Take a fresh look at your lifestyle.

జిల్‌ ‌జిల్‌ ‌జిగేల్‌…

  • సిద్ధిపేట పట్టణ ప్రధాన రహదారులకు విద్యుత్‌ ‌సొగబులు
  • ఏర్పాటుకు రూ.5.50 కోట్లు మంత్రి హరీష్‌ ‌రావు

సిద్ధిపేట పట్టణ పరిధి ప్రధాన రహదారులకు సెంట్రల్‌ ‌లైటింగ్‌, ‌మరియు డివైడర్‌ అభివృద్ధికి 5 కోట్ల 50 లక్షలు నిధులు మంజూరు అయినట్లు మంత్రి హరీష్‌ ‌రావు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…సిద్ధిపేట బైపాస్‌ ‌రోడ్డు జగ్జివన్‌ ‌రామ్‌ ‌సర్కిల్‌ ‌నుండి రూరల్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ‌వరకు 3కోట్ల 50 లక్షలతో  దాదాపు 5 కిమీ నాలుగు వరుసల రహదారులకు ఇప్పటికే మధ్య డివైడర్‌ అభివృద్ధి జరగగా పట్టణ పరిధి పెరగడం, సూడా ఏర్పాటు కావడం, బైపాస్‌ ‌రోడ్డులో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు, ముఖ్యంగా ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు దృష్ట్యా బైపాస్‌ ‌రోడ్డులో సెంట్రల్‌ ‌లైటింగ్‌ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

అదేవిధంగా నర్సాపూర్‌ ‌చౌరస్తా నుండి కరీంనగర్‌ ‌రాజీవ్‌ ‌రహదారికి అనుసంధానం చేసే కిలోమీటర్‌  ‌రోడ్డుకు ఇప్పటి•కే మధ్య డివైడర్‌ ‌నిర్మాణంతో అభివృద్ధి జరిగిందని, ఆ రోడ్డుకు కూడా సెంట్రల్‌ ‌లైటింగ్‌ ఏర్పాటు చేయనున్నామన్నారు. వేములవాడ కమాన్‌ ‌నుండి ఎల్లమ్మ గుడి వరకు దాదాపు 2 కోట్లతో 2.2 కీ మీ.డివైడర్‌తో పాటు సెంట్రల్‌ ‌లైటింగ్‌ ఏర్పాటు చేయనున్నామన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply