Take a fresh look at your lifestyle.

ఎన్నికల అధికారులు .. స్వతంత్రంగా బాధ్యతలు నిర్వర్తించాలి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ‌పార్థసారధి

 

రానున్న జీహెచ్‌ఎం‌సి ఎన్నికలలో రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ ‌రిటర్నింగ్‌ అధికారులు తమ బాధ్యతలను స్వతంత్రంగా, రాజ్యాంగబద్ధంగా నిర్వర్తించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ‌సి.పార్థసారధి అన్నారు. ఎన్నికల బాధ్యతలు నిర్వర్తించడాన్ని రాజ్యాంగపరంగా కలిగిన గౌరవంగా భావించాలని సూచించారు. శుక్రవారం ఎంసిహెచ్‌ఆర్‌డిలో జీహెచ్‌ఎం‌సి ఎన్నికల రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ ‌రిటర్నింగ్‌ అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల విధుల కోసం చాలా వరకు అనుభవం ఉన్న వారినే నియమించడం జరిగిందనీ, చట్టంలోని నియమ నిబంధనలను క్షుణ్నంగా ఆకళింపు చేసుకుని అవసరమైనప్పుడు గట్టిగా ఉంటూనే పారదర్శకంగా విధులు నిర్వర్తించాలని పేర్కొన్నారు.
స్వీకరించే నాటి నుంచి గెలిచిన అభ్యర్థిని ప్రకటించే వరకూ రిటర్నింగ్‌ అధికారులు జాగ్రత్తగా నియమ నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని అందుకు అవసరమైన మెటిరియల్‌ను ముందుగానే అందించడం జరుగుతుందన్నారు. వార్డుల వారీగా జోనల్‌ అధికారులు, రూట్‌ అధికారులు టీంలపై అవగాహన పెంచుకోవాలనీ,
పోస్టల్‌ ‌బ్యాలెట్‌ ‌ప్రతీ ఉద్యోగికీ అందేలా చూడాలన్నారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో ఒకటైన హైదరాబాద్‌లో ఎన్నికల విధులు నిర్వర్తించడం సులువైన పనేననీ, ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. కోవిడ్‌ ‌నేపథ్యంలో ప్రతీ స్టేజ్‌లో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతీ ఒక్కరూ మాస్కు ధరించేలా భౌతిక దూరం పాటించేలా శానిటైజర్లు వినియోగించేలా చూడాలని సూచించారు. జీహెచ్‌ఎం‌సి కమిషనర్‌ ‌లోకేష్‌కుమార్‌ ‌మాట్లాడుతూ రానున్న జీహెచ్‌ఎం‌సి ఎన్నికలను నిర్వహించే విషయంలో జిహెచ్‌ఎం‌సి సిబ్బంది కూడా తమ వంతుగా సహాయ సహకారాలు అందజేస్తారని తెలిపారు. రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ ‌రిటర్నింగ్‌ అధికారులు ఎటువంటి సందేహాలనైనా సంబంధిత సిబ్బందితో సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చన్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో జీహెచ్‌ఎం‌సి ఉన్నతాధికారులతో పాటు సుమారు 450 మంది రిటర్నింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply