Take a fresh look at your lifestyle.

పల్లె ప్రగతితో యువతకు ఉపాధి

గ్రామాలు, పట్టణాలు పరిశుభ్రంగా మారాలి
ప్రజల భాగస్వామ్యం పెరిగేలా చేయాలి : మంత్రి కెటిఆర్‌
పల్లె, పట్టణ ప్రగతి వల్ల గ్రామాలు, పట్టణాల రూపురేఖలు మారడమే గాకుండా దీనివల్ల అనేక మంది యువతకు ఉపాధి అవకాశాలు వొచ్చాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వామ్యం అయితే అనుకున్న లక్ష్యం మరింత వేగంగా ముందుకు తీసుకుని వెళ్లవొచ్చన్నారు. వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ ‌పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ ‌కార్యాలయం వద్ద హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం పట్టణ ప్రగతిలో భాగంగా చేపట్టాల్సిన పనులపై అధికారులకు, వార్డు కౌన్సిలర్లకు మంత్రి కేటీఆర్‌ ‌దిశా నిర్దేశం చేశారు. జులై 1న ప్రారంభమైన పట్టణ ప్రగతి 10 రోజుల పాటు కొనసాగనుంది.

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో చేపట్టిన పనులన్నీ ప్రజలకు కనిపిస్తున్నాయని, వీటితో నగర రూపురేఖలు మారుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ప్రజల సమస్యలు గుర్తెరిగి అతి తక్కువ సమయంలో అద్భుతమైన అభివృద్ధికి బాటలు వేశారని అన్నారు. ఇలా తెలంగాణను అన్ని విధాలుగా సాకారం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రాష్ట్రం రాక ముందు మొక్కలు నాటడమంటే తెలియదని అలాంటిది హరితహారం కార్యక్రమం ప్రజల భాగస్వామ్యంతోనే విజయవంతంగా నడుస్తుందన్నారు. రోడ్డుకు రెండు వైపులా చెట్లున్న రాష్ట్రం అని ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారన్నారు. పర్యాటక, ఆధ్యాత్మికంగా విలసిల్లుతున్న వేములవాడ పట్టణంలో వీధులు పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజలంతా తమ సలహాలు, సూచనలు కౌన్సిలర్లకు, మున్సిపల్‌ అధికారులకు తెలుపాలన్నారు.

Leave a Reply