మహబూబ్‌గర్, 2 మే( ప్రజాతంత్ర ప్రతినిధి) : ఉపాధి హామీ పథకం కింద మహబూబ్‌గర్ జిల్లాలో ఈనెల మే మాసంలో 51 వేల మంది కూలీలకు పనులు కల్పిస్తున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.శనివారం మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం పల్లెమోని కాలనీ వద్ద అటవీ ప్రాంతంలో ఉపాధి హామీ పనులను మంత్రి తనిఖీ చేశారు . ఈ సందర్భం గా కూలీలకు శాని టైజర్లు,మాస్కులను పంపిణీ చేశారు. కూలీలను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ కూలీలు ఉపాధి హామీ పనులు జాగ్రత్తగా చేసుకోవాలని, ముఖ్యంగా వేసవిలో జాగ్రత్తగా ఉండాలని, తగినంత నీరు తీసుకోవాల ని, నీడకు ఉండాలని చెప్పారు. కూలీలు ఇబ్బందులు పడకుండా పనిచేసేచోట తాగునీటితో పాటు ,నీడ ఏర్పాటు చేయాలని, అంతేకాక భోజనం చేసే వారికి చిన్న పిల్లలకు తల్లి పాలు ఇచ్చేందుకు నీడ ఏర్పాటు చేయాలని అధికారుల ను ఆదేశించారు. కరోనా లాక్ డౌన్ కాలంలో సైతం జిల్లా అంతటా ఉపాధి కల్పిస్తున్నామని మంత్రి వెల్లడించారు. మహబూబ్ నగర్ జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేశామని ,అయినప్పటికీ జిల్లా ప్రజలు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు .గత సంవత్సరం ఇదే సమయంలో జిల్లాలో ఉపాధి హామీ కింద కేవలం తొమ్మిది వేల మందికి మాత్రమే పనులు కల్పించగా ఈ సంవత్సరం 50 వేల మందికి కల్పిస్తున్నామని తెలిపారు.
గతంలో జిల్లా వ్యాప్తంగా తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఇప్పుడు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగు నీరు,24 గంటల విద్యుత్ ,పెన్షన్లు ఇవ్వడం జరుగుతున్నదని,పల్లెమొని కాలనీ ని కొత్త గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశామనిఅన్నారు. ఉపాధి హామీ కూలీలకు రోజుకు 237 రూపాయలు ఇస్తున్నా మని తెలిపారు. కలెక్టర్ ఎస్ .వెంకట రావు మాట్లాడుతూ మహబూగర్ జిల్లా త్వరలోనే గ్రీన్ జోన్ లోకి వస్తుందని తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ నిబంధనలు కొంత సడలింపు ఇచ్చాయని, గ్రామీణ ప్రాంతంలో 16 రంగాలలో పనిచేసుకునేందుకు మినహాయింపు ఇవ్వడం జరిగిందని, దీని వల్ల 9 వేల మంది పనిలో ఉన్నారని తెలిపారు. ఉపాధిహామీ కూలీలు అందరికీ శాని టైజర్లు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా వ్యాప్తంగా వీటిని పంపిణీ చేస్తున్నామని తెలిపార. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ వెంకట్ రెడ్డి, ఎంపీడీవో నటరా జు, తాసిల్దార్ అఖిల ప్రసన్న , సర్పంచ్ వెంకటమ్మ జెడ్ పి కో ఆప్షన్ సభ్యులు అహ్మద్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అటవీ ప్రాంతంలో మోటార్‌సైకిల్‌పై వెళ్లి ఉపాధి పనులను తనిఖీ చేశారు అనంతరం మంత్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఆశ కార్యకర్తలకు నిత్యావస ర సరుకులను పంపిణీ చేశారు. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు జాగ్రత్తగా ఉండాలని జిల్లాలో కరోనా వ్యాప్తి చెందకుండా చేసినప్పటికీ జాగ్రత్తలు తీసుకో వాలని ప్రత్యేకంగా సామాజిక దూరం పాటించాలని, అంద రూ మాస్కు దరించాలని కోరారు మండలాన్ని అన్ని రకాలు గా అభివృద్ధి చేయడం జరుగుతుందని ప్రత్యేకించి కోటి రూపాయలతో రైతు బజార్ అభివృద్ధి చేస్తున్నామని అంతేకా క త్వరలోనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీటిని మండలంలోని వ్యవసాయ పొలాలకు అందిస్తామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు రైతులకు రైతుబంధు, ఆసరా పింఛన్లు, 6 24 గంటల ఉచిత విద్యుత్ సాగునీరు వంటి సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని వీటన్నిటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఆనంతరం హన్వాడ మండల కేంద్రంలో ప్రస్తుతం ఉన్న రైతు బజార్ స్థానంలో పక్క రైతు బజార్ నిర్మాణం విషయమై కలెక్టర్ అధికారులు,స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఎస్.వెంకట్రావు అదనపు కలెక్టర్ సీతారామారావు ,ఆర్డీవో శ్రీనివాసులు ఎంపీపీ బాలరాజు మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు జెడ్పీటీసీ విజయనిర్మల వైస్ ఎంపీపీ లక్ష్మి జెడ్పి కో ఆప్ష న్ సభ్యులు అంవార్ హుస్సేన్ తదితరులు ఉన్నారు.