Take a fresh look at your lifestyle.

ఉపాధి హామీకి నిధులు పెంచాలి

“ఏ‌ప్రిల్‌ ‌మొదటి వారంలో సిఎంఐఈ విడుదల చేసిన గణాంకాల ప్రకారం పని చేయడానికి సిద్దంగా ఉన్నవారిలో 23 శాతం మంది నిరుద్యోగులు. ఈ  సంఖ్య మన అంచనా కన్నా తక్కువే. ప్రేమ్‌ ‌జీ యూనివర్శిటీ, సిఎస్‌డిఎస్‌ ‌సర్వే ప్రకారం 40 శాతం మంది దినసరి వేతనం పొందుతున్నారు  ప్రభుత్వ లెక్కల ప్రకారమే దేశంలో 77 శాతం మంది కార్మికుల ఉద్యోగాలు క్రమబద్దమైనవి కావు. పనులకు వెళ్ళకపోతే 90 శాతం మందికి  ఆదాయం ఉండదు. ఇలాంటి పరిస్థితులలో కొరోనా వంటి విపత్తుల వల్ల రోజువారీ కార్మికుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. లాక్‌ ‌డౌన్‌ ‌పొడిగించి ప్రజల ప్రాణాలను కాపాడాలి..”

నేను ఇష్టసడని పని ఒకటే. నా బట్టలను నేను ఇస్త్రీ చేసుకోవడం. అందువల్ల స్థానిక లాండ్రీకి నేను రోజూ బట్టలు వేస్తూ ఉంటాను. లాక్‌ ‌డౌన్‌ ‌ప్రారంభమైన తర్వాత నుంచి లాండ్రీ నిర్వాహకునికి నా బట్టలు వేయడానికి భయపడిపోతున్నాను. అతడు ఆ బట్టలపై దగ్గితే నాకు కోవిడ్‌-19 ‌రావచ్చునేమోనన్న భయం. అతడు నా మిత్రుని ఇంటి పక్కనే ఉంటాడు. ఆ మధ్య ఓ రోజు ఆయనను నేను కలుసుకున్నాను. అతడు ఇస్త్రీకి బట్టలున్నాయా అని అడిగాడు. లేవని చెప్పాను. ఆర్థిక సాయం కోసం అతడు రెండు ఐదొందల రూపాయిలు అడిగి తీసుకున్నాడు. నేను ఇప్పటికే ఒక వడ్రంగికి, ప్లంబర్‌కు డబ్బు ఇవ్వడం కోసం కరెన్సీ నోట్లు ముట్టుకున్నాను. అదే రీతిలో దోబీ అడిగితే కొంత డబ్బు తీసి ఇచ్చాను.

ఈ విధంగా కోవిడ్‌ -19 ‌వచ్చిన తర్వాత ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. పని చేయాలని ఉన్నా వారికి పనులు దొరకడం లేదు. అనేక కంపెనీలు తమ ఉద్యోగులను జీతం లేకుండా సెలవుపై వెళ్ళమని ఒత్తిడి చేస్తున్నాయి. సెలవుపై వెళ్ళాల్సి వచ్చిన పెద్ద ఉద్యోగులు తమ వద్ద పని చేసే వారికి బాగా డబ్బు ఇస్తున్నారు. ఏప్రిల్‌ ‌మొదటి వారంలో సిఎంఐఈ విడుదల చేసిన గణాంకాల ప్రకారం పని చేయడానికి సిద్దంగా ఉన్నవారిలో 23 శాతం మంది నిరుద్యోగులు. ఈ సంఖ్య మన అంచనా కన్నా తక్కువే. ప్రేమ్‌ ‌జీ యూనివర్శిటీ, సిఎస్‌డిఎస్‌ ‌సర్వే ప్రకారం 40 శాతం మంది దినసరి వేతనం పొందుతున్నారు ప్రభుత్వ లెక్కల ప్రకారమే దేశంలో 77 శాతం మంది కార్మికుల ఉద్యోగాలు క్రమబద్దమైనవి కావు. పనులకు వెళ్ళకపోతే 90 శాతం మందికి ఆదాయం ఉండదు. ఇలాంటి పరిస్థితులలో కొరోనా వంటి విపత్తుల వల్ల రోజువారీ కార్మికుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. లాక్‌ ‌డౌన్‌ ‌వల్ల చాలా మంది ఈ మాదిరి కార్మికులు ఆదాయాన్ని కోల్పోయారు. అలాగే, చిన్న వ్యాపారాలు చేసే వారు తమ వద్ద పని చేసేవారికి వేతనాలను ఇవ్వలేకపోతున్నారు. మన దేశంలో అసంఘటిత రంగాల కార్మికుల పరిస్థితి ఇలాగే ఉంది. లాక్‌ ‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత కూడా పరిస్థితి మరింత దారుణంగా తయారు కావచ్చు. దీనిని నివారించాలంటే సరైన ప్రణాళిక ఉండాలి. చైనా ఇలాంటి సంక్షోభాలను తట్టుకోగలుగుతోందంటే అందుకు కారణం స్థానిక మార్కెట్లను అభివృద్ధి చేయడమే. మన దేశంలో అలాంటి వ్యవస్థ లేదు.

- Advertisement -

మన దేశం ఆకలిపై యుద్ధాన్నీ, ద్రవ్య మౌలిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. కనుక మనం కూడా ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కోగల సామర్థ్యం ఉన్నవారిమే. ఉపాధి హామీకి నిధులను పెంచాల్సిన అవసరం ఉంది. దినసరి కార్మికులను ఆదుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. మన దేశంలో స్వయం ఉపాధి రంగాల్లో ఉన్న వారిలో 54 శాతం మంది కార్మికులే. వచ్చే మూడు నెలలకు 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్‌ ఇవ్వాలి. చిన్న, మధ్యతరహా పరిశ్రమల వారికి సబ్సిడీలు ఇవ్వాలి. పన్ను రాయితీలు ఇవ్వాలి. రిటైల్‌ ‌రంగంలో వ్యాపారులను కూడా ఆదుకోవాలి. ఊబర్‌ ‌డ్రైవర్లు వంటి స్వయం ఉపాధి రంగంలో వారికి సాయం అందించాలి. లాక్‌ ‌డౌన్‌ ‌పూర్తిగా ఎత్తేసే వరకూ వారికి ఆదాయం ఉండదు కనుక, ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రస్తుత వాతావరణం యుద్ధాన్ని పోలింది. ఈ యుద్ధంలో గెలవాలంటే అందరి సహకారం తీసుకోవాలి. కరోనాపై పోరులో అందరినీ భాగస్వాములను చేయాలి.

– ‘ద క్వింట్‌’ ‌సౌజన్యంతో.

Leave a Reply