Take a fresh look at your lifestyle.

ధనిక రాష్ట్రాంలో ఉద్యోగుల పాట్లు…

“తెలంగాణ ధనిక రాష్ట్రం ఉద్యోగులకు మెరుగైన వేతనాలు ఇస్తామన్న మాట నేడు జీతాల కోతల వరకు వచ్చి విస్మయానికి గురిచేస్తుంది. ధనిక రాష్ట్రలో జీతాలు లేక ఉద్యోగుల భతుకులు చీకటిగా మారినాయి. మా జీతాలు కత్తిరించి మా కుటుంబాలను చీకట్లోకి నెట్టేస్తారా ! మమ్ముల్ని చులకనగా చూస్తారా ! ఇదెక్కడి న్యాయం అని ఆవేధన వెల్లబుచ్చుతున్నారు. మన దేశంలోని ఏ రాష్ట్రంలోనూ జీతాల కోతలేదు. తెలంగాణలోనే ఎందుకు జీతాల కోత విధిస్తున్నారు. కోర్టువారు కనీసం పెన్షనర్లకు పూర్తిజీతం ఇవ్వాలన్నా మాటను కూడా పెడచెవిన పెడుచుంటిరి ఇది ధర్మమా !”

ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య అనుసంధాన కర్తలై వారధిగా ఉంటూ పాలన బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల పదవ పీ.ఆర్‌.‌సి. (పే రివిజన్‌ ‌కమిషన్‌) ‌కాలపరిమితి 2018 జూన్‌, 30‌వ తేదీతోనే ముగిసిపోయింది. మార్కెట్‌ ‌నిత్యవసర వస్తువుల ధరల సూచీ ఆధారం ప్రతి ఐదేళ్లకు ఒకమారు వేతన స్థిరీకరణ చేయుటకు ప్రభుత్వం పీ.ఆర్‌.‌సి. కమిటీని వేసి, ఆయా కాలమాన స్థితిగతుల ఆధారంగా వేతనాల స్థిరీకరణ చేస్తుంది. ముగ్గురు సభ్యులను వేసి త్వరితగతిన పి.ఆర్‌.‌సి. నివేదిక తెప్పించి మూడు నెలల్లోనే అమలు చేస్తామన్న మాట ! 2 సం।।రాలైనా కమిషన్‌ ‌నివేదిక జాడేలేదు. తెలంగాణ ఉధ్యమ కాలంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలిస్తామంటిరి, అందరికి ప్రమోషన్లు ధమాకా అంటిరి, ఉద్యోగ, ఉపాద్యాయులు ఉధ్యమంలో పోరాట జెండాభూని ముందు నడిచిరి. అది మరిచి నేడు ఉద్యోగులకు జీతాల్లో కోతలు పెట్టుచుంటిరి. ఉద్యోగ, ఉపాధ్యాయులు నాకు రెండు కళ్లు లాంటి వారు, నేను ఫ్రెండ్లీ ప్రభుత్వం నడుపుతానని మాటలు చెప్పినారు. అట్టి మాటలు నేడు నీటి మూటలుగా మారినాయి. ప్రమోషన్ల కాదుకదా అనేక కారణాలతో నియామకాలే లేకపాయే ? ధనిక రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జీతాలకు డబ్బులు లేకుండా పోవడం చూస్తుంటే ముందు చూపు లేదనే సందేహం ఉద్యోగ, ఉపాద్యాయుల్లో కలుగుతుంది.

పీ.ఆర్‌.‌సీ. త్రిసభ్య కమిటీ వేసి రెండేళ్లు గడిచిపోయినా పీ.ఆర్‌.‌సీ. అటుకెక్కింది. అది వచ్చే వరకు ఇచ్చే ఐ.ఆర్‌. (ఇం‌టీరియం రిలీఫ్‌) ఇవ్వరైతిరి. 3 నెల) రిపోర్టు తెప్పించి తెలంగాణ అవతరణ జూన్‌-2 ‌న ఐ.ఆర్‌. ఇస్తమంటిరి. స్వతంత్ర దినోత్సవం, ఆగష్టు 15 నాటికి ఎవరు ఊహించని పి.ఆర్‌.‌సి. ఉంటుందంటిరి. నేటికి ఏ ఒక్కటి అమలు కాకపోగా సగం జీతంతో అవస్తలు పడుచున్నది మీకు తెలియదా, త్వరలో వరాల జల్లు రాతలు, మాటలు విని విసిగెత్తిన ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. మన నుండి విడిపోయిన ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగ, ఉపాధ్యాయులు సంతోషంగా కోతలు లేని జీతాలకు తోడు ఐ.ఆర్‌.‌తో ఆనందంగా ఉన్నారన్న విషయం నిజం. మీకు తెలియని విషయం కాదు కద. మరో మాట ఎన్నికల వేళ ఉద్యోగులకు 61 ఏండ్లు ఉద్యోగుల సర్వీస్‌ ‌పెంచుతామన్న మాటకూడా అమలు కాక ఎంతో మంది వేధన చెందుతూ పదవి విరమణ చేస్తున్నారు. మరో ప్రక్క సంఘనాయకుల(బందువు)కు మాత్రం లాభియింగులతో విరమణ వయస్సు పెంచుకుంటూ పోవుచున్నారు ఇది న్యాయమా ! ఇన్నాళ్లు ఎన్నికల కోడ్‌, ఆర్థిక మాంధ్యం అంటూ కమిటి నివేదికను తెప్పించరైతిరి. పీ.ఆర్‌.‌సి. లేదాయే ? అది వచ్చేదాక ఇచ్చే ఐ.ఆర్‌. ఇవ్వరైతిరి. ఇంకా ఫ్రెండ్లీ గవర్నమెం•ని ఎలా భావించాలి. దేశంలోనే ధనిక రాష్ట్రంగా పేరు ప్రతిష్ఠలు, కీర్తి కిరీటాలు రావడానికి మా పని విధానం దోహద పడలేదా అని ఆవేదనలో ఉన్నారు. ఎలాంటి ప్రమోషన్లు లేకుండా పదవి విరమణ చేస్తున్నాము. అనాటి మాటలు ఏ ఒక్కటి ఈనాటి వరకు అమలు చేయక ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఉద్యోగ, ఉపాధ్యాయలు బాధలో ఉన్నారు. ఒక పేజీలో ఉద్యోగ సర్వీసు రూల్స్ అనీ అరచేతిలో స్వర్గం చూపించితిరి. ఏడేల్లైనా సర్వీస్‌ ‌రూల్స్ ‌జాడేలేదు. విద్యారంగంలో ప్రమోషన్ల తీగ కదలకపాయె? తెలంగాణ ధనిక రాష్ట్రం ఉద్యోగులకు మెరుగైన వేతనాలు ఇస్తామన్న మాట నేడు జీతాల కోతల వరకు వచ్చి విస్మయానికి గురిచేస్తుంది. ధనిక రాష్ట్రలో జీతాలు లేక ఉద్యోగుల భతుకులు చీకటిగా మారినాయి. మా జీతాలు కత్తిరించి మా కుటుంబాలను చీకట్లోకి నెట్టేస్తారా ! మమ్ముల్ని చులకనగా చూస్తారా ! ఇదెక్కడి న్యాయం అని ఆవేధన వెల్లబుచ్చుతున్నారు. మన దేశంలోని ఏ రాష్ట్రంలోనూ జీతాల కోతలేదు.

తెలంగాణలోనే ఎందుకు జీతాల కోత విధిస్తున్నారు. కోర్టువారు కనీసం పెన్షనర్లకు పూర్తిజీతం ఇవ్వాలన్నా మాటను కూడా పెడచెవిన పెడుచుంటిరి ఇది ధర్మమా ! మానవత్వమనిపించుకుంటుందా ? రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు అమలు చేస్తుంది ఉద్యోగులు కాదా ! ఉద్యోగులు జీతాలను యాచకుల్లా ఆడుక్కోవాలా ! ఆత్మగౌరవ పాలనలో ఐ.ఆర్‌. ‌రాదు -పీ.ఆర్‌.‌సీ. ఇవ్వరు. మూడు డి.ఎ.ల మాటే లేదు. న్యాయ బద్ధంగా రావలసిన వాటికి కరోనా సమయంలో పోరాటాలు చెయ్యాలా ! ఇది అప్రజాస్వామ్యం కాదా ! లాక్‌డౌన్‌ ఎత్తేసినా, ఆర్థిక పరిస్థితి మెరుగు పడినా ! ఉద్యోగుల జీతాలు సగమేనా ? దేశంలోనే మనది ధనిక రాష్ట్రం, ఆ తర్వాత కరోనా విరాళాలకు తోడు, కేంద్ర ప్రభుత్వ సహాయం, అయినా ఉద్యోగులకు జీతాలు మాత్రం సగమేనా అని ఒత్తిడిలో ఉద్యోగులున్నారు. ఋణాలు కట్టలేక, ఇంటి అద్దెలు, ని(అ)త్యావసరాల ఖర్చులు తడిసి మోపెడై దుర్బర జీవితాలను అనుభవిస్తున్నారని గమనించండి. అవినీతి పరులుగా ప్రజల నుండి వేరు చేసి, తక్కువ చేసి మాట్లాడడం భావ్యమా ! నేడు ఉద్యోగులకు ఉన్న హక్కులు గతంలో ఉద్యోగ సంఘాల నేతలు పోరాడి సాధించిన వాటిని ఉద్యోగ, ఉపాధ్యాయుల హక్కును ఆత్మగౌరవ పాలన పరిష్కరించకుండా హరించరాదు. ఉద్యోగులు యాచకులు కాదు, ప్రభుత్వ నిర్ణయాలను ప్రజల చెంతకు చేర్చే ప్రగతి ప్రధాతలని గమనించండి. వికేంద్రీకరణ పేరుతో జిల్లాలను విస్తరించి, నియామకాలు చేయకున్నా విపరీతమైన పనిఒత్తిడి, కరోనా మహమ్మారి విషగౌగిలిని లెక్కచేయకుండా ప్రభుత్వం వారు ఇచ్చే ప్రతి కార్యక్రమాన్ని తను భుజాన వేసుకొని పని చేస్తున్న ఉద్యోగ, ఉపాద్యాయులను గమనించండి. ఏదో కొద్దిమంది అవినీతి పరులను చూపించి ఉద్యోగులందరిని ఒకే గటున కట్టి చూడరాదు ? 30 ఏండ్ల సర్వీస్‌ ‌చేసినా సొంత ఇల్లు కూడా లేకపోగా, ఉద్యోగులు జీతంలో ప్రతీది ఆదాయ పన్నుతో లెక్కగట్టే పాలకులకు అన్ని విషయాలు తెలిసికూడా మనోవేధనకు గురిచేయరాదు. న్యాయంగా రావలసిన పి.ఆర్‌.‌సి., మూడు డి.ఎ.లు, మూడు నెలల సగం జీతం కలుపుకొని వచ్చే నెల నుండి పూర్తి వేతననాన్ని ఇవ్వాలి.

తెలంగాణ ఆత్మగౌరవ పోరాటంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ముందునడిచి భావజాల వ్యాప్తికి వారి శక్తియుక్తులను దారపోస్తూ, సకల జనుల సమ్మెతోపాటు అన్ని నిరసన కార్యక్రమాలను నిర్వహించి రాష్ట్రం సాధించుకున్నాం. సమగ్ర కుటుంబ సర్వే చేసి రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలిపినాం. కోరితెచ్చుకున్న రాష్ట్రంలో, పోరాడి సాధించుకున్న హక్కులు ఒక్కొక్కటిగా కాలరాయబడుతుంటే మీనమేషాలు లెక్కిస్తున్నాం. మరోసారి ఉద్యోగ, ఉపాధ్యాయుల ఐక్యత కనబర్చాల్సిన సమయం ఆసన్నమైంది. నాటి ఉద్యమ నాయకుడే నేడు ముఖ్యమంత్రిగా రెండవసారి బాధ్యతలు చేపట్టికూడా స్వమస్యలు తీర్చకపోగా ఎక్కడలేని విధంగా సగం జీతంతో జీవితాలను నెట్టుకు రాలేకపోవుచున్నారు. కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతందని కక్కలేక మింగలేక ఆత్మశోభతో కుంగిపోతున్నరు ‘‘వాడుకోవదులుకో’’ అన్నట్లుగా ఉందనిపిస్తుందని ఆవేధన చెందుతున్నారు. పోరాటాలు మావి, ఫలితాలు సంఘనాయకులకా.. అని ఉద్యోగ, ఉపాధ్యాయులు సంఘనాయకులపై గుర్రుగా ఉన్నారు. గతంలో ఉద్యోగ సంఘాలు నాయకులు ప్రభుత్వాలతో పోరాడి సాధించిన హక్కులు నేడు పదవులు, సొంత పనుల వ్యామోహంలో పడి ఉద్యోగుల న్యాయమైన సమస్యలను సాధించలేకపోవుచున్నారు. ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు ప్రజల సేవకులేనని మరువకండి. ప్రభుత్వం కావాలనే అనేక అసంబంద్దమైన కొర్రీలు సాకుగా చూపుతూ ఉగ్యోగుల కుటుంబాలను ఇబ్బందులకు గురిచేయడం న్యాయం కాదు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. తెలంగాణ ఆత్మ గౌరవ పాలనలో న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించి, కోతల జీతాలనుండి విముక్తి చేయాలి…ఉద్యోగవృత్తి నిబద్ధత – పాలకుల పారదర్శకత, పాలితుల ప్రశ్నించే స్వేచ్ఛను బాధ్యతతో కూడిన హక్కుగా భావించాలి.

మేకిరి దామోదర్‌, ‌వరంగల్‌ ‌సెల్‌: 9573666650

Leave a Reply