పని భారంతో ఉక్కిరిబిక్కిరి మైక్రోసాఫ్ట్ సర్వే
భారతదేశ ఉద్యోగులు ఇంటి నుండి పని (వర్క్ ఫ్రొమ్ హోమ్) చేయడానికి చాలా కష్టపడుతున్నారు అని మైక్రోసాఫ్ట్ సర్వే చెబుతున్నది. చాలా మంది జెనరేషన్గ్ భారతీయ ఉద్యోగులు యజమానులు తమ నుంచి చాలా డిజిటల్ పని డిమాండ్ చేస్తున్నారని కొరోనా మహమ్మారి కాలంలో తమ పనిభారం గణనీయంగా పెరిగిందని అభిప్రాయ పడుతున్నారు. ఇంటి నుండి పనిచేయడం చాలా మంది భారతీయులకు అంది వచ్చిన అవకాశంగా లేదు. మైక్రోసాఫ్ట్ తొలి వార్షిక వర్క్ ట్రెండ్ ఇండెక్స్ ప్రకారం, చాలా మంది భారతీయ ఉద్యోగుల నుంచి వారి యజమానులు చాలా డిజిటల్ పనిని డిమాండ్ చేస్తున్నారు. మార్చి 2020లో ఇంటి నుండి పనిచేయడం ప్రారంభించినప్పటి నుండి భారతీయ ఉద్యోగులు తమపై పనిభారం గణనీయంగా పెరిగిందని భావిస్తున్నారు.
‘‘గత సంవత్సరంలో చాలా మంది ఉద్యోగుల స్వీయ-అంచనా ఉత్పాదకత బాగుంది లేదా మునుపటికంటే పెరిగింది. అయితే ఉద్యోగులు అయిన మనుషులు పూర్తీ స్థాయిలో పతనం అవుతున్నారు అని ’’మైక్రోసాఫ్ట్ తెలిపింది. మైక్రోసాఫ్ట్ చేసిన ఈ సర్వేలో 31 దేశాలకు చెందిన 30,000 మందికి పైగా ఉద్యోగులు పాల్గొన్నారు. పంచవ్యాప్తంగా గత సంవత్సరంలో గణనీయంగా ఒక రోజులో కార్మికులు డిజిటల్ పని చాలా చేస్తున్నారని దీని వలన ఉద్యోగులపై ఒత్తిడి తీవ్రత పెరిగిందని సర్వే తెలిపింది. ‘‘ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ టీమ్ మీటింగ్ లలో గడిపిన సమయం రెండింతల (2.5 ) కంటే పెరిగింది. 62% టీమ్ కాల్స్ మరియు మీటింగులు షెడ్యూల్ చేయబడలేదు లేదా తాత్కాలికంగా నిర్వహించబడ్డాయి. సగటు టీమ్ మీటింగ్ 10 నిమిషాల కన్నా ఎక్కువగా జరుగుతున్నాయి. సంవత్సరానికి 35 నుండి 45 నిమిషాల వరకు మీటింగుల సమయం పెరిగిందని’’ మైక్రోసాఫ్ట్ చెబుతున్నది.
18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ఉద్యోగులు భారతదేశంలో ఇంటి నుండి పని భారాన్ని ఎదుర్కొంటు కష్టపడుతున్నారు. మైక్రోసాఫ్ట్ సర్వేలో దాదాపు 71% జనరేషన్గ్ ఉద్యోగులు కేవలం జీవం ఉండి మనుగడ కొనసాగిస్తున్నారు అని లేదా ‘‘ఫ్లాట్-అవుట్’’ అవుతూ జీవచ్ఛవాలగా కష్టపడుతున్నారని సర్వ్ చెబుతున్నది. ‘‘పాత తరాల ఉద్యోగులతో పోల్చినప్పుడు జనరేషన్గ్ జీవితాన్ని..పనిని..సమతుల్యం చేసుకోటానికి కష్టపడుతున్నారు. రోజువారీ తమ పని తర్వాత పూర్తిగా అలసిపోతున్నటు’’ మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఈ వయస్సులోని ఉద్యోగులు పనిలో నిమగ్నం అవటం లేదా ఉత్సాహంగా ఉండటానికి ఎక్కువ కష్టపడుతున్నారు. సమావేశాల సమయంలో పని జరిగేలా చూడటం లో కొత్త ఆలోచనలు ప్రతిపాదించటంలో డిజిటల్ ఉద్యోగులు ఫెటీగ్ ఫీల్ అవుతూ డిజిటల్ పని భారంతో కుంగిపోతున్నారు.