Take a fresh look at your lifestyle.

‌రాష్ట్రంలో ఎన్నికలు అక్టోబర్‌లోనా… డిసెంబర్‌లోనా ?

మొన్న రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు రాష్ట్ర శాసనసభ ఎన్నికలు డిసెంబర్‌లో వొస్తాయన్నారు. నిన్న బిఆర్‌ఎస్‌ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అక్టోబర్‌లో ఎన్నికల వొచ్చే అవకాశాలున్నాయి సిద్ధంగా  ఉండాలని తమ పార్టీ నాయకులను హెచ్చరించారు. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలవైపే మొగ్గు చూపుతోంది. రాష్ట్రంలోని బిజెపి వర్గాలు కూడా  2024 జనవరిలో జరిగే పార్లమెంటు ఎన్నికలతోనే రాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరిపితేనే తమకు లాభిస్తుందన్న ఆలోచనతో కేంద్రంపైన వొత్తిడి తీసుకువస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ ఎన్నికల్లో హ్యాట్రిక్‌ ‌సాధించాలని బిఆర్‌ఎస్‌ ‌పార్టీ నిశ్చయించుకుంది. అలాగే ఎట్టి పరిస్థితిలో అధికార పార్టీని శంకరగిరి మాణ్యాలు పట్టించాలని బిజెపి పట్టుదలగా ఉంది. అందుకు పార్లమెంటు ఎన్నికలతోపాటు రాష్ట్ర ఎన్నికలు జరిపితే తమకు కలిసి వొస్తుందను కుంటున్నాయి బిజెపి వర్గాలు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌బిఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుంటుందన్న ప్రచారం జరుగుతున్నది. నరేంద్ర మోదీని గద్దె దించి, అధికారాన్ని హస్తగతం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్న కాంగ్రెస్‌, అం‌దుకు కలిసివొచ్చే ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకునే ఆలోచనలో ఉంది.

అందులో భాగంగా కాంగ్రెస్‌  ‌బిఆర్‌ఎస్‌ ‌వైపు మొగ్గు చూపుతుందన్న ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌ ‌బిఆర్‌ఎస్‌ ‌రెండూ ఒకటేనని ఇప్పటికే బిజెపి ప్రచారం చేస్తున్న కాంగ్రెస్‌ ‌కేవలం పార్లమెంటు ఎన్నికలు మాత్రమే జరిగితే బిర్‌ఎస్‌ ‌లాభపడే అవకాశాలుంటాయన్నది బిజెపి అభిప్రాయంగా తెలుస్తున్నది. అలాకాకుండా ఉండాలంటే  జమిలి ఎన్నికలకు జరుగాలన్నది  ఆ పార్టీ ఆకాంక్ష.   ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు కలవడానికి రాష్ట్ర కాంగ్రెస్‌ ‌నాయకత్వం ఎట్టి పరిస్థితిలోనూ అంగీకరించదు. అలాంటప్పుడు జమిలి ఎన్నికలవేళ పై రెండు పార్టీల బంధం అయోమయంలో పడుతుందన్నది బిజెపి ఆలోచనగా తెలుస్తున్నది. దీని దృష్ట్యా సిఎం కెసిఆర్‌ ‌మరోసారి ముందస్తు ఎన్నికల ఆలోచన చేస్తున్నాడా అన్న అనుమానాలకు తావేర్పడుతోంది. అందుకే అక్టోబర్‌లో ఎన్నికలు రావొచ్చంటూ ఇటీవల ఆయన చేసిన ప్రకటన వెనుక రాజకీయపు ఎత్తుగడ ఉండిఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకపక్క కేంద్రం, ఎన్నికల కమిషన్‌• ‌జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై ఆలోచిస్తున్న తరుణంలో కెసిఆర్‌ ఇలాంటి ప్రకటన చేయ డమేంటన్న చర్చ జరుగుతోంది. వాస్తవంగా ఈ ఏడాది చివరిలో కొత్త అసెంబ్లీ కొలువుదీరాల్సి ఉంది. అలాంటప్పుడు ఎన్నికల నోటిఫికేషన్‌, ఎన్నికల ప్రక్రియ అంతా ముందస్తుగానే  జరుగాల్సి ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని కెసిఆర్‌ అక్టోబర్‌ అం‌శాన్ని ఎత్తుకున్నాడా లేక నిజంగానే డిసెంబర్‌కన్నా ముందు అక్టోబర్‌లోనే ఎన్నికలకు రాష్ట్రం సిద్ధమవుతున్నదా  అన్న తర్జనబర్జన జరుగుతోంది.

