Take a fresh look at your lifestyle.

విద్యుత్తు చార్జీలు, ఇంటిపన్ను పెంచుతాం

  • పేదలకు మినహాయింపు వర్తిస్తుంది
  • పట్టణాల అభివృద్ధ్ది కోసమే పన్నులు
  • ఇంటి యజమానులే ఇంటి కొలతలు ఇవ్వాలి
  • ఎక్కడో ఒకచోట మార్పు ప్రారంభించాల్సిందే
  • మొక్కలు పెంచకుంటే కఠినంగా వ్యవహరిస్తాం
  • ప్రజాప్రతినిధులే జవాబుదారులు, అందుకే కొత్తచట్టాలు
  • ప్రజలకుసేవ చేసేందుకే పదవులు  
  • పల్లెప్రగతిపై స్వల్పకాలిక చర్చలో సీఎం కెసిఆర్‌

విద్యుత్తు చార్జీలు పెంచుతామని అందులో ఎటువంటి సందేహం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌శుక్రవారం శాసనసభలో స్ప్టష్టం చేశారు. పట్టణాలలో లే అవుట్‌కు పర్మిషన్‌ ఇచ్చే అధికారం జిల్లా కలెక్టర్‌లకు ఇచ్చామని, పారదర్శకమైన. జవాబుదారీ తనంతో కూడిన పాలన అందించాలని అనుకున్నప్పుడు, ఆదాయ వనరులు పెంచుకోవాలని నిర్ణయించి నప్పుడు కఠినంగా ఉండక తప్పదని సీఎం స్షష్టం చేశారు. గ్రా మాలు బాగు చేద్దామని, పట్టణాలు బాగుచేస్తామని అంటూ దశాబ్దాలు గడిచాయని పట్టణాలు ఇప్పటికీ దుర్గంధ పూరితంగానే ఉన్నాయని,ఎక్కడో ఒక చోట మార్పులను ప్రారంభించాల్సిందేనని తప్పదని ఆయన కఠిన నిర్ణయాన్ని ప్రకటించారు.విద్యుత్తు సంస్థలు మనుగడ సాగించాలంటే, విద్యుత్తు చార్జీలు పెంచకతప్పదని, అయితే ఎస్‌సీ,ఎస్‌టీ,ఇతర పేదలకు ఇదివరలోఉన్న మినహాయింపులు వర్తిస్తాయని సీఎం భరోసా నిచ్చారు. ఇంటిపన్నులు పెంచుతామని, పన్నులుచెల్లించేస్థోమగలవారికే వర్తించేవిధంగా పన్నులు ఉంటాయని ఆయన పేరొక్కన్నారు. ఓట్ల కోసం భయపడాల్సిన అవసరం తమకు లేదని, ప్రజలకు తమపైన పూర్తిగా నమ్మకం ఉన్నదని ఆయన చెప్పారు.

మున్సి పాలిటీలలో, గ్రామపంచాయతీలలో నిర్వహణ ఖర్చులను భరించాలంటే ప్రజలు పన్నులు చెల్లించాల్సి ఉంటుందని, తమ పట్టణ, గ్రామాల అభివృద్దికి నిధులు ఇస్తున్నామని భావించాలని చెప్పారు. రైతులకు ప్రకటించిన రుణమాఫీయే ఇందుకు ఉదాహరణని చెప్పారు. రైతులకు 2లక్షల వరకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్‌ ఎన్నికల మానిఫెస్టోలో చెప్పిందని, తాము మాత్రం లక్షవరకు మాత్రమే రుణమాఫీవఆ చేస్తామని చెప్పారు. అయినప్పటికీ రైతులు తమకే అధికారాన్ని ఇచ్చారని సీఎం ఉదహరించారు. భారతదేశంలోనే ఆదర్శవంతమైన పల్లెలను నిర్మంచేందుకు సంఘటితంగా పనిచేయాల్సిన సమయం వచ్చిందని ఆయన పిలుపు నిచ్చారు ప్రతీ గ్రామపంచాయతీలో విద్యా వైద్యం, అక్షరాస్యతాఉద్యమం, గిట్టుబాటుధరలు, తదితర అన్నీ రంగాల్లో కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులందరూ భాగస్వాములయ్యేవిధంగా, గ్రామాభివృద్దికి ప్రతీపౌరుడు జవాబుదారుడుగా ఉండేవిధంగా పకడ్బందీగా పంచాయతీరాజ్‌ ‌చట్టం తెచ్చామని, ఈ చట్టం ద్వారా ప్రజాప్రతినిధులు తప్పులు చేయడానికి అవకాశం ఉండదని సీఎం చెప్పారు.రాష్ట్రంలోని అన్ని గ్రామాలను ప్రణాళికబద్దంగా అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌తెలిపారు. పల్లెప్రగతి ద్వారా గ్రామాల రూపురేఖలను మారుస్తున్నామన్నారు.

