Take a fresh look at your lifestyle.

‌ప్రకటనలతో ఉద్యోగస్తులను మోసం చేస్తున్నారు

  • ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కెసిఆర్‌ ఎత్తుగడ
  • సిఎంపై రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌ఫైర్‌

‌సిఎం కేసీఆర్‌ ‌మరోసారి ఉద్యోగస్తులను ప్రకటనలతో మోసం చేయాలని చూస్తున్నారని బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌మరోసారి సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. వేతన సవరణ సంఘం పదవీకాలం రెండేళ్లు పూర్తి చేసుకున్నా..డిసెంబరు 31న పదవీ కాలం ముగుస్తుందని తెలిసీ కూడా వేతన సవరణ సంఘం రిపోర్టు ఇవ్వకపోవడం తెలంగాణ ఉద్యోగులను మోసం చేయడమేనని అన్నారు. రెండు సంవత్సరాల పాటు పీఆర్సీ కమిషన్‌ ‌చేయని పనిని..ఇప్పుడు చీఫ్‌ ‌సెక్రటరీ నాయకత్వంలో కొత్త కమిటీ చేస్తదని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

రెండేళ్లలో చేయని పనిని చీఫ్‌ ‌సెక్రటరీ రెండు నెలల్లో ఎలా పూర్తి చేస్తాడు..? మనతో విడిపోయిన ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్రంలో 27 శాతం మధ్యంతర భృతి ఇస్తుంటే.. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో కేసీఆర్‌ ‌కనీసం జీతాలు కూడా ఇవ్వలేకపోతుండని మండిపడ్డారు. ఫిబ్రవరిలో ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి, ఉద్యోగస్తులను మచ్చిక చేసుకోవడం కోసం ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నాడని, అయితే కెసిఆర్‌ ‌బహురూపుల వేషాలను ఇక ఎవరూ నమ్మరని బండి అన్నారు. పగటి వేషాలు వేసేవాళ్లు కూడా కేసీఆర్‌ను చూసి నవ్వుకుంటున్నారు. గత ఆరేళ్ల నుంచి ఉద్యోగులను, నిరుద్యోగులను మోసం చేసిండు. ఈరోజు కేసీఆర్‌ ‌చేసిన ప్రకటనలో కొత్తదేవి• లేదు. ఫిబ్రవరిలో ఎమ్మెల్సీ ఎన్నికలు రానున్నాయి కాబట్టి, ఎలాగూ ఎన్నికల కోడ్‌ ‌వొస్తది కాబట్టి.. ఆ పేరుతో తప్పించుకోవడం కోసం మరో నాటకమేస్తుండని సంజయ్‌ ‌మండిపడ్డారు.

Leave a Reply