Take a fresh look at your lifestyle.

ఈ ‌నెల 29న జిల్లా సహకార బ్యాంక్‌ ‌చైర్మన్‌ ఎన్నికలు

dccb

  • తొమ్మిది జిల్లాలో ఏకగ్రీవం చేసే ఆలోచన
  • సహకార బ్యాంకులతో పాటు డీసీఎంస్‌ ఎన్నికలు
  • రైతుసంఘం నాయకులకు ప్రాధాన్యం  

రాష్ట్రంలోని అన్నీ జిల్లా కేంద్రాలలో జిల్లా కో-ఆపరేటివ్‌ ‌సెంట్రల్‌ ‌బ్యాం•(డీసీసీబీ)• ఎన్నికలను నిర్వహించేందుకు సహకార ఎన్నికల సంఘం అడిషనల్‌ ‌రిజిస్ట్రార్‌ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ నెల 29న జిల్లా సహకార బ్యాంక్‌ ‌చైర్మన్‌, ‌వైస్‌చైర్మన్‌లను ఎన్నుకోనున్నారు.ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని తొమ్మిది డిసిసిబీలను కైవసం చేసుకునేందుకు టీఆర్‌ఎస్‌ ‌రాజకీయ వ్యూహాలను సిద్దం చేసింది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలు కొత్త జిల్లాల పద్ధతిలో జరిగినప్పటికీ జిల్లా కో-ఆపరేటివ్‌ ‌బ్యాంక్‌ ఎన్నికలు మాత్రం ఉమ్మడి జిల్లాల పద్ధతిలోనే జరుగనున్నాయి.జిల్లా కో-ఆపరేటివ్‌ ‌బ్యాంకుల చైర్మన్‌, ‌వైస్‌ ‌చైర్మన్‌ ఎన్నికలను ఈ నెల 29లోగా పూర్తి చేస్తారు. ఆతర్వాత ఎన్నికైన చైర్మన్‌లు తెలంగాణ రాష్ట్ర కో-ఆపరేటివ్‌ ‌సెంట్రల్‌ ‌బ్యాంక్‌ ‌చైర్మన్‌ను ఎన్నుకుంటారు. ప్రస్తుతం రాష్ట్ర చైర్మన్‌గా రవీందర్‌రావు వ్యవహరిస్తున్నారు. ప్రతీ జిల్లాలో ఎన్నికైన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్‌లు జిల్లా సహకార బ్యాంక్‌ ‌డైరక్టర్‌లను ఎన్నుకుంటారు.ఈ డైరక్టర్‌లు జిల్లా చైర్మన్‌ను ఎన్నుకుంటారు. అదేవిధంగా జిల్లా కో-ఆపరేటివ్‌ ‌మార్కెటింగ్‌ ‌సొసైటీల(డీసీఎంఎస్‌) ‌డైరక్టర్‌, ‌చైర్మన్‌లను ఎన్నుకోనున్నారు. కాగాడీసీసీబిలకు 16 డైరక్టర్‌ ‌పదవులు, డిసీఎంస్‌లకు 10 డైరక్టర్‌ ‌పదవులు ఉంటాయి. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ఈ ఎన్నికలు జరుగనున్నాయి.29న జరిగే డీసీసీబీ డైరక్టర్‌, ‌చైర్మన్‌ ఎన్నికల్లో పీఏసీఎస్‌ ‌చైర్మన్‌లతో పాటు, చేనేత, మత్స్య సహకార సంఘాల సభ్యులు, పాలసేకరణ సహకార సంఘాల సభ్యులు ఓటింగ్‌లో పాల్గొంటారు. ఈ సంఘాలన్నింటికీ తప్పనిసరిగా రైతులను మాత్రమే ఎన్నుకోవాలనే ప్రయత్నంతో టీఆర్‌ఎస్‌ ‌రైతు సమన్వయ సమితి రైతులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం. రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, ‌వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కేటీఆర్‌లకు విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకార రంగంలో రైతులకే మొదటి స్థానం ఇవ్వాలని, అదేవిధంగా వివిధ కులవృత్తుసంఘాల్లో ఆయా కులవృత్తుల సంఘాల పెద్దలకు ప్రాముఖ్యతను ఇస్తూ,కులవృత్తులను ఆధునిక పద్దతుల్లో నిర్వహించేందుకు కావాల్సిన సహకారాన్ని ప్రభుత్వం అందిస్తున్న విషయం తెలిసిందే.కాగా జిల్లా సహకార బ్యాంకులను ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌లోని వర్గపోరు మరోసారి తీవ్రస్థాయిలోకి చేరుకుంటున్నది. అన్నీ జిల్లాలో మంత్రుల మధ్యనే కోల్డ్‌వార్‌ ‌నడుస్తున్నదని టీఆర•ఎస్‌ ‌వర్గాల్లో చర్చ జరుగుతున్నది.నల్లగొండ సహకార బ్యాంక్‌ ‌చైర్మన్‌ ‌పదవిని పల్లా ప్రవీణ్‌కు ఇవ్వాలని రైతుసమన్వయ సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి పట్టుపడుతున్నారు. నిజామాబాద్‌ ‌జిల్లా బ్యాంక్‌ అధ్యక్ష పదవిని తన కుమారిడికి ఇవ్వాలని స్పీకర్‌ ‌పోచారం శ్రీనివాస్‌రెడ్డి జిల్లా నాయకులను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఎంఎల్‌ ఏ ‌సునీత తన భర్త మహేందర్‌రెడ్డిని జిల్లా బ్యాంక్‌ ‌చైర్మన్‌గా ఎన్నుకునేవిధంగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా ఎంఎల్‌ఏ ‌పద్మాదేవేందర్‌రెడ్డి తన భర్త దేవేందర్‌రెడ్డినే బ్యాంక్‌ ‌చైర్మన్‌ ‌చేయాలని పట్టుపడుతున్నారు. మొత్తంమీద వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌చెప్పే నిర్ణయాల ప్రకారమే అన్నీ జిల్లాలో ఏకగ్రీవంగానే జిల్లా సహకార బ్యాంక్‌ ఎన్నికలు జరుగుతాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.అయితే మహిళలు అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో కేటీఆర్‌ ఉన్నట్లు తెలిసింది.

Leave a Reply