Take a fresh look at your lifestyle.

అహోరాత్రాలు శ్రమిస్తున్న విద్యుత్‌ ‌సిబ్బంది

కొరోనా మహమ్మారి నుంచి ప్రజల ప్రాణాలను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపడుతోంది. ప్రజలు ఎవరూ ఇళ్లనుంచి బయటకు రాకుండా లాక్‌డౌన్‌ ఆయుధాన్ని ప్రయోగించింది. కొరోనా దెబ్బకు అన్ని రకాల వ్యవస్థలూ కుప్పకూలాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సైతం అత్యవసర సేవల సిబ్బంది తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజలకు నిరంతరం ఏ ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. ఇందులో వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ ‌సిబ్బంది, పోలీసు శాఖ, పారిశుధ్య కార్మికులు, మీడియా ఇలా ఎవరి బాధ్యతను వారు సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. అలాగే, రాష్ట్రంలో కొరోనా వైరస్‌ ‌నియంత్రణకు విద్యుత్‌ ‌సిబ్బంది కూడా ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు సహకరించడంతో పాటు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా అహోరాత్రాలు శ్రమిస్తున్నారు. అయినప్పటికీ విద్యుత్‌ ‌సిబ్బంది అందిస్తున్న సేవలను ఎవరూ గుర్తించకపోవడం శోచనీయం.

పొద్దున లేస్తే వార్తా పత్రికలు, టీవీ చానల్స్‌లో వైద్యులు, పోలీసులు, పారిశుధ్య కార్మికుల సేవలను కొనియాడుతున్న వారే తప్ప విద్యుత్‌ ‌సిబ్బంది పడుతున్న శ్రమను అందిస్తున్న సేవలను గుర్తించినట్లుగా కనిపించడం లేదు. అందరికీ కరంటు కావాలి అది లేకపోతే ఏ పనీ జరగదు. వైద్యులు కొరోనా లక్షణాలున్న వ్యక్తికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరపాలన్నా, ఆసుపత్రిలో శస్త్ర చికిత్స నిర్వహించాలన్నా, ప్రభుత్వం నిబంధనల ప్రకారం ప్రజలు లాక్‌డౌన్‌ ‌నిబంధనలు పాటించి ఏసీలు వేసుకుని టీవీలో ప్రోగ్రామ్‌లు చూస్తూ ఇళ్లలోనుంచి బయటికి రాకుండా ఉండాలన్నా 24 గంటల విద్యుత్‌ ‌సరఫరా కావాల్సిందే. అది లేకపోతే ఏ పనీ జరగదు. వైద్యులు రోగులకు మాత్రమే సేవలు అందిస్తారు, పోలీసులు అవసరమైన వారికే సహాయపడతారు, పారిశుధ్య కార్మికులు అవసరమైన చోటనే పని చేస్తారు. కానీ, విద్యుత్‌ ఉద్యోగులు దేశంలోని 130 కోట్ల మంది ప్రజల కోసం 24 గంటల కష్టపడుతూ ఉన్నా తగినంత గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత లాక్‌డౌన్‌ ‌పరిస్థితులలో ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది వచ్చినా క్షణాల్లో పరిష్కరిస్తూ సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తున్న విద్యుత్‌ ‌సిబ్బందికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వకున్నా వారి సేవలను గుర్తించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

విద్యుత్‌ ‌సిబ్బంది 24 గంటలూ శ్రమిస్తున్నారు : దేవులపల్లి వెంకటేశ్వరరావు, రాష్ట్ట్ర విద్యుత్‌ •రెగ్యులేటరీ కమిషన్‌ ‌సలహాదారు ప్రస్తుత లాక్‌డౌన్‌ ‌సమయంలో విద్యుత్‌ ‌సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తున్నారు.24 గంటలూ అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఎక్కడా ఎలాంటి చిన్న ఇబ్బంది తలెత్తినా క్షణాల్లో పరిష్కరిస్తున్నారు. సిపిడిసిఎల్‌, ఎన్‌పిడిసిఎల్‌ ‌సీఎండీ స్థాయి అధికారులు సైతం పవర్‌ ‌పాయింట్‌ ‌లెవల్లో విద్యుత్‌ ‌సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తూ తమ కింది స్థాయి సిబ్బందికి ఎప్పటికప్పుడు అవసరమైన సూచలను, సలహాలు ఇస్తున్నారు. విద్యుత్‌ ‌సరఫరాలో రాష్ట్రంలో ఎక్కడ ఇబ్బంది తలెత్తినా, ఎలాంటి అవాంతరం ఎదురైనా వెంటనే సరిచేస్తున్నారు. బిల్లుల చెల్లింపు విషయంలోనూ వినియోగదారులు ఇబ్బంది పడకుండా మార్చి ఏప్రిల్‌ ‌నెలల్లో గత ఏడాది మార్చి, ఏప్రిల్‌ ‌నెలల్లో చెల్లించిన బిల్లులనే చెల్లించమని చెబుతున్నాం.

ఒకవేళ బిల్లులలో ఏవైనా వ్యత్యాసాలు ఉంటే వాటిని వచ్చే బిల్లులలో సరిచేస్తాం లాక్‌డౌన్‌లో మీటర్‌ ‌రీడింగ్‌లు, బిల్లులు లేకుండా చూస్తున్నాం. : కృష్ణయ్య, రాష్ట్ర ఎలక్ట్రిసిటి రెగ్యులేటరీ బోర్డు సభ్యుడు ప్రస్తుత లాక్‌డౌన్‌ ‌సమయంలో ఎలాంటి మీటర్‌ ‌రీడింగ్‌లు, బిల్లులు లేకుండా చూస్తున్నాం. మా సిబ్బంది వల్ల వినియోగదారులకు, వినియోగదారుల వల్ల మా సిబ్బందికి కొరోనా సోకకుండా చూడాలన్నదే మా ఉద్దేశం. లాక్‌డౌన్‌తో ప్రజలు ఇళ్లలోనూ ఉంటున్న కారణంగా గృహ విద్యుత్‌ ‌వినియోగం గతంలో ఎన్నడూ లేనంతగా భారీ స్థాయిలో పెరిగింది. అయినప్పటికీ ప్రజలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాం. అలాగే, ప్రస్తుత సమయంలో కొత్త కనెక్షన్లు, ఫిర్యాదులను పక్కనబెట్టి కేవలం నిరంతర విద్యుత్‌ ‌సరఫరాపైనే ప్రధానంగా దృష్టి సారించాం.తెలంగాణలో గతంలో ఉన్న నెట్‌వర్క్ ‌సామర్థ్యం కంటే మూడు నాలుగింతలు అధికంగా పెంచుకోవడం విజయం సాధించాం. దీంతో ఎక్కడ లో వోల్టేజ్‌ ‌సమస్య వచ్చినా, హై వోల్టేజితో ఫీడర్‌ ‌కాలిపోయినా వెంటనే దానిని సరిదిద్ది ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. అలాగే, మల్టిపుల్‌ ‌సోర్స్‌ను సైతం పెంచుకుని విద్యుత్‌ ‌సరఫరాలో ఎక్కడైనా ఇబ్బంది తలెత్తితే మార్గమధ్యంలో ఎక్కడైనా అంతరాయం కలిగిన పక్షంలో మరో ప్రాంతం ద్వారా పునరుద్ధరించి వెంటనే విద్యుత్‌ ‌సరఫరా జరిగేలా చూస్తున్నాం.

Leave a Reply