Take a fresh look at your lifestyle.

దూసుకుని వస్తున్న బ్లాక్‌ ‌ఫంగస్‌

ఇం‌తవరకూ 5,424 బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌కేసులు నమోదు
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ ‌హర్షవర్ధన్‌ ‌వెల్లడి

న్యూఢిల్లీ,మే24: దేశంలో ని పలు రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఇంతవరకూ 5,424 బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ ‌హర్షవర్ధన్‌ ‌తెలిపారు. కోవిడ్‌పై మంత్రుల గ్రూపుతో సోమవారం జరిపిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బ్లాంగ్‌ ‌ఫంగస్‌ ‌కేసుల్లో మెజారిటీ కేసులు కోవిడ్‌ ‌బారిన పడిన వారేనని, వారిలో సగమందికి డయాబెటిస్‌ ‌కూడా ఉందని చెప్పారు. కర్ణాటక, ఢిల్లీ, మహారాష్ట్ర, యూపీ సహా పలు రాష్టాల్లో్ర ఈ కేసులు వెలుగుచూస్తున్నాయి. 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇంతవరకూ 5,424 మందికి బ్లాగ్‌ ‌ఫంకస్‌ ‌వచ్చిందన్నారు.

వీరిలో 4,556 మందికి కోవిడ్‌ ‌చరిత్ర ఉందని, 55 శాతం మంది పేషెట్లకు మధుమేహ వ్యాధి ఉందని వివరించారు. కోవిడ్‌ ‌బారిన పడిన పేషెంట్లలో బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌కేసుల ట్రెండ్‌ ‌క్రమంగా దేశంలో పెరుగుతోంది. కోవిడ్‌ ‌ట్రీట్‌మెంట్‌లో హెచ్చు మోతాదులో స్టెరాయిడ్స్ ‌వాడటమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. ఇన్‌ఫెక్షన్‌ ‌సోకిన వారిని గుర్తించేందుకు వీలుగా బ్లాగ్‌ ‌ఫంగస్‌ను అంటువ్యాధుల చట్టం-1987 కింద నోటిఫయబుల్‌ ‌వ్యాధిగా పలు రాష్టాల్రు ఇప్పటికే ప్రకటించాయి. వ్యాధుల స్క్రీనింగ్‌, ‌డయాగ్నసిస్‌, ‌మేనేజిమెంట్‌ ‌విషయంలో కేంద్రం మార్గదర్శకాలను అన్ని ప్రభుత్వ, ప్రైవేటు హెల్త్ ‌సెంటర్లు, మెడికల్‌ ‌కాలేజీలు అమలు చేస్తున్నాయి. కోవిడ్‌ ‌పేషెంట్లలో, ముఖ్యంగా కోవిడ్‌ ‌నుంచి కోలుకున్న పేషెంట్లలో బ్లాగ్‌ ‌ఫంగస్‌ను గుర్తుస్తున్నారు. ఇది ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన వ్యాధిగా చెబుతున్నారు. కోవిడ్‌ ‌చికిత్స సమయంలో ఇండస్టియ్రల్‌ ఆక్సిజన్‌ ఉపయోగించడం అనేది బ్లాగ్‌ ‌ఫంగస్‌ ‌పెరుగుదలకు కారణమవుతోందా అనే అంశంపై కూడా కర్ణాటకలో నిపుణులు అధ్యయనం చేస్తున్నారు.

Leave a Reply