Take a fresh look at your lifestyle.

ఎపిలో 22న పోలీస్‌ ఉద్యోగాల అర్హతపరీక్ష

  • భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు
  • నిముషం ఆలస్యం అయినా అనుమతి నిరాకరణ

విజయవాడ, జనవరి 20 : పోలీసు శాఖలో ఉద్యోగం.. హోదాకు చిహ్నం. మంచి జీతం, సమాజంలో గౌరవంతో పాటు కుటుంబ సభ్యులకు అందుబాటులో ఉండడంతో పోలీస్‌  ఉద్యోగం అంటే యువతకు క్రేజీగా మారింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కానిస్టేబుల్‌ ‌నియామకాలకు నోటిఫికేషన్‌ ‌విడుదల చేసింది. ఇందులో భాగంగా ఈనెల 22న ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. ఓసీ అభ్య ర్థులకైతే 40శాతం మార్కులు కనీస అర్హత., బీసీలైతే 35 శాతం, ఎస్సీ, ఎస్టీ అయితే 30శాతం కనీస మార్కులు సాధించాలి. పోటీ తీవ్రతను బట్టి కటాఫ్‌ ‌మార్కులు నిర్ణయిస్తారు.

కానిస్టేబుల్‌ ‌నియామక పక్రియలో భాగంగా ఈనెల 22న  అర్హత పరీక్ష నిర్వంహించనున్నారు.  పరీక్ష కేంద్రంలోకి ఉదయం 9గంటలకే అనుమతిస్తారు. 9.30 గంటల్లోపు బయోమెట్రిక్‌ ‌హాజరు తీసుకుంటారు. 9.30 గంటలకు ఓఎంఆర్‌ ‌షీట్‌ అం‌దిస్తారు. దానిలో ఉన్న అభ్యర్థి వివరాలు సరిచూసు కోవాలి. వత్యాసాలు ఉంటే వెంటనే ఇన్విజిలేటర్‌ ‌దృష్టికి తీసుకువెళ్లాలి. 9.55 గంటల కు ప్రశ్నపత్రం బుక్‌లెట్‌ ఇస్తారు. రెండోకాలంలో బుక్‌లెట్‌ ‌సంఖ్యను వేయడంతో పాటు ఆయా సంఖ్యలను దిగువన ఉన్న గడిలో నింపాలి. బుకెలెట్‌ ‌కోడ్‌ను మూడో కాలమ్‌లో రాయాలి. 10 గంటలకు ప్రశ్నపత్రం బుక్‌లైట్‌ను తెరిచి సమాధానాలను ఓఎంఆర్‌ ‌సీట్‌లో ఉన్న ఆయా గడుల్లో బాల్‌ ‌పాయింట్‌ (‌బ్లూ, బ్లాక్‌ ‌నలుపు) పెన్నుతో బబ్లింగ్‌ ‌చేయాలి. పది గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యం గా వచ్చినా అనుమతించరు. ఖాళీలను భర్తీ చేసేందుకు రిక్రూట్‌మెంట్‌ ‌బోర్డు నోటిఫికేషన్‌ ‌జారీ చేసింది. ఆయా ఖాళీలకు సంబంధించి అభ్యర్థులు దరఖాస్తు చేసు కున్నారు.

ఈ నెల 22న జరగనున్న కానిస్టేబుల్‌ ‌ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలను ఆయా జిల్లాల్లో ఎస్పీలు పరిశీలించారు. కేంద్రాల పూర్తిస్థాయిలో సదుపాయాలను కల్పించాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేయాలని, పరీక్ష కేంద్రాలు గుర్తించేలా ప్లెక్సీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గతానికి భిన్నంగా పోలీసు కానిస్టేబుళ్ల నియామక పక్రియల్లో అధికారులు కొన్ని మార్పులు చేశారు. గతంలో దేహదారుఢ్య పరీక్షల్లో అర్హత సాధించి నవారికి రాత పరీక్షకు అనుమతించి, అందులో అగ్రభాగాన నిలిచిన వారికి ఉద్యోగావకాశం కల్పించేవారు. గత రిక్రూట్‌మెంట్‌ ‌నుంచి ఈపక్రియలో మార్పులు చేసిన పోలీసు శాఖ మూడు దశల్లో పరీక్షలు నిర్వహించి అందులో విజయం సాధించిన వారికి ఉద్యోగావకాశాలను కల్పించనుంది. ముందుగా ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించి అర్హత సాధించేవారికి దేహదారుఢ్య పరీక్షల్లో భాగంగా 1600 టర్ల, 100 టర్లు పరుగుపందెం, లాంగ్‌ ‌జంప్‌లో ప్రతిభ కనపరిచేవారికి తుది రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ప్రిలిమినరీ పరీక్ష 200 మార్కులకు మూడు గంటల పాటు జరుగుతుంది.

Leave a Reply