Take a fresh look at your lifestyle.

సింగరేణిలో ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే ..?

గుర్తింపు నాలుగేళ్లంటున్న టీబీజీకేఏస్‌ – ‌తోడవుతున్న కొరోనా సెకండ్‌ ‌వేవ్‌…
‌గోదావరిఖని, 26 మార్చి, (ప్రజాతంత్ర ప్రతినిధి) : సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘానికి ఎన్నికలు ఇ ప్పుడు లేనట్టేనని స్పష్టమవుతోంది. గుర్తింపు సంఘంగా గెలిచిన టీబీజీకేఏస్‌ ‌యూనియన్‌ ఎన్నికల షెడ్యూల్‌ అం‌తకు ముందున్న కాలపరిమిత నాలుగేళ్లపాటు వుండాలని సంఘం టీబీజీకేఏస్‌ ‌ప్రధానకార్యదర్శి మి ర్యాల రాజిరెడ్డి బాహాటంగా ప్రకటిస్తున్నారు. అవసరమై తే న్యాయస్థ్గానాన్ని ఆశ్రయించడానికి సిద్దంగా వున్నామ ని ప్రకటించారు. సింగరేణి సంస్థలో ఇప్పుడు జరగబో యేది ఏడవసారి ఎన్నిక, గతంలో ఎన్నికలు ప్రారంభమై న 1998లో గుర్తింపు సంఘ కాలపరిమితి రెండేళ్లకాల మే వుండేది. మొదటి రెండు పర్యాయయాలు రెండేళ్లు వుండగా, ఆ తరువాత నాలు•గేళ్ల కాలపరిమితిని పెంచారు. మొదటి రెండు దఫాలుగా ఎఐటియుసి గుర్తిం పు యూనియన్‌గా గెలుపొందింది. అనంతరం జరిగిన మూడోసారి ఎన్నికల్లో ఐఎన్‌టియుసి గుర్తింపు సంఘం గా గెలవడంతో అప్పటి యూనియన్‌ అధ్యక్షులు బి.వెంక ట్రావ్‌ ‌నాలుగేళ్ల కాలపరిమితిగా పెంచారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో ఎఐటియుసి గెలుపొంది నాలుగు సంవత్సరాలు కొనసాగింది. 5,6వ దఫాల్లో టీబీజీకేఏస్‌ ‌వరుస వియాలు సాధించింది.

కాలపరిమితిలేని ఎన్నిక గెలిచిన నాటినుండి వివాదమే
సంస్థలో ఆరోసారిగా గుర్తింపు సంఘం ఎన్నికలు 2017, అక్టోబర్‌ 5‌న జరిగాయి. ఈ ఎన్నికల్లో టీబీజీకే ఏస్‌ ‌భారీ మెజారిటీతో గుర్తింపు సంఘంగా కాకుండా ప్రాతినిధ్య సంఘాలుగా కూడా భూపాలపల్లి మినహాయి స్తే మిగిలిన మూడు డివిజన్లలో టీబీజీకేఏస్‌ ‌ఘన విజ యం సాధించి రికార్డు సాధించింది. అయితే ఈ ఎన్నిక ల షెడ్యూల్‌లో కాలపరిమితిని నింపకుండా వదలిపట్టా రు. కేంద్ర  కార్మికశాఖ నుండి వచ్చిన తరువాత కాలపరిమితిని నిర్ణయిస్తామని, ఎన్నికల నిర్వహించిన అధికారులు తెలిపారు.ఎన్నికల సమయం అప్పటికే జాప్యం జరిగినందున మొదట ఎన్నికలు నిర్వహించడా నికి ఆ తరువాత కాలపరిమితిని లాంచనంగా ప్రకటి స్తారని, గెలుపు ధీమా కలిగిన సంఘాలన్ని సంతకాలు చేశాయి. ఆ తరువాత కాలపరిమితిని కుదిస్తూ… ఆదేశాలు రావడంతో దాదాపు ఆరునెలల కాలం టీబీజీకేఎస్‌ ‌దృవీకరణ పత్రం తీసుకోకుండా న్యాయస్థా నాలను ఆశ్రయించింది. రాష్ట్ర హైకోరు  కేంద్ర కార్మిక శాఖ నుండి వచ్చిన కాలపరిమితిని తాము నిర్ణయించలే మని తేల్చింది. ఆ తరువాత మరో కోర్టుకు పోవచ్చనే ధీమాతో కాలపరిమితి అవుతున్న దృష్ట్యా 2018 ఏప్రిల్‌ ‌లో టీబీజీకేఏస్‌ ‌గుర్తింపు సంఘం దృవీకరణ పత్రాన్ని ఎన్నికల నిర్వహించిన కార్మికశాఖ నుంచి పొందింది. అప్పటి నుంచి ఈ వివాదం ఇలానే కొనసా గుతుంది. తమకు నాలుగు సంవత్సరాల  కాలపరిమితి కావాలని గుర్తింపు సంఘం వాదిస్తుండగా, కేంద్ర కార్మిక శాఖ నిర్ణయించిన రెండేళ్లకు కొనసాగించి, ఎన్నికలు నిర్వహిం చాలని ఐదు జాతీయ సంఘాలు డిమాండ్‌ ‌చేస్తున్నాయి.