రాష్ట్రంలో గ్రామాలు, మున్సిపాలిటీలు మరింత అభివృద్ధి చెందాలంటే ఆస్తిపన్ను పెంచాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్‌ అన్నారు.శాసనసభలో పల్లెప్రగతిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దేశంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలపాలన్నదే తమ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో 8 వేల 690 గ్రామ పంచాయతీలు ఉండగా వాటి సంఖ్యను 12,751కు పెంచినట్లు తెలిపారు. తండాల్లో గిరిజనులే పాలకులుగా ఉన్నారన్నారు. ప్రతీ గ్రామంలో వైకుంఠధామాల నిర్మాణాలు పూర్తిచేయనున్నట్లు తెలిపారు. వందశాతం వైకుంఠధామాలు కలిగిన రాష్ట్రంగా తెలంగాణను మారుస్తామన్నారు. మిషన్‌ ‌భగీరథ ద్వారా తాగునీరు అందిస్తున్నామన్నారు.మిషన్‌భగీరథ పనులను కేంద్ర జలశక్తి శాఖ అధికారులు ప్రశసించారని, నల్లగొండలో ఫ్లోరైడ్‌భూతాన్ని తరిమికొట్టగలిగామని సీఎం చెప్పారు. పాలనలో ప్రజల భాగస్వామ్యం కోసం స్టాండింగ్‌ ‌కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొత్త పంచాయతీరాజ్‌ ‌చట్టం ద్వారా అనేక సంస్కరణలు తీసుకొచ్చినట్లు చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు, ప్రజాప్రతినిదులపై చర్యలు తప్పవన్నారు. గ్రామాలన్నీ పచ్చదనంతో వెల్లువిరిసేలా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. 2020-21 ఏడాదిలో 23 కోట్లకుపైగా మొక్కలను నాటనున్నట్లు తెలిపారు. ప్లలెప్రగతి పర్యవేక్షణ కోసం సీనియర్‌ అధికారులను నియమించినట్లు వెల్లడించారు.

- Advertisement -

45 మంది ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారులతో కమిటీలను ఏర్పాటు చేసినట్లు సీఎం పేర్కొన్నారు.ఫ్లైయింగ్‌స్క్వాడ్‌ అధికారులకు విస్తృతమైన అధికారాలు ఉంటాయని, గ్రామాలలో పచ్చదనం కనిపించకపోయినా, చెట్లు ఎండిపోయినా, సర్పంచ్‌లపైన గ్రామపంచాయతీ సెక్రటరీలపైన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. చెత్తను ఏరివేసేందుకు, చెట్లకు నీళ్లుపోసేందుకు ట్రాక్టర్లు సరఫరా చేస్తున్నామని, గ్రామపంచాయతీ సిబ్బందిలో ఒకరికి ట్రాక్టర్‌ ‌డ్రైవింగ్‌ ‌శిక్షణ ఇవ్వాలని సూచించారు. గ్రామాలకు ఆదాయవనరులు పెంచేవిధంగా చర్యలు తీసుకుంటామని, ఆదాయవనరులు వచ్చేవిధంగా చట్టంలో అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఇందుకోసం పంచాయతీరాజ్‌ ‌చట్టాన్ని కచ్చితంగా అమలు చేసి తీరుతామన్నారు. ప్రజాప్రతినిధులకు విధులు, బాధ్యతలను స్పష్టంగా చెబుతూ చట్టం తెచ్చినట్లు తెలిపారు. విధులు, బాధ్యతలు, సక్రమంగా నిర్వహించకపోతే ప్రజాప్రతినిధులపై చర్యలు తప్పవన్నారు. గ్రామ పంచాయతీలకు ప్రతి నెలా తప్పకుండా నిధులు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేల వేతనాలు నిలుపుదల చేసైనా గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయిస్తామన్నారు. రాష్ట్రంలో 500 జనాభా ఉన్న గ్రామ పంచాయతీలు 20 ఉన్నాయి. ఈ గ్రామ పంచాయతీలకు కూడా ఐదేళ్లలో రూ. 40 లక్షలు వస్తాయన్నారు.

విద్యుత్‌ ‌ఛార్జీలు పెంచక తప్పదు
విద్యుత్‌ ‌సంస్థలు బతకాలంటే ఛార్జీలు పెంచక తప్పదని సీఎం అన్నారు.పేదలకు భారం లేకుండా విద్యుత్‌ ‌ఛార్జీలు పెంచుతామన్నారు. పన్నులు చెల్లించే స్థోమత ఉన్నవారికే పన్ను పెంపు వర్తించేలా చూస్తామన్నారు. లే అవుట్‌ల అనుమతులు కలెక్టర్లకు తప్ప మరెవరికి లేదన్నారు. ఇంటి కొలతలు యజమానులే అందిస్తారన్నారు. ఇంటి యజమానులు అందించిన లెక్కల ప్రకారమే పన్నుల విధింపు ఉంటుందన్నారు. ప్రజలపై తమకు నమ్మకం ఉందన్నారు. వాళ్లు నిజాలు చెబుతారనే ఆ బాధ్యత అప్పగించినట్లు తెలిపారు. అసత్యపు లెక్కలు ఇచ్చిన వారికి 25 రెట్లు జరిమానా విధిస్తామన్నారు. మొక్కలను పెంచే బాధ్యతను కూడా ప్రజాప్రతినిధులకు అప్పగించినట్లు తెలిపారు. ఓట్ల కోసం భయపడే పరిస్థితి తమలో లేదన్నారు. ప్రజలకు మాపై విశ్వాసం ఉండేలా పాలన అందిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు.

కామిడి నరసింహారెడ్డికి సీఎం ప్రశంస
వరంగల్‌ ‌జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దమ్మనపేట గ్రామానికి చెందిన కామిడి నరసింహారెడ్డి తన గ్రామ అభివృద్దికి రూ.25కోట్ల విరాళం ఇచ్చారని శాసనసభలో ప్రకటించారు. ఇంతగొప్ప దాతృత్వాన్ని ప్రదర్శించిన నరసింహారెడ్డిని అందరూ ప్రశంసించాలని సీఎం శాసనసభ్యులను కోరారు. దాతలు స్పూర్తినిస్తున్నారని, ప్రతీగ్రామంలో సంపన్నులు తమ గ్రామాల అభ్యున్నతికి సహకారం అందిస్తున్నారని వారందరిననీ సీఎం అభినందించారు. ప్రతీ మున్సిపాలిటీలో, ప్రతీ వార్డులో వార్డు అభివృద్ధి కమిటీలు ఉంటాయని ఆయన చెప్పారు. సీనియర్‌ ‌సిటిజన్స్, ‌మహిళలు,రచయితలు,విద్యార్థులు, మేధావులు, ఉద్యోగులు ఈ కమిటీలలో సభ్యులుగా ఉంటారని ఆయన చెప్పారు.

ఈ కమిటీలకు వార్డు కౌన్సిలర్‌ అధ్యక్షులుగా ఉండేవిధంగా చట్టంలో అవకాశం కల్పించామని ఆయన చెప్పారు. ప్రతీ మూడు మూసాలకు ఈ కమిటీలు సమావేశం కావాలని, వార్డుల అభివృద్ధిని సమీక్షించుకోవాలని, నిర్వహించాల్సిన పనుల జాబితాలను రూపొందించు కోవాలనని సీఎం సూచించారు. ప్రతీ పనిలో ప్రణాళికలు ఉన్నప్పుడే అభివృద్ధి జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply