Take a fresh look at your lifestyle.

వర్కర్లకు జీతాలు ఇవ్వలేక యజమాన్యాల ఆందోళన

  • హొటల్‌ ‌వ్యాపారంపై కరోనా దెబ్బ
  • కర్ఫ్యూ కారణంగా పడిపోయిన అమ్మకాలు

గుంటూరు, మే 26 : కొవిడ్‌ ‌ప్రభావం హొటల్‌ ‌రంగంపై పడింది. కరోనా పుణ్యమా అని గత ఏడాది నుంచి హొటల్‌ రంగంపై ఆధారపడి జీవించే కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. కొవిడ్‌ ‌సెకండ్‌ ‌వేవ్‌ ‌పుణ్యమా విధించిన కర్ఫ్యూ సమయాలు హొటల్‌ పాలిట శాపంగా తయారయ్యాయి. కర్ఫ్యూ భోజన హొటల్‌ ‌ఫాస్ట్ ‌ఫుడ్స్ ‌నిర్వహకులను దారుణంగా దెబ్బతీస్తోంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్ర మే కర్ఫ్యూ సడలింపు ఉండటంతో భోజన హొటల్‌ నిర్వ హణ కష్టంగా మారింది. సాధారణంగా మధ్యాహ్నం 1 గంట సమయంలో జనం భోజన చేసేందుకు హొటల్‌ కు వస్తుంటారు. కర్ఫ్యూ కారణంగా గంట ముందే అంటే 12 గంటల కల్లా •టళ్లు మూసేయాల్సి వస్తుంది.

సాయంత్రం వేళల్లో నిర్వహించే నూడిల్స్, ‌పానీపూరి బండ్ల నిర్వహకులపై కొవిడ్‌ ‌ప్రభావం కొట్టిచ్చినట్లు కనపడుతోంది. రాత్రి వేళల్లో భోజన హొటల్‌ లో ఎక్కువ వ్యాపారం ఉంటుంది. ఆ సమయంలోనూ కర్ఫ్యూ కారణంగా అవి మూసేయాల్సి వచ్చింది. గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున్న భోజన హొటల్‌ బిర్యానీ సెంటర్లు ఉన్నాయి. అలాగే పట్టణంలో పేరొందిన భోజన హొటల్‌ ఉన్నాయి. వాటి ద్వారా ప్రతి రోజూ లక్షల రూపాయల వ్యాపారం నడిచేది. ప్రస్తుతం ఎక్కడా హొటల్‌ ‌తెరిచి ఉంచే పరిస్థితి లేదు. వారి యజమానులతో పాటు పని చేసే కార్మికుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ఇవే కాక కర్రీ పాయింట్లు, నూడిల్స్ ‌బండ్లు నడుపుకునే వారు, డాబాల నిర్వాహ కులకు కూడా బతుకు భారంగా తయారైంది.

గత నెల రోజులుగా హొటల్‌ స్ట్రీట్‌ ‌ఫుడ్‌ ‌బండ్లు, కర్రీస్‌ ‌పాయింట్స్, ‌నూడిల్స్, ‌పానీపూరి బండ్లు మూత పడటం గమనార్హం. ప్రభుత్వం కర్ఫ్యూను ఉదయం 6 గంటల నుంచి కాకుండా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సడలిస్తే ఊరట లభిస్తుందని, కనీసం భోజనం పార్సిల్స్ అయినా అమ్ముకుంటామని హొటల్‌ నిర్వాహకులు కోరుతున్నారు.

Leave a Reply