Take a fresh look at your lifestyle.

మెగా జాబ్‌మేళా ద్వారా ఉపాధి అవకాశాలు : బల్దియా కమిషనర్‌

Employment Opportunities through Mega Job Mela Baldia Commissioner
‌జాబ్‌ ‌మేళాకు అనూహ్య స్పందన

నిరుద్యోగ యువతకు మెగా జాబ్‌మేళా ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తునట్లు బల్దియా కమిషనర్‌ ‌పమేలా సత్పతి తెలిపారు. బుధవారం ఎల్‌.‌బి. కళాశాలలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ, (మెప్మా), ఎన్‌యుఎల్‌ఎం ‌సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్‌ ‌మేళా కార్యక్రమాన్ని కమిషనర్‌ ‌జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ ‌మాట్లాడుతూ మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా ప్రచారం కల్పించడం జరిగిందని ఇలాంటి మేళాలను నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకొని ఉపాధి అవకాశాలు పొందాలని, జాబ్‌ ‌మేళాలో పాల్గొని ఉద్యోగం రాని నిరుద్యోగ యువత నిరుత్సాహ పడవద్దని అలాంటి వారిని గుర్తించి ప్రత్యేక జాబితా రూపొందించి వారికి స్కిల్‌ ‌డెవలప్మెంట్‌ ‌లో శిక్షణ అందజేయడం జరుగుతుందని వారికి కూడా భవిష్యత్తులో అనేక ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అని కమీషనర్‌ అన్నారు. జాబ్‌ ‌మేళా లో  పాల్గొనే వారు తమ  సామర్ధ్యాలను ప్రదర్శించాలని, ఉద్యోగం అనేది ప్రతి మనిషికి అవసరం అని, ఉద్యోగ సాధనలో ప్రతిభను ప్రదర్శించి ఉద్యోగం పొందితే సంతృప్తి కలుగుతుందని, కనిష్టంగా రూ.10 వేల  నుండి గరిష్టంగా రూ.18 వేతనాల వరకు లభిస్తున్నాయని కమీషనర్‌ అన్నారు.

ఈ సందర్భంగా నిర్వహించిన మెగా జాబ్‌మేళాలో 37 కంపెనీలు పాల్గొ నగా, 8393 మంది రిజిస్ట్రేషన్‌ ‌చేసుకున్నారని, ఇంటర్వ్యూకు 3259  అభ్యర్థులు ఎంపికవగా, 2957 అభ్యర్థులు హాజరయ్యారని, తుది జాబితాలో 1856 మంది నిలువగా అందులో 415 మంది అభ్యర్థులు ఉద్యోగాలు సాధించారని  పిడి మెప్మా తెలిపారు. అంతకుముందు ఆన్లైన్‌లో ఉద్యోగంకొసం నమోదు చేసుకొని వారికోసం ప్రత్యేకంగా కౌంటర్‌ ‌లు ఏర్పాటు చేసి వివరాలు నమోదు చేయడం తో పాటు, ప్రత్యేక బార్‌ ‌కోడ్‌ ‌తో ఉన్న దరఖాస్తు ను స్కాన్‌ ‌చేసి దృవీకరించుకున్నకే అభ్యర్థులను ఎంపికకు అనుమతించారు. ఈ కార్యక్రమంలో  మెప్మా పి.డి. కృష్ణవేణి, మెప్మా టిపిఆర్‌ఓ ‌విజయలక్ష్మి, హైదరాబాద్‌ ‌మెప్మా ఎస్‌ఎం‌సి కృష్ణచైతన్య, పద్మ, రష్మీ, మెప్మా ఈ.ఎస్‌..‌టి.పి.ఎస్‌.ఎం.ఐ. ‌డి.సూర్యనారాయణ శాస్త్రి, సూపరింటెండెంట్లు ప్రసన్న రాణి, షెహజాది బేగం, డిఎంసి రజిత రాణి, ఏడిఎంసి సతీష్‌, ‌వెంకట్‌, ‌టి.ఎం.సి. రమేష్‌, ‌సి.ఓ.లు, ఆర్‌.‌పి.లు తదితరులు పాల్గొన్నారు.

Tags: jogmela, Baldia Commissioner, Satpathi,

Leave a Reply