాల్వర్‌ తీసి, వారిని చంపే ఉద్దేశ్యంతో కాల్పులు జరిపాడు. ఆత్మరక్షణార్థం వారు ఎదురు కాల్పులు జరపగా అతను అక్కడికక్కడే చనిపోయాడు. ఆ తోపులాటలో కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. ఈ మొత్తంలో మధుసూదన్‌ రాజ్‌ యాదప్‌కు చాలా తూటాలు తగిలాయి. ఒక కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి గాని అవి తుపాకి కాల్పుల గాయాలు కావు. ఒక పోలీసు అధికారుల బృందం తాము ఒక వ్యక్తిని అరెస్టు చేయడానికి వెళ్ళామని, ఆ వ్యక్తి అరెస్టును తప్పించుకున్నాడని, ఆ తప్పించుకోవడంలో బలప్రయోగం చేశాడని, తాము ఎదురు బలప్రయోగం చేస్తే అతను చనిపోయాడని ప్రకటిస్తే ఆ ప్రకటనను అంగీకరించి, అట్లా ఒక ప్రాణం తీయడాన్ని ‘‘చట్టబద్ధమైన పద్ధతులు నిర్దేశించినట్టుగా జరిగినదేనని పవిత్రీకరించే చట్టం ఉందా?’’ అని న్యాయపుూర్తులు ప్రశ్నించారు.
-కె.జి. కన్నబిరాన్‌
ఆత్మకథాత్మక సామాజిక చిత్రం
అక్షరీకరణ :ఎన్ .వేణుగోపాల్

Leave a Reply