కాలపరిమితి అయిపోయినా టీబీజీకేఏస్‌ ‌కొనసాగడం అనైతికం
సింగరేణిలో ఎన్నికల నిర్వహించిన కార్మికశాఖాధికారు లు దృవీకరిస్తున్న రెండు సంవత్సరాలను కాదని, కాలప రిమితిని వారే పెంచుకుటూ గుర్తింపు సంఘంగా కొనసా గడం అనైతికమని టీబీజీకేఏస్‌పై జాతీయ కార్మిక సంఘాలు ఐఎన్‌టియుసి, ఎఐటియుసి, హెచ్‌ఎం ఎస్‌, ‌బీఎంఎస్‌, ‌సిఐటియులు నిప్పులు కక్కుతున్నాయి. నైతికత వుంటే ఎన్నికలు నిర్వహించాలని టీబీజీకేఏస్‌, ‌సింగరేణి యాజమాన్యాన్ని వారు డిమాండ్‌ ‌చేస్తున్నారు. ఓడిపోతా మనే భయంతోనే టీబీజీకేఏస్‌ ‌కాలపరిమితిని అక్రమం గా వాడుకుంటుందని, ఇందుకు సింగరేణి అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రజాప్రతినిధులు  సహకరిస్తున్నారని జాతీయ కార్మిక సంఘాలు వాపోతున్నారు.

అక్టోబర్‌ ‌వరకు కొనసాగే అవకాశం
దేశవ్యాప్తంగా గత మార్చి నెల నుండి కొనసాగుతున్న లాక్‌డౌన్‌, ‌కోవిడ్‌-2019 ‌ప్రభావితం ఫలితంగా సింగ రేణి ఎన్నికలు అనివార్యంగా వాయిదాపడుతూ వస్తున్న యి. గుర్తింపు సంఘం వాయిదాకు పరోక్షంగా కోవిడ్‌ ‌తోడుకావడంతో గుర్తింపు సంఘంగా టీబీజీకేఏస్‌ ‌కొన సాగుతున్నది. ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించినా ఈ మేరకు సింగరేణి అధికారులు సర్క్యులర్‌లు పంపినా కోవిడ్‌ ‌ముందుకు సాగనివ్వడం లేదు. మే, జూన్‌ ‌నెలల్లో ఎన్నికలు జరగు తాయనుకుంటే మళ్లీ కోవిడ్‌ ‌సెకండ్‌ ‌వార్‌ ‌ప్రభావం కొనసాగుతుందని పలువురు భావిస్తున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని కట్టుదిట్టం కూడా చేస్తున్నారు. ఎన్నికలు నిర్వహించడానికి ప్రస్తుతం అనుకూల పరిస్థి తులు లేనట్టుగానే భావించవచ్చు. ప్రస్తుతం గుర్తింపు సంఘంగా కొనసాగుతున్న టీబీజీకేఏస్‌ ఎన్నికైన కాలప రిమితి అక్టోబర్‌ ‌నెలతో నాలుగు సంవత్సరాలు పూర్తవు తున్నందున అక్టోబర్‌ అనంతరమే ఎన్నికలు నిర్వహణ జరుగుతుందని కార్మికులు, కార్మిక నాయకులు, పరిశీలకులు భావిస్తున్నాయి.

Leave a Reply