Take a fresh look at your lifestyle.

ఉపాధిని ఉపయోగించుకోవాలి

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి అమలుచేస్తున్న ఉపాధిహామీని ఉపయోగించుకోవాలని డీఆర్‌డీవో రాంరెడ్డి అన్నారు. మంగళవారం నర్మెట మండల కేంద్రంలో జరుగుతున్న ఉపాధిహామి పనులను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కూలీలను ఉద్దేశించి డీఆర్‌డీవో మాట్లాడుతూ రోజువారి వేతనం ఒక్కొక్క కూలీకి రూ.237లు వచ్చేవిధంగా పనులు నిర్వహించాలన్నారు. ఒక కుటుంబానికి 100 రోజుల పని కల్పించాలనే సదుద్ధేశంతో మహాత్మాగాంధి ఉపాధిహామి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. మామిడితోటలలో ఒక చెట్టునుం చి మరొక చెట్టుకు ఏర్పాటుచేసిన కందకాలను డీఆర్‌డీవో పరిశీలించారు.

వరదవచ్చి మట్టి కొట్టుకుపోవడం వలన సారవంతమైన మట్టి కొట్టుకుపో కుండా మన భూమిలోనే ఆపేవిధంగా మామిడితోటలో కందకాలు తవ్వుకో వాలని సూచించారు. మామిడి రైతు గుర్రాల దయాకర్‌రెడ్డిని డీఆర్‌డీవో అభినందించారు. కార్యక్రమంలో అడిషనల్‌ ‌ప్రోగ్రాం ఆఫీసర్‌ ‌పులుగం రమాదేవి, ఉప సర్పంచ్‌ శ్రీ‌ను, కార్యదర్శి సదానందం, వార్డు మెంబర్లు మహేందర్‌, ‌కన్నెబొయిన కుమార్‌, ‌పలువురు రైతులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!