అయితే ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌  ‌సిద్ద పడుతుందా అన్నది కూడా ఒక ప్రశ్నే.  డిసెంబర్‌- ‌జనవరి మధ్య కాలంలో నాలుగు రాష్ట్రాల ఎన్నికలను ఎన్నికల కమిషన్‌• ‌జరుపాల్సి ఉంది.  డిసెంబర్‌ 16‌లోగా మిజోరాం ఎన్నికలు పూర్తి కావాల్సి ఉండగా, మధ్య ప్రదేశ్‌, ‌రాజస్థాన్‌, ‌ఛత్తీస్‌ఘడ్‌ ఎన్నికలు డిసెంబర్‌ ‌చివరి తేదీలోగా జరుగాల్సిఉన్నాయి. అలాగే తెలంగాణరాష్ట్ర ఎన్నికలు వొచ్చే సంవత్సరం జనవరి పదిహేనవ తేదీలోగా పూర్తి కావాల్సి ఉంది. అలాంటప్పుడు పై  నాలుగు రాష్ట్రాలతో కలిపి కాకుండా తెలంగాణ ఎన్నికలు వేరుగా జరిపే అవకాశం లేదు.  కాగా, షెడ్యూల్‌ ‌ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ఇప్పటికే అనేక సార్లు ప్రకటించిన  కెసిఆర్‌  ‌గురువారంనాటి ప్రతినిధుల సభలో ప్రత్యేకంగా అక్టోబర్‌లో ఎన్నికలు వొచ్చే అవకాశం ఉందనడం వెనుక మర్మమేంటన్నదిప్పుడు రాష్ట్రంలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. నాలుగు నెలల్లో ఎన్నికలు రానున్నాయని,  రాష్ట్రంలో నిలిచిపోయిన, పెండింగ్‌ ‌పనులను సత్వరం పూర్తి చేయాలంటూ ఆయన నాయకులను వేగిరపర్చడం చూస్తుంటే త్వరలో ఎన్నికలు రాబోతున్నాయన్న తొందరపాటు కనిపిస్తున్నది. దాన్ని దృష్టిలో పెట్టుకునే వరంగల్‌లో అక్టోబర్‌  ‌పదవ తేదీన భారీ బహిరంగ • సభ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కెటి రామారావు ప్రకటించి ఉంటాడనుకుంటున్నారు. ఈ సభకు రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలవారితో పాటు సుమారు పది లక్షల మందిని తరలించాలన్న నిర్ణయం తీసుకున్నారు. వాస్తవంగా టిఆర్‌ఎస్‌ ‌బిఆర్‌ఎస్‌గా మారింది అక్టోబర్‌ 5‌వ తేదీ కాగా, ఆ పార్టీ పేరు మార్చిన తేదీని దృష్టిలో పెట్టుకుని ఆవిర్భావ దినోత్సవాన్ని పదవతేదీన జరుపాలని నిశ్చయించినట్లు తెలుస్తున్నది.

ఇదిలా ఉంటే గతంలో సిట్టింగ్‌లకే టికట్‌ ఇస్తామని ప్రకటించిన కెసిఆర్‌, ‌సిట్టింగ్‌ల్లో కనీసం ముప్పై అయిదుగురు ఎమ్మెల్యేల  పట్ల ఆసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే ఎంఎల్యే ల పనితీరుపై ఆయన వివిధ రీతుల్లో సర్వేలు చేయించినట్లు తెలుస్తున్నది. ఎమ్మెల్యేల  మీద ఎలాంటి ఆరోపణలు వొస్తున్నాయి.. ప్రజలతో వారి ప్రవర్తన ఏ విధంగా ఉంది.. ఎలాంటి దందాల్లో పాల్గొంటున్నారన్న విషయాలపై సమగ్ర సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తున్నది. అందుకే ఆయన దళిత• బంధు లబ్ధిదారులనుండి మూడు లక్షల రూపాయలమేర వసూలుచేసిన వారి చరిత్ర తన వద్ద ఉందని గురువారంనాటి ప్రతినిధుల సమావేశంలో హెచ్చరించారు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని గతంలో చర్చ జరిగినట్లు ముందస్తు ఎన్నికలకు పోయే సాహసం  కెసిఆర్‌ ‌చేస్తారా అన్నది ప్రశ్నార్థకం..!.

Leave a Reply