- విద్యుత్ అధికారి శ్రీధర్ స్పష్టీకరణ
- అన్ని కోణాల్లో దర్యాప్టు చేపట్టిన అధికారులు
- భవనంలోపల తగ్గని పొగ వేడి…డ్రోన్ సాయంతో వివరాల సేకరణ
- గల్లంతైన ముగ్గురి మృతదేహాల గుర్తింపు…కాలి బూడిదయిన శరీరాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 20 : సికింద్రాబాద్ అగ్నిప్రమాదం ఘటన మరో మలుపు తిరిగింది. డెక్కన్ స్పోర్టస్ స్టోర్‌లో మంటలు చెలరేగడానికి కారణం షార్ట్ సర్క్యూట్ కారణం కాదని విద్యుత్ శాఖ అధికారి శ్రీధర్ తెలిపారు. షార్కట్ సర్క్యూట్‌తోనే మంటలు చెలరేగినట్లు తొలుత వార్తలు వొచ్చాయి. అయితే, వాటిని విద్యుత్ అధికారులు తోసిపుచ్చారు. మంటలు వ్యాపిస్తున్న సమయంలో వి•టర్లలో కరెంటు సరఫరా ఉందని విద్యుత్ శాఖ అధికారి శ్రీధర్ వెల్లడించారు. ఒక వేళ షార్ట్ సర్క్యూట్ జరిగే ఉంటే సబ్‌స్టేషన్‌లో ట్రిప్ అయ్యేదని, కానీ ప్రమాదంజరిగినప్పుడు అలా జరుగలేదన్నారు. ప్రమాదానికి సంబంధించి సమాచారం అందడంతో వెంటనే భవనానికి విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు వివరించారు.
ఒక వేళ షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటే వి•టర్లు, తీగలు పూర్తిగా కాలిపోయేవని వివరించారు. అగ్ని ప్రమాదం ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. ఘటనాస్థలానికి వెళ్లిన జీహెచ్ఎంసీ అధికారులు బిల్డింగ్‌ను పరిశీలిస్తున్నారు. పొగ దట్టంగా కమ్మేయడం, వేడి కారణంగా లోపలకు వెళ్లడం కష్టంగా మారింది. బిల్డింగ్‌లో ఐరన్ ర్యాక్‌లు ఏర్పాటు చేసి టాన్‌ల కొద్దీ బట్టలను నిల్వచేసినట్లుగా అధికారులు గుర్తించారు. ఫ్యాబ్రిక్ కావడంతో మంటలు వేగంగా వ్యాపించి ఉంటాయని అనుమానిస్తున్నారు. మరోవైపు గంటల తరబడి మంటలు కొనసాగడంతో భవనం పటిష్టతపై అనుమానాలు నెలకొన్నాయి. టెక్నికల్ టీం, స్టక్చర్రల్ ఇంజనీర్స్ భవనాన్ని పరిశీలించిన అనంతరం కూల్చివేయాలని నిరణయించారు. మంటలు వ్యాపించిన భవనంతో పాటు చుట్టుపక్కల ఉన్న భవనాల పటిష్టతను సైతం అధికారులు పరిశీలిస్తున్నారు.
అగ్ని ప్రమాదం జరిగిన డెక్కన్ స్టోర్స్‌లో ముగ్గురు కార్మికులు చిక్కుకు పోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మంటలు చెలరేగిన సమయంలో మంటలు రాగానే 17 మంది భవనం నుంచి బయటకు వొచ్చారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సామగ్రి తెచ్చేందుకు వెళ్లి ముగ్గురు లోపల చిక్కుకుపోయారని పేర్కొన్నారు. అయితే, చిక్కుకుపోయిన కార్మికులు బీహార్‌కు చెందిన కార్మికులు జునైద్ (25), జహీర్ (22), వసీం (32)గా తెలిపారు. అయితే, భవనంలో చిక్కుకుపోయిన ఒకరు మృతి చెందినట్లుగా సమాచారం. ప్రమాదం తర్వాత ముగ్గురు ఆచూకీ కనిపించకుండా పోయింది. ఈ నేపథ్యంలో భవనంలోనే చిక్కుకుపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. కాగా డెక్కన్ స్టోర్ భవనం యజమాని జావేద్ పరారీలో ఉన్నట్లు తెలుస్తున్నది.
భవనంలోపల తగ్గని పొగ వేడి…డ్రోన్ సాయంతో వివరాల సేకరణ
డెక్కన్ స్పోర్టస్ స్టోర్స్‌లో అగ్ని ప్రమాదం అనంతరం పరిస్థితిని అధికారులు సవి•క్షిస్తున్నారు. పొగ, వేడి కారణంగా లోపలికి వెళ్లి పరిశీలించడం కష్టంగా మారడంతో పోలీసులు డ్రోన్ సాయం తీసుకుంటున్నారు. దాన్ని ఉపయోగించి భవనం లోపల పరిస్థితితో పాటు బిల్డింగ్ స్ట్రక్చర్ ఎలా ఉందన్నది పరిశీలిస్తున్నారు. సెకండ్ ఫ్లోర్లో ఒక డెడ్ బాడీ ఆనవాళ్లు ఉన్నట్లు ఫైర్ సిబ్బంది చెప్పడంతో డ్రోన్ సాయంతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు సెంట్రల్ జోన్ డీసీపీ రాజేష్ చంద్ర చెప్పారు. సెల్లార్ నుంచి మంటలు ప్రారంభమైనట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. అయితే మంటలు ఎలా అంటుకున్నాయన్నది మాత్రం ఇప్పటికి తెలియలేదని చెప్పారు.
గల్లంతైన ముగ్గురి మృతదేహాల గుర్తింపు…కాలి బూడిదయిన శరీరాలు
సికింద్రాబాద్ డెక్కన్ మాల్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. వీరి మృతదేహాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి గుర్తుపట్టలేని విధంగా కాలిపోయి బూడిద అయినట్లు తెలుస్తుంది. ఎముకలు, టీత్ పరీక్ష ద్వారానే ఈ బాడీస్‌ను గుర్తించే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. గురువారం అగ్నిప్రమాదం సంభవించినప్పుడు లోపల చిక్కుకున్న నలుగురిని సిబ్బంది కాపాడారు. అయితే వసీం, జునైద్, జహీర్ అనే ముగ్గురు మాత్రం షెట్టర్లు మూసేందుకు మంటల్లోనే లోపలికి వెళ్లారు. రాత్రి వరకు వాళ్ల ఆచూకీ తెలియరాలేదు. దీంతో శుక్రవారం ఉదయం మళ్లీ అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలోనే ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. అయితే ఇవి వారివేనా కాదా అని నిర్దారించాల్సి ఉంది. మరోవైపు ఘటనా స్థలంలోనే గల్లంతైన యువకుల ఫోన్ సిగల్స్ చూపిస్తున్నాయని అధికారులు తెలిపారు. ముగ్గురు బీహార్‌కు చెందిన వారు కాగా వారు ఏడాదిగా స్టోర్స్‌లో పనిచేస్తున్నట్లు తెలుప్తుంది.