Take a fresh look at your lifestyle.

ఉపాధి కూలీలు కొరోనా బారిన పడకుండా చూసుకోవాలి

వికారాబాద్‌ : ‌గ్రామాల్లో పారిశుద్ధ్య పనులను సమర్థవంతంగా చేపట్టాలని జిల్లా అడిషనల్‌ ‌కలెక్టర్‌ ‌చంద్రయ్య తెలిపారు. గురువారం వికారాబాద్‌ ‌మండలంలోని పలు గ్రామాల్లో గురువారం జిల్లా అడిషనల్‌ ‌కలెక్టర్‌ ‌చంద్రయ్య, డీపీఓ రిజ్వానలు పర్యటించారు. మండలంలోని పిరంపల్లి, పాతూర్‌, ‌పులుసుమామిడి, కామారెడ్డిగూడ, నారాయణ్‌ ‌పూర్‌, ‌పెండ్లిమడుగు గ్రామాల్లో పర్యటించి గ్రామాల్లో పారిశుధ్య పనులను, ఉపాధి హామీ పనులను, నర్సరీలను తదితర కార్యక్రమాలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా అడిషినల్‌ ‌కలెక్టర్‌ ‌చంద్రయ్య మాట్లాడుతూ కొరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని సూచించారు. లాక్‌ ‌డోన్‌ను విజయవంతం చేయాలన్నారు. ఉపాధి హామీ కూలీలు పనులు చేసేటప్పుడు సామాజిక దూరం పాటించాలన్నారు. తరచుగా చేతులను శుభ్రం చేసుకోవాలని సూచించారు. పనులకు ఉదయం పూట చల్లగా ఉన్నందున త్వరగా రావాలని తెలిపారు. ఉపాధి కూలీలు తప్పకుండా మాస్కులు ధరించి పనులు చేయాలన్నారు.

ఉపాధి అధికారులు సూచించిన కొలతల ప్రకారం పనులు చేసి పూర్తి కూలీని పొందాలన్నారు. గ్రామాల్లో పారిశుధ్య సిబ్బంది విధిగా పారిశుధ్య పనులు చేయాలన్నారు. ఎప్పటికప్పుడు మురుగు కాల్వలను పిచ్చిమొక్కలను తొలగించాలన్నారు . ఈ విషయంలో సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. నర్సరీలకు ఉదయమే నీరు పట్టి మొక్కలు తొందరగా పెరిగేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. పులుసుమామిడి గ్రామంలో బ్యాంకు మిత్రతో అందజేస్తున్న పదిహేను వందల రూపాయల పంపిణీని ఆయన పరిశీలించారు . ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ సుభాషిణి ఎపిఓ శ్రీను ఆయా గ్రామాల సర్పంచులు పురుషోత్తంరెడ్డి , లలితమ్మ , జయమ్మ నరేందర్‌ ‌రెడ్డి , బుచ్చిరెడ్డి , పంచాయతీ కార్యదర్శులు రాములు, శిల్ప, వరలక్ష్మి ఉపాధి హామీ టిఎలు రాములు, రాజు, జాన్సీ శానిటేషన్‌ ‌సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy