Take a fresh look at your lifestyle.

అధిక విద్యుత్‌ ‌చార్జీలపై బీజేపీ రాష్ట్రవ్యాప్త ఆందోళన

  • ముఖ్య నేతల హౌస్‌ అరెస్టు, ఛ•లో విద్యుత్‌ ‌సౌధను భగ్నం చేసిన పోలీసులు
  • పాలన మరచి,  ప్రభుత్వం వడ్డీ వ్యాపారం చేస్తోంది : బండి సంజయ్‌ 

టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ప్రజలపై అడ్డగోలుగా విద్యుత్‌ ‌బిల్లుల భారం మోపడాన్ని నిరసిస్తూ బీజేపీ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నిర్వహించింది. అధిక బిల్లుల రద్దుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకూ పోరాటం కొనసాగించాలని నిర్ణయించింది. అసంబద్ధమైన బిల్లులను మాఫీ చేయాలనే డిమాండ్‌తో బీజేపీ తలపెట్టిన ఆందోళనను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. హైదరా బాద్‌లో పార్టీ ముఖ్య నేతలను సోమవారం ఉదయమే పోలీసులు హౌస్‌ అరెస్టు చేయగా, జిల్లా కేంద్రాలలో కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనలో భాగంగా నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి విద్యుత్‌ ‌సౌధకు బయల్దేరిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను మింట్‌ ‌కాంపౌండ్‌ ‌వద్ద అదుపులోకి తీసుకోగా, పలువురు రాష్ట్ర కమిటీ సభ్యులను అరెస్టు చేసి ఆబిడ్స్ ‌పోలీస్‌ ‌స్టేషన్‌కు తరలించారు. పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు
డా.కె.లక్ష్మణ్‌ను ముషీరాబాద్‌లో, నగర బీజేపీ అధ్యక్షుడు ఎన్‌.‌రాంచందర్‌రావును తార్నాకలోని నిజామాబాద్‌ ఎం‌పీ ధర్మపురి అర్వింద్‌ను బంజారాహిల్స్‌లో వారి నివాసాల్లో హౌస్‌ అరెస్టు చేశారు. పార్టీ సీనియర్‌ ‌నేత పొంగులేటి సుధాకరరెడ్డిని మింట్‌ ‌కాంపౌండ్‌ ‌వద్ద, రంగారెడ్డి జిల్లా విద్యుత్‌ ‌కార్యాలయం వద్ద పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, పెంచిన విద్యుత్‌ ‌బిల్లులపై ఆందోళన నిర్వహించిన బీజేపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడంపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ లాక్‌డౌన్‌ ‌సమయంలో ప్రజలు బయటకు రాలేక పోవడంతో ఉద్యోగ, ఉపాధి లేక ఆర్థికంగా చితికి పోయారని చెప్పారు.

ప్రజలకు ఊరట కలిగించాల్సిన ప్రభుత్వం కరెంటు బిల్లుల రూపంలో నెత్తిన పిడుగు వేసిందని ధ్వజమెత్తారు. మూడు నెలలు వినియోగించిన యూనిట్లను సగటు చేయడం ఎక్కడి విధానమో అర్థం కావడం లేదని మండిపడ్డారు. ఖజానా నింపుకునేందుకే ప్రభుత్వం తప్పుడు విద్యుత్‌ ‌చార్జీలను వసూలు చేస్తున్నదని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ ‌వడ్డీ వ్యాపారిగా వ్యవహరిస్తున్నారనీ, కొరోనా వైరస్‌ ‌కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం రూ. కోట్లు ఇస్తే టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్దారు. లాక్‌డౌన్‌ ‌నిబంధనల మేరకు భౌతిక దూరం పాటిస్తూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలను ప్రభుత్వం అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు. పెంచిన బిల్లుల మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలనీ, లేని పక్షంలో ప్రభుత్వం దిగివచ్చే వరకూ బీజేపీ ఉద్యమిస్తుందని స్పష్టం చేశారు. సీఎం మూర్ఖపు విధానాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను దోచుకోవాలనే దురుద్దేశంతోనే ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా విద్యుత్‌ ‌చార్జీలను పెంచిందని ధ్వజమెత్తారు. గడువు లోగా విద్యుత్‌ ‌బిల్లులు చెల్లించని పక్షంలో కనెక్షన్‌ ‌కట్‌ ‌చేస్తామని బెదిరించడం సరైన పద్దతి కాదని పేర్కొన్నారు. పెంచిన విద్యుత్‌ ‌బిల్లుల పెంపుపై ప్రభుత్వం ఇప్పటికైనా దిగిరాని పక్షంలో భవిష్యత్తులో ఆందోళనలు ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా బండి సంజయ్‌ ‌స్పష్టం చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!