Take a fresh look at your lifestyle.

సిఎంవో ఉద్యోగికి కొరోనా

కార్యాలయానికి తాళం వేసిన అధికారులు
‌తెలంగాణ లో కొరోనా మహమ్మారి ఉధృతి రోజురోజుకు పెరుగుతోంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లో ఎక్కువ కేసులు నమోదవుతుండటంతో నగరవాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా.. తెలంగాణా సీఎం కార్యాలయంలో కొరోనా కలకలం రేపింది. మెట్రో రైల్‌ ‌భవన్‌లో పనిచేస్తున్న సీఎంవో ఉద్యోగికి  పాజిటివ్‌ అని తేలింది. ఇటీవలే మహారాష్ట్ర నుంచి ఆ ఉద్యోగి కుమారుడు హైదరాబాద్‌కు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. కుమారుడి ద్వారా సీఎంవో ఉద్యోగికి వైరస్‌ ‌సోకిందని గుర్తించడం జరిగింది. ఈ క్రమంలో సీఎంవో ఆఫీసుకు ఎవరూ రావొద్దని అన్ని శాఖల అధికారులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కొద్దిరోజుల పాటు సీఎంవో కార్యాలయం బంద్‌ ‌కానుంది. ఇప్పటి వరకూ మొత్తం 30 మంది సిబ్బంది శాంపిళ్లను చెస్ట్ ఆస్పత్రి వైద్య సిబ్బంది సేకరించింది. కాగా.. సీఎంలోలో పని చేస్తున్న వారిలో సీనియర్‌ ‌సిటిజన్స్ అధికంగా ఉన్నారు. దీంతో సీఎంవోలో తీవ్ర ఆందోళన నెలకొంది. మరోవైపు సీఎంవో మొత్తం సిబ్బంది శానిటైజేషన్‌ ‌చేస్తోంది. ఈ క్రమంలో పొల్యూషన్‌ ‌బోర్డు కార్యాలయం నుంచి ప్రధాన సలహాదారు రాజీవ్‌ ‌శర్మ విధులు నిర్వహిస్తున్నారు.

Leave a Reply