Take a fresh look at your lifestyle.

చైర్మన్‌ ‌కుర్చీపైనే అందరి గురి మున్సిపాలిటిలో ఎన్నికల కోలాహలం

Electoral extravaganza in the municipality is all about the chairman

తాండూర్‌  ‌బెల్లంపల్లి మున్సిపాలిటిలోని ఎన్నికల వాతావరణం వేడి ఎత్తకపోయినా ప్రధాన రాజకీయ పక్షాలు మాత్రం వూహాత్మకంగా వ్యవహారిస్తున్నాయి. మున్సిపల్‌ ‌చైర్మన్‌ ‌పదవి ఈసారి ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వ్‌చేయడంతో ఆదిశగా యత్నాలు సాగిస్తున్నారు. ఎస్సీలకు రిజర్వ్ ‌చేసిన అవార్డుల పై ప్రధానంగా దృష్టి పెట్టి అర్హులైన అభ్యర్దులను పోటీలో దింపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.  చైర్మన్‌ అభ్యర్దిగా ఇంత వరకు ఏ రాజకీయ పార్టీ కూడా ఎవరి పేరు ప్రకటించకపోయినా ఎస్సీలకు కేటాయించిన వార్డులలో పోటీ చేసే అభ్యర్దుల గురించి ప్రధానంగా చర్చించారు. గత మాధురి గా కాకుండా ఈ సారి అచితూచిగా వ్యవహారిస్తున్నారు. ఎక్కడ పేరు బయటపెట్టకుండా గుట్టుగా పెడుతుందా అన్వేషణ చేస్తున్నారు. టిఆర్‌ఎస్‌ ‌కాంగ్రెస్‌ ‌పక్షాలు సమ ఉజ్జీల కోసం ఆరా తీస్తున్నడటం ఆసక్తి కలిగిస్తుంది.

ఎస్సీలకు రిజర్వ్ ‌చేసిన వార్డులు ఇవి
బెల్లంపల్లి మున్సిపాలిటిలో 34 వార్డులు ఉన్నాయి. వీటిలో జనాభా ప్రకారం ప్రత్యేకంగా 10 వాళ్ళను ఎస్సీలకు కేటాయించారు. ఇందులో ఐదు వార్డులో ఎస్సీ మహిళ 6 వార్డు ఎస్సీ జర్నల్‌ 7 ‌వార్డు ఎస్సీ మహిళ 8 వార్డు ఎస్సీ మహిళ 11 ఎస్సీ మహిళ 15వ వార్డు ఎస్సీ జర్నల్‌ 19‌వార్డ్ ఎస్సీ జర్నల్‌ 20‌వార్డ్ ఎస్సీ జర్నల్‌ 21‌వార్డ్ ఎస్సీ జర్నల్‌ 25‌వార్డ్ ఎస్సీ మహిళలకు రిజర్వ్ ‌చేశారు. వీటిలో ఎస్సీ జర్నల్‌కు కేటాయించిన అవార్డుల పై గురి పెట్టారు. 6,15,19,20,21 వార్డ్‌లను ఎస్సీ జర్నల్‌గా ప్రకటించడంతో ఆ వార్డులలో పోటీలు నిలబడే అభ్యర్దులు ఎవరనేదిచర్చ జరుగుతుంది. ఆయా వార్డులలో నుండి పోటి చేసే అభ్యర్దుల నుంచి చైర్మన్‌ అభ్యర్దిని ఖరారు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అందువల్ల ఎస్సీ జర్నల్‌ ‌వార్డులలో ఈసారి తీవ్రమైన పోటీ ఉండే అవకాశం కనిపిస్తుంది.

మహిళలకు అవకాశం ఇస్తారా..పురుషుడికి పట్టం కడతారా..
మున్సిపల్‌ ‌చైర్మన్‌ ‌పదవి ఎస్సీలకు రిజర్వ్ ‌చేసి నేపథ్యంలో రకరకాల ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎస్సీలకు చైర్మన్‌ ‌పీఠం కట్టబెట్టిన ఆ సామాజిక వర్గానికి చెందిన మహిళలను పీఠం ఎక్కి ఇస్తారా లేదా పురుషుడికి అవకాశం కల్పిస్తారా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. అయితే మారిన పరిస్దితుల నేపథ్యంలో ప్రస్తుతం పోటీతత్వంలో పురుషుడిని చైర్మన్‌ ‌చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయని రాజకీయ పరిశీలకులు ఉన్నాయన్నారు. ఇందు కోసం తీవ్రంగానే ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ ‌జారీ అయింది కానీ అభ్యర్దులా అంశం కాస్త కొలిక్కి రానున్నట్లు ఆయా పార్టీల నాయకులు చెప్పుకుంటున్నారు. ఏదేమైనప్పటికి ఎన్నికల కోలాహలం మొదలైంది. ఎన్నికల నామినేషన్‌ ‌షురూ మొదటి రోజు బెల్లంపల్లి మున్సిపాలిటి ఎన్నికల నామినేషన్‌ ‌ప్రారంభమైంది. ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇవ్వడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ముందస్తు ప్రకటించినట్టుగానే ఎన్నికల నోటిఫికేషన్‌ ‌జారీ చేసిన బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. బెల్లంపల్లి మున్సిపాలిటిలో తొలి రోజున 9 మంది అభ్యర్దులు నామినేషన్‌ ‌పత్రాలను దాఖలు చేశారు. టిఆర్‌ఎస్‌ ‌పార్టీ తరపున 6 కాంగ్రెస్‌ ‌పార్టీ తరపున 2 ఇండిపెండెంట్‌ అభ్యర్ది ఒకరు నామినేషన్‌ ‌పత్రాలను అందజేశారు. టిఆర్‌ఎస్‌ అభ్యర్దులు 13 వార్డు నుండి ఇద్దరు 17.12.3.21 ఒక్కరు చొప్పున నామినేషన్‌ ‌పత్రాలు అందించగా 13.19 వార్డుల నుండి ఒకరు చొప్పున కాంగ్రెస్‌ ‌నాయకులు 24వ వార్డు నుండి ఇండిపెండెంట్‌ అభ్యర్దిగా నామినేషన్‌ ‌పత్రాలను దాఖలు చేశారు. మున్సిపల్‌ ‌కార్యాలయం వద్ద భ వరీ పోలీస్‌ ‌బందోబస్తును ఏర్పాటు చేసిన బెల్లంపల్లి ఎసిపి ఎంఎ రెహమాన్‌ ‌పర్యవేక్షణలో ఎన్నికల బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tags: 2020 municipal elections, thandur bellapalli, constancy

Leave a Reply