Take a fresh look at your lifestyle.

ఎన్నికలు కీలం..ఆలోచించి వోటు వేయండి

  • టిఆర్‌ఎస్‌ ‌పార్టీతోనే హైదరాబాద్‌ అభివృద్ధి
  • రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు

టిఆర్‌ఎస్‌ ‌పార్టీతోనే హైదరాబాద్‌ అభివృద్ధి చెందిందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు అన్నారు. శుక్రవారం జీహెచ్‌ఎం‌సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రామచంద్రాపురం డివిజన్‌ ‌టీఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థి బూరుగడ్డ పుష్ప నగేష్‌ ‌యాదవ్‌కు మద్దతుగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు అశోక్‌ ‌నగర్‌, ‌జ్యోతి నగర్‌ ‌లలో ఇంటింటికి ప్రచారం నిర్వహించడంతో పాటు రోడ్‌ ‌షో నిర్వహించారు. కారు గుర్తుకు వోటు వేసి బూరుగడ్డ పుష్ప నగేష్‌ ‌యాదవ్‌ను అత్యధిక మెజారిటీతో కార్పొరేటర్‌గా గెలిపించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్‌ ‌విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో జరుగుతున్న ఈ ఎన్నికలు కీలకమని పేర్కొన్నారు.

ప్రజలు విజ్ఞతతో వోటు వేయాలని కోరారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌ ‌నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. పేద ప్రజలకు అండగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నారని తెలిపారు. ప్రతిపక్ష పార్టీల మాటలు నమ్మి వోటు వృథా చేసుకోవద్దని సూచించారు. బీజేపీ, కాంగ్రెస్‌ ‌పార్టీల నాయకులు మాటలు చెప్తారు కానీ వారికి పనులు చేయడం చేతకాదన్నారు. రామచంద్రాపురం పట్టణానికి చెందిన కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నాయకుడు శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ‌మంత్రి హరీష్‌ ‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌ ‌పార్టీలో చేరారు. దీంతోపాటు పటాన్‌ ‌చెరు పట్టణంలోని టీఆర్‌ఎస్‌ ‌సీనియర్‌ ‌నాయకులు ఎం.దేవేందర్‌ ‌రాజు, నర్ర బిక్షపతి లను మంత్రి కలిసి ఎన్నికల ప్రచార సరళి గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ భూపాల్‌ ‌రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ ‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, పార్టీ అభ్యర్థి పుష్ప నగేష్‌ ‌యాదవ్‌, ‌సీనియర్‌ ‌నